Others

‘రాఫెల్’ మహా కుంభకోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగున్నరేళ్లుగా ప్రజలపై పెనుభారాలు మోపుతూ, రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసి భారతదేశాన్ని కార్పొరేట్లకు తాకట్టుపెడుతున్న నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్‌డిఏ సర్కారును సాగనంపడానికి సమయం ఆసన్నమైంది. అవినీతిని అంతం చేస్తామని ప్రగల్భాలు పలికిన ప్రధానమంత్రి మోదీ బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లకు అండగా నిలవడంతోపాటు స్వయంగా అవినీతి ఊబిలో కూరుకుపోవడం దారుణం.
స్వతంత్ర భారత చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో దేశ రక్షణను సైతం పణంగా పెట్టి నిస్సిగ్గుగా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీచేసిన ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుందనడంలో సందేహమే లేదు. ఇదే మహా కుంభకోణం.. ఫ్రాన్స్‌తో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం. దీని ద్వారా దేశ ఖజానాకు ఏ విధంగా కన్నం వేశారో.. అభిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) అధ్యక్షులు రాహుల్ గాంధీ ఇటీవల పార్లమెంటు సమావేశాలలో, పలు సందర్భాలలో పూసగుచ్చినట్లు వివరించారు. నరేంద్ర మోదీ సర్కారు అవినీతి బాగోతాన్ని ఎండగట్టారు. దీనిపై స్వయంగా ప్రధానమంత్రి, దేశ రక్షణ మంత్రి పార్లమెంటుకు తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా ప్రజలను ఏమార్చడానికి ప్రయత్నించి నవ్వులపాలైన సంగతి మనం చూస్తున్నాం. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంలో డసాల్ట్‌తో భాగస్వామిగా పనికిమాలిన రిలయన్స్ డిఫెన్స్ సంస్థను ఎంపిక చేసుకోమని చెప్పింది భారత ప్రభుత్వమేనని ఒప్పందం జరిగిన సమయంలో ఫ్రాన్స్ అధ్యక్షునిగా ఉన్న హోలేండే స్పష్టం చేశారు. ‘్భరత ప్రధాని మోదీ కొత్త్ఫార్ములా ప్రకారమే రిలయన్స్ డిఫెన్స్ ఎంపిక జరిగింది అని ఆయన ఫ్రెంచి పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు. ఇపుడు రాహుల్ ప్రయోగించిన ‘రాఫెల్’ అస్త్రం మోదీ సర్కారు గుండెల్లో గునపంగా మారింది. నిత్యం రాహుల్ వేస్తున్న ప్రశ్నలకు మోదీ సర్కారు వద్ద సమాధానాలే లేవు. మోదీ సర్కారు.. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం ద్వారా అవినీతికి పాల్పడటమే కాక దేశ ప్రయోజనాలను ఏ విధంగా కాలరాసిందో చూద్దాం.
దేశ రక్షణ కోసం యుద్ధ విమానాలను కొనుగోలు చేయడంతోపాటు, ఆయా విమానాల తయారీకి సంబంధించి అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకునే ఉద్దేశంతో ముందుగా 2007లో అప్పటి కాంగ్రెస్ సారథ్యంలోని యుపిఏ ప్రభుత్వం ఫ్రాన్స్‌తో ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం మొత్తం 126 యుద్ధ విమానాలు మనకి సరఫరా చేయాలి. ఇందుకు మనం చెల్లించే ధర సుమారుగా రూ.70వేల కోట్లు.
యూపిఏ ప్రభుత్వం పెట్టిన నిబంధనలు
-18 విమానాలు పూర్తిగా ఫ్రాన్స్‌లోనే తయారుచేయాలి. మిగతా విమానాలు అన్ని బెంగుళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ఆధ్వర్యంలో తయారుచేయాలి. ఇందుకు అవసరమయ్యే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం హెచ్‌ఏఎల్‌కి బదిలీ చేయాలి. ఒప్పందం ప్రకారం ఇచ్చిన రూ.70 వేల కోట్లలో (10.2 బిలియన్లు) 30 శాతం అనగా రూ.22వేల కోట్లు ఫ్రాన్స్ కంపెనీ తిరిగి హెచ్‌ఏఎల్‌లో పెట్టుబడులు పెట్టాలి. మొత్తం ఎయిర్‌క్రాఫ్ట్స్‌కి కావాల్సిన ఇతర పరికరాలు అన్ని ఫ్రాన్స్ కంపెనీ హెచ్‌ఏఎల్ నుండే కొనాలి.
పైన చెప్పిన నిబంధనలు పరిశీలించినట్లయితే... ఒప్పందం ప్రకారం మొత్తం 126 యుద్ధ విమానాలను రూ.70 వేల కోట్లకు ఫ్రాన్స్ కంపెనీ భారత్‌కి అప్పగించాలి. అంతేకాక దానిలో అత్యంత ముఖ్యమైన నిబంధన ఏమిటంటే.. విమానాల టెక్నాలజీని హెచ్‌ఏఎల్‌కి ఇచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో విమానాలు తయారుచేయాలి. దాని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన దగ్గర టెక్నాలజీ ఉండి, తయారీలో అనుభవం వస్తే భవిష్యత్‌లో మనం సొంతంగా యుద్ధ విమానాలు తయారుచేసుకోవచ్చు. కావాలంటే ఇతర దేశాలకి కూడా మనం కూడా ఎగుమతి చేసుకోవచ్చనే ముందుచూపుతో అత్యంత పకడ్బందీగా ఆ నిబంధనను ఒప్పందంలో పెట్టడం జరిగింది. (కేవలం టెక్నాలజీ విలువే సుమారు రూ.15 వేల కోట్లు ఉంటుంది)- ఇదీ ఆనాటి యూపిఏ ప్రభుత్వం దస్సాల్ట్ అనే ఫ్రాన్స్ కంపెనీతో చేసుకొన్న ఒప్పందం. ఇక్కడ ముఖ్యంగా గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, యూపిఏ ప్రభుత్వం, రక్షణ రంగంలో 100శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించలేదు.
ఎన్‌డిఏ అధికారంలోకి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక ఒప్పందం ఎలా మారిపోయిందో చూడండి... యూపిఏ ప్రభుత్వం చేసుకొన్న ఒప్పందం అమలులోకి రావటానికి ముందే ఎన్నికలు రావటం, ఆ తరువాత ప్రభుత్వాలు మారటం తెలిసిందే. ఆ తరువాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ముందుగా చేసిన పని ఏమిటంటే, రక్షణ రంగంలోకి విదేశీ పెట్టుబడులు 100 శాతం అనుమతించటం. దానిలో ఒక్క శాతం కూడా ప్రభుత్వ భాగస్వామ్యం అవసరం లేకపోవటం. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందగానే గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని మళ్లీ కొత్తగా కొత్త నిబంధనలతో మొదలుపెట్టడం.
దస్సాల్ట్‌తో మోదీ ప్రభుత్వ ఒప్పందం
- మొత్తం 36 యుద్ధ విమానాలు తయారుచేయాలి.
- 36 విమానాలకు చెల్లించాల్సిన ధర (8.6 బిలియన్లు) సుమారుగా రూ.60వేల కోట్లు.
- భారత్‌కి విమాన తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయాల్సిన అవసరం లేదు.
- ఏ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థలో ఫ్రాన్స్ కంపెనీ తిరిగి పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. తద్వారా మన విడిభాగాలు వాడాల్సిన అవసరం లేదు.
ఇపుడు పైన చెప్పినట్లు రెండు ప్రభుత్వాలు చేసుకొన్న ఒప్పందాలని గమనిస్తే, మోదీ సర్కారు ఆర్డర్ చేసిన 36 విమానాల ధర రూ.17 వేల కోట్లకు మించరాదు. అంతేకాదు ఇంకా తక్కువకే రావాలి, ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, విమానాల తయారీలో శిక్షణ, విడిభాగాల కొనుగోలు వంటి అదనంగా వచ్చే లాభాలు కూడా మనం వదులుకొంటున్నాము కాబట్టి ఇంకా తక్కువ ధరకే విమానాలు రావాల్సి వుంటుంది. కానీ మోదీ ప్రభుత్వం విమానాల కొనుగోలుకు నాలుగు రెట్లు అదనంగా చెల్లిస్తోంది.
డబ్బు ఎవరి ఖాతాలోకి పోతోంది?
ఈ అదనంగా చెల్లిస్తున్న డబ్బు ఎవరి ఖాతాలోకి పోతోంది? మహా కుంభకోణానికి సూత్రధారిగా రిలయన్స్ (అనిల్ అంబాని) ఎలా మారిందో ఇపుడు చూద్దాం...
మోదీ ప్రభుత్వం వచ్చాక కేంద్ర ప్రభుత్వ ప్రాధామ్యాలు మారిపోయాయి. ప్రభుత్వం కార్పొరేట్ల (బడా వ్యాపార సంస్థలు) కనుసన్నల్లో నడుస్తున్నది. దేశానికి అత్యంత కీలకమైన రక్షణ రంగం నుంచి కూడా ప్రభుత్వ సంస్థలని తప్పించటానికి 100 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతిస్తూ మోదీ ప్రభుత్వం చట్టంచేయడం జరిగింది. ఆ తర్వాతనే ఈ ఒప్పందాన్ని ఫ్రాన్స్ కంపెనీకి అప్పగించారు. ఆ తరువాత ఈ రంగంలో ఎలాంటి అనుభవం లేని రిలయన్స్ (అనిల్ అంబాని)తో యుద్ధ విమానాలకి సంబంధించిన విడి భాగాలు తయారు చేసే కంపెనీగా డొల్ల కంపెనీ ఒకదానిని ఈ సంవత్సరం జనవరిలో రిజిస్టర్ చేయించటం జరిగింది. అది కేవలం కాగితంపై రిజిస్టర్ అయిన కంపెనీ. దానికి కనీసం సైకిల్ బోల్ట్ తయారుచేసిన అనుభవం కూడా లేదు. ఆ తరువాత రాఫెల్ యుద్ధ విమానాల కాంట్రాక్టు పొందిన దస్సాల్ట్ అనే ఫ్రాన్స్ కంపెనీకి ఈ రిలయన్స్ జేబు కంపెనీకి మధ్య ఒప్పందం కుదిర్చారు. దాని ప్రకారం, దస్సాల్ట్ కంపెనీ రిలయెన్స్‌కి 50 శాతంవాటా ఇవ్వాలి. అనగా 30 వేల కోట్లు రిలయెన్స్‌కి ఇవ్వాలి. ఆ ఫ్రాన్స్ కంపెనీకి, ఈ రిలయెన్స్ డొల్ల కంపెనీ విమానాల తయారీలో ఏ విధంగా సహాయపడుతుందో మోదీ సర్కారుకే తెలియాలి. ఇక మొత్తం ఒప్పందాన్ని పరిశీలించినట్లయితే, రక్షణ రంగంలో 100 శాతం ఎఫ్‌డిఐలను అనుమతించడం మొదలెట్టి, యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పంద నిబంధనలను మార్చేయడం, ఇంకా 4 రెట్లు ధర అధికంగా చెల్లించటం, రిలయన్స్‌తో ఉత్తుత్తి కంపెనీ పెట్టించడం వరకు అంతా పక్కా ప్లాన్‌తో మోదీ ప్రభుత్వం వ్యవహరించింది. ఫ్రాన్స్ కంపెనీతో లోపాయికారి ఒప్పందం కూడా అదే. మీకు చెల్లిస్తున్న అదనపు ధర మీరు రిలయెన్స్‌కి చెల్లించాలి, దానికోసం వాళ్లకి 50 శాతం వాటా ఇవ్వాలి. ఈ విధంగా మొత్తం కుంభకోణాన్ని పకడ్బందీగా చట్టాలకి కూడా దొరకకుండా నడిపించారు.
ఇది కేవలం రాఫెల్ కథ మాత్రమే. నాలుగున్నరేళ్ల మోదీ పాలనలో మోదీ చేసే ప్రతి విదేశీ పర్యటన వెనుక ఇలాంటి కుంభకోణాలు అనేకం జరిగాయి. మోదీ అధికారంలోకి వచ్చాక మీడియా రంగంతో ఏ మాత్రం సంబంధం లేని రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబాని దేశం మొత్తంమీద 22 టీవీ చానల్స్‌ని సొంతం చేసుకున్నాడంటే ఈ ప్రభుత్వం కార్పొరేట్లకు ఎంతగా సహకరిస్తున్నదో స్పష్టమవుతోంది.
ఇంతేకాదు, దేశం యావత్తు నివ్వెరపోయే విధంగా పెట్రోలు, డీజిలు ధరలు లీటరు ఒక్కింటికి రూ.100లకు చేరువగా వస్తున్నాయి. నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చాయి. మరోపక్క రూపాయి విలువ రోజురోజుకీ పడిపోతున్నది. అడ్డగోలుగా జిఎస్‌టి అమలు చేయడం సహా నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న అస్తవ్యస్త ఆర్థిక విధానాల కారణంగా దేశం ఆర్థిక సంక్షోభ దిశగా పయనిస్తున్నది.

-- కొలనుకొండ శివాజీ