Others

కలకంఠ కన్నీటికి నిర్వచనం కన్నాంబ( వెండి వెలుగులు-3)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మమతానురాగాలు కురిపించే చల్లని తల్లి ఆమె. పెత్తనం చెలాయంచే అత్తగారూ ఆమే. ఠీవి, దర్పం ఉట్టిపడే మహారాణి, మనోవేదనతో కుమిలిపోయే స్ర్తిమూర్తి, అన్యాయాన్ని ఎదిరించే విప్లవ వనిత.. వీటన్నింటికీ మించి ప్రేక్షక సానుభూతిని పొందే కరుణరసాన్ని పోషించడంలో ఘటికురాలామె. ఆమె -అభినయ సామ్రాజ్ఞి పసుపులేటి కన్నాంబ. దాదాపు మూడు దశాబ్దాలపాటు సినీ రంగానికి సేవచేసిన కన్నాంబ 1912లో కడపలో పుట్టారు. స్టేజి నాటకాలనుంచి ఎదిగారు. దర్శకుడు, నిర్మాత అయిన కడారు నాగభూషణం ఆమెను చంద్రమతి పాత్రలో ‘హరిశ్చంద్ర’ (యస్వీఆర్) చిత్రంతో వెండి తెరకు పరిచయం చేశారు. మనిషి మంచి పొడుగు. చూడగానే ఆకట్టుకోగల ముఖ వర్చస్సు. ఎత్తుగా, దానికి తగ్గట్టున్న బలిష్టం. చక్కని కంఠస్వరం, సంభాషణల ఉచ్ఛారణలో స్పష్టత. తనకిచ్చిన పాత్రను బాగా అర్థంచేసుకోగల నేర్పు. ఇవి ఆమెను మంచి నటిగా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాయ. ‘కనకతార’గా ఆమెను, ఆమె నటనను చూడ్డానికి ఆ రోజుల్లో జనం ఊళ్లనుండి బళ్లు కట్టుకుని వచ్చి చూసేవారు.
1943లో ‘శ్రీరాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ’ సంస్థను స్థాపించి కొన్ని చిత్రాలను కూడా (దక్షయజ్ఞం) నిర్మించారామె. -తల్లిప్రేమ, అనార్కలి, పాండురంగ మహత్మ్యం, దక్షయజ్ఞం, ఆత్మబంధువు, ఉషా పరిణయం, కార్తవరాయునికథ చిత్రాల్లో మమత నిండిన మాతృమూర్తి పాత్రలకు జీవం పోశారు. తోడికోడళ్లులో పెద్ద తోడికోడలుగా, ఆడ పెత్తనంలో ధనాశ కలిగిన అత్తగారిగా అనితర సాధ్య, అనుపమాన నటన ప్రదర్శించి, ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థానం సంపాదించింది.
నాయికగా ‘చండిక’లోను, ‘ముగ్గురు మరాఠీలు’, ‘పల్నాటి యుద్ధం’ (ఏయన్నార్) చిత్రాల్లో వాంప్ పాత్రల్లోను జీవించారు. ముఖ్యంగా ‘ముగ్గురు మరాఠీలు’లో మహారాణిగాను, అపర కాళిగా కళ్లు పెద్దవి చేసి, కత్తి ఝుళిపిస్తూ, చండ్ర నిప్పులు రాలుస్తూ.. ఎంతో సమర్థతతో, అసమాన నటనా ప్రతిభతో పాత్రలకు వనె్నతెచ్చింది. అటు నాటకాల్లోను, సినిమాల్లోను పాటలు, పద్యాలు స్వయంగా పాడుకున్నారు. కొన్ని ప్రైవేటు పాటలు కూడా పాడారామె.
‘సక్కుబాయి’(పాత)లో అత్తగారిగా, ‘పల్నాటియుద్ధం’లో నాయకురాలు నాగమ్మగా, ‘పాదుకా పట్ట్భాషేకం’(పాత)లో కైకగా వైవిధ్యంగల పాత్రలు వేశారామె. ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం మెండుగా, నిండుగా ఉన్న కన్నాంబ క్రమశిక్షణకు పెట్టింది పేరు.
శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు కన్నాంబ కుల దేవత. ఇలవేల్పు. ఆ అమ్మను పూజించనిదే ఏ పనీ ముట్టుకునేవారు కాదు. ఆమెకు వృత్తిమీద అత్యంత గౌరవం. కర్తవ్యం పట్ల శ్రద్ధ. నిండుగా, హుందాగా, ఠీవిగా ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల ధీశాలి కన్నాంబ. రిహార్సల్సు వేసుకునిగాని సంభాషణలు చెప్పేవారు కాదు. కన్నీళ్లు రావాలంటే గ్లిజరిన్ ఎప్పుడూ వాడని ఉత్తమ నటి కన్నాంబ. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన ద్విభాషా నటి. పాత్రలో పూర్తిగా లీనమైపోవడం, అత్యంత సహజంగా నటించడం ఆమె ప్రత్యేకత, విశిష్టత.
‘మాయామశ్చీంద్ర’ (పాత), ‘నాగపంచమి,’ ‘పేద రైతు’, ‘మాయాలోకం’, ‘లక్ష్మి’, ‘్ధర్మమే జయం’, ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’లో ద్రౌపది, ‘గృహలక్ష్మి’ (పాత)లో దేవుడూ లేడూ, సత్యం జయించదూ అంటూ ఉన్మాదినియై పరుగెత్తే పాత్ర, ‘సుమతి’లో సతీసమతి పాత్ర, ‘అనార్కలి’లో అక్బరు పట్టమహిషి జోధాబాయి పాత్ర, ‘కార్తవరాయని కథ’లో తల్లిపాత్ర, ‘దక్షయజ్ఞం’లో దక్షుని భార్య ప్రసూతిగా, ‘ఆత్మబంధువు’లో యస్వీఆర్ భార్యగా, ‘ఆత్మబలం’లో జగ్గయ్య తల్లిగా, ‘రాజమకుటం’లో రాకుమారునికి సలహాలిచ్చి సన్మార్గంలో నడిపే మహారాణి పాత్ర, ‘పాండురంగ మహత్మ్యం’లో నిగమశర్మ తల్లిపాత్ర, ‘కణ్ణగి’(తమిళం) చిత్రంలో కణ్ణగి పాత్రలను ప్రేక్షకులు నేటికి మరువలేరు. తన 52వ యేట 1954లో నిరుపేదగా మరణించారు.

-డా.దేశిరాజు లక్ష్మీనరసింహారావు