Others

కాలం మారింది! (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కె.విశ్వనాధ్ కథ, దర్శకత్వంతో వచ్చిన ‘కాలం మారింది’ సినిమా నాకు చాలా ఇష్టం. అంటరానితనం సమాజానికే హానికరమన్న ఇతివృత్తంతో నిర్మించిన చిత్రమిది. మారుతున్న దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా సమాజమూ మారాలని, దానికి పాత కొత్త తరాల బాధ్యత వుండాలని బోధిస్తుంది. ఈ చిత్రంలో పాత తరానికి గుమ్మడి, కొత్త తరానికి శోభన్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తారు. ఓర్పుతో, దృఢ సంకల్పంతో కులం మానవులు ఏర్పర్చుకున్న అడ్డుగోడ అని నిరూపిస్తారు.
సనాతన బ్రాహ్మణ కులానికి చెందిన పెద్ద రైతు గుమ్మడి. అతని భార్య అంజలి. నమ్మినబంటు రావుగోపాలరావు. తల్లిలేని పసిబిడ్డను పెంచుకుంటూ పొలం దగ్గరే ఉంటాడు. దొంగలనుంచి ధాన్యం కుప్పను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకుంటాడు. తండ్రికూడా లేని పాలేరు కూతురిని సాకే ప్రయత్నంలో గుమ్మడి దంపతులను ఊరు వెలేస్తుంది.
తెల్లవారేసరికి గుమ్మడి దంపతులు తమ కూతురిని, పాలేరు కూతురిని తీసుకుని కట్టుబాట్లకు దూరంగా పట్నంలో కాపురం పెడతారు. సొంత కూతురు గీత (గీతాంజలి), పెంపుడు కూతురు శాంతి (శారద)ని సమానంగా పెంచుతారు. ఇంటి బాధ్యతంతా శాంతి చూసుకుంటే, గీత ఆధునిక సంస్కృతిని అభిమానిస్తుంది.
అదే ఊళ్ళో సనాతనాచార సంప్రదాయాలను తు.చ తప్పకుండా పాటించే మడి, మట్టుగల అమ్మమ్మ సూర్యకాంతం, మనుమడు శోభన్‌బాబు ఉంటుంటారు. గుమ్మడి కూతురు గీతాంజలితో మనవడు శోభన్‌బాబుకు పెళ్లిచెయ్యాలన్న ఆమె ఆధునిక భావాల కారణంగా విఫలమవుతుంది.
శాంతి కూడా గుమ్మడి కూతురేనని తెలుసుకున్న శోభన్‌బాబు, ఆమెనే పెళ్లాడుతానని అమ్మమ్మకు చెప్తాడు. గుమ్మడి ద్వారా అసలు విషయం తెలుసుకున్న సూర్యకాంతం పెళ్లి జరగనివ్వదు. శాంతి కులం గురించి తెలుసుకున్న శోభన్‌బాబు, వూరినుంచి వెళ్లిపోబోయన శాంతికి ధైర్యం చెప్పి -ఇక్కడే వుండి కులం కుళ్లును మార్చాలి’ అని చెబుతాడు. దొంగస్వాముల దాడిలో సూర్యకాంతం గాయాలపాలవ్వడం, రక్తదానం చేసి శాంతి ఆమెను బతికించటం.. అదే అదనుగా అమ్మమ్మకు శాంతి కులం గురించి చెప్పి మార్పు తీసుకొస్తాడు శోభన్‌బాబు.
అంటరానితనం కుల వ్యవస్థ మనుషుల్లో విభేదాలు సృష్టించడానికేనని, అన్ని కులాల్లో మనుషులకున్న రక్తం గ్రూపులు అదేవిధంగా ఉంటాయని, సనాతనపరులతో సహా అందరికీ సందేశమిస్తుంది ‘కాలం మారింది’ సినిమా!

-చాలకొండ శారద, కావలి