Others

అవసరం లేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మణికర్ణిక -కథానాయికే తప్ప అసోసియేట్ కాదంటోంది కంగన రనౌత్. అర్థంకాలేదు కదూ! అయితే, చదవండి. ఆమె టైటిల్ రోల్ పోషిస్తున్న ‘మణికర్ణిక’ చిత్రానికి సహాయ దర్శకురాలిగా తన పేరు క్రెడిట్స్‌లో వేయొద్దని నిర్మాతలకు కంగన చెప్పిందన్నది బాలీవుడ్ టాక్. విజయేంద్ర ప్రసాద్ అందించిన ప్రతిష్ఠాత్మక మణికర్ణిక కథకు తొలుత దర్శకుడు క్రిష్. ఎన్టీఆర్ సినిమా కోసం మణికర్ణిక ప్రాజెక్టుకు క్రిష్ కొంతదూరమయ్యాడు. దీంతో ఒక షెడ్యూల్ దర్శకత్వ బాధ్యతలను కంగన భుజానికెత్తుకుంది. దర్శకత్వం అంటే ఏమిటో తెలీని ఆమెకింద తాను నటించడమేంటని ప్రాజెక్టు నుంచి కీలక పాత్రధారి సోనూసూద్ సైతం తప్పుకున్నాడు. అయినా కంగన వెనకడుగు వేయలేదు. ప్రాజెక్టునుంచి వాళ్లు తప్పుకోవడం తనతో విభేదాల వల్ల కాదని చెబుతూనే, 45 రోజుల షెడ్యూల్‌కు సమర్థంగా దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించింది. ప్రాజెక్టు షూటింగ్ దాదాపు పూర్తికావడంతో, అక్టోబర్ 2న టీజర్ విడుదల చేయడానికి సినిమా బృందం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా దర్శకత్వ బాధ్యత నిర్వర్తించినందుకు క్రెడిట్ ఇస్తామన్న స్టూడియోకు కంగన వద్దని చెప్పిందట. ‘అది నా బాధ్యతగా ఫీలయ్యానే తప్ప, పేరు కోసం కాదు’ అని, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ క్రెడిట్స్‌లో తన పేరు వేయొద్దని కంగన చెప్పినట్టు చిత్రవర్గాల సమాచారం. ఏదేమైనా కంగన ఇక్కడా ప్రత్యేకత చాటుకుంది. వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రంలో నటిగా ఇంకెలాంటి ప్రత్యేకత చూపుతుందో చూడాలి.