Others

అంత లేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంచుమించు పాతికేళ్ల క్రితం -కాదలన్ ఓ ఊపు ఊపేశాడు. ఇటు తెలుగులోనూ ప్రేమికుడిగా. అందుక్కారణం -ఊర్వశి ఊర్వశి.. టేకీటీజీ ఊర్వశీ అంటూ ప్రభుదేవా తిరిగిన మెలికలు, రెహమాన్ కట్టిన బాణీలు. ఎప్పటికీ అదో ట్రెండ్. అయితే, రీమిక్స్‌ల వ్యసనం వీడని బాలీవుడ్ తాజాగా ఆ పాటకు కొత్త వెర్షన్ తెచ్చింది. ప్రముఖ నిర్మాత భూషణ్‌కుమార్ నిర్మాతగా ప్రముఖ గాయకుడు యోయో హానీసింగ్ ఈ పాటను కంపోజ్ చేసి పాడాడు. ఫస్ట్‌లైన్ లిరిక్‌ను యాజిటీజ్‌గా వాడుకుని, మిగిలిన లిరిక్‌కు కొత్త వర్షన్ రాసుకున్నారు. కైరా అడ్వానీ, షాహిద్ కఫూర్‌పై నైట్ క్లబ్‌లో చిత్రీకరించినట్టు కనిపిస్తోన్న రీమిక్స్ ఆల్బమ్ ఒరిజినల్ వర్షన్ దరిదాపుల్లో కూడా లేదన్న విమర్శలు మొదలయ్యాయి. స్వీట్ మొమరీలాంటి సాంగ్‌ని డిస్ట్రర్బ్ చేయడం పట్ల నెట్టింట విమర్శలు చెలరేగుతున్నాయి. తెలుగులో హిట్టుమార్క్ అందుకున్న ‘అర్జున్‌రెడ్డి’ని హిందీలో ప్రమోట్ చేసేందుకు కైరా, షాహిద్‌లపై ఈ పాట షూట్ చేసినట్టు సమాచారం. ఈ పాటను ఎత్తుకుని పెద్ద పొరబాటు చేశారంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చెలరేగుతున్నాయి. పాత క్లాసిక్స్ పరువుతీసేలా ఇటీవలి కాలంలో బాలీవుడ్‌లో రీమిక్స్‌లు ఎక్కువవుతోన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య చేసిన హమ్మ హమ్మ, సారా జమానా పాటల రీమిక్స్‌లు ఒరిజినల్ వర్షన్ సమీపానికీ రాలేదు. సుస్మితసేన్ -దల్బీర్, రవీనాటాండన్ -తు చీజ్‌బడి హై మస్త్ మస్త్.. పాటలకు వచ్చిన రీమిక్స్ ఆకట్టుకోకపోవడం గమనార్హం.