Others

ఆశీర్వచనమే ఔషధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాగణపతి షింపీ బాబా భక్తుడు. ఒకసారి అతను మలేరియా వ్యాధి బారినపడ్డాడు. ఎందరో వైద్యులకు చూపించుకున్నాడు. అన్నిరకాల ఔషధాలు వాడాడు. మరెన్నో కషాయాలు తాగాడు. అయినా ఫలితం లేకపోయింది. జ్వరం కొంచెం కూడా తగ్గలేదు. బాబా పైనే భారంవేసి వెంటనే శిరిడీకి పరుగెత్తాడు. బాబా పాదాలపై సాష్టాంగపడ్డాడు. బాబా అతనిని లక్ష్మీమందిరం వద్ద ఉన్న నల్ల కుక్కకు పెరుగన్నం కలిపి పెట్టమని సూచించారు. మలేరియా జబ్బుకు, నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టటానికి సంబంధం ఏమిటో బాలాగణపతికి అర్థంకాలేదు. అయినా, బాబాపైనే విశ్వాసం ఉంచి అలాగే చేశాడు. బాలాగణపతి లక్ష్మీమందిరం వద్దకు వెళ్లేసరికి అక్కడ పెరుగన్నం కోసమే కాచుకుని ఉన్నట్టు నల్ల కుక్క ఒకటి నిల్చుని ఉంది. అది బాలాను చూడడంతోనే తోక ఊపుతూ దగ్గరకు వచ్చింది. బాలా పెరుగన్నాన్ని దానికి పెట్టాడు. అంతటితో బాలాగణపతి మలేరియా జ్వరం చేత్తో తీసిపారేసినట్టు ఎగిరిపోయింది.
చెవిపోటుకు బాబా వాక్కే చికిత్స
ఆళంది నుంచి ఒక సన్యాసి బాబా దర్శనంకోసం శిరిడీ వచ్చాడు. అతను చెవిపోటుతో బాధపడుతూ నిద్రకు దూరమయ్యేవాడు. శస్తచ్రికిత్స చేయించుకున్నా నయంకాలేదు. బాధ తగ్గలేదు. ఏంచేయాలో తోచలేదు. బాబాను దర్శించుకుని తిరుగు ప్రయాణంకోసం అనుమతి కోరేందుకు నిల్చుని ఉన్నాడు. అతని తరఫున శ్యామా కల్పించుకుని అతని చెవిపోటు తగ్గటానికి ఏదైనా ఔషధం ఇవ్వరాదా అని బాబాను అడిగాడు. ‘్భగవంతుడు నీకు మేలుచేస్తాడు’’అని బాబా ఆళంది స్వామిని ఆశీర్వదించారు. ఆ సన్యాసి పూణావెళ్లి ఒక వారం తరువాత శిరిడీకి ఉత్తరం రాశాడు. తన చెవిపోటు తగ్గిందని, కాని ఇంకా వాపు తగ్గలేదని ఆ ఉత్తరంలో రాశాడు. అనంతరం వాపు తగ్గేందుకు శస్తచ్రికిత్స చేయించుకునేందుకు వైద్యులను కలిశాడు. అందుకోసం బొంబాయి వెళ్లాడు. వైద్యులు ఆలంది స్వామి చెవిని పరీక్షించి శస్తచ్రికిత్స అవసరం లేదని చెప్పారు. బాబా వాక్కే తన సమస్యను తీర్చిందని ఆళంది స్వామి విశ్వసించాడు.
కడుపు నొప్పికి ఆశీర్వచనాలే మందు
దత్తోపంతు హార్దా గ్రామ నివాసి. అతను కడుపునొప్పితో పధ్నాలుగు సంవత్సరాలు బాధపడ్డాడు. ఎన్ని ఔషధాలు వాడినా గుణమివ్వలేదు. బాబా కీర్తి గురించి విన్నాడు. దృష్టిమాత్రంతోనే వ్యాధులను దూరం చేస్తారని తెలుసుకుని శిరిడీకి వెళ్లి బాబా పాదాలపైపడ్డాడు. బాబా అతనిని తన దయాదృష్టితో ఆశీర్వదించారు. బాబా అతని తలపై తన చేతిని ఉంచి ఊదీ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించగానే అతని నొప్పి ఎగిరిపోయింది. తిరిగి మరెప్పుడూ అతను కడుపునొప్పితో బాధపడలేదు.
రాచకురుపు ఊదితో మాయం
నాసిక్ జిల్లా మాలేగాంలో ఒక డాక్టరు ఉండేవారు. ఆయన మేనల్లుడు రాచకురుపుతో బాధపడేవారు. స్వయంగా డాక్టరుతోపాటు ఇతర డాక్టర్లకు చూపించినా అది నయంకాలేదు. బంధువులు, స్నేహితులు శిరిడీలో ఉండే సాయిబాబాను దర్శించుకుంటే ఫలితం ఉంటుందని వారికి చెప్పారు. బాబా దృష్టిమాత్రంతోనే వ్యాధులను నయంచేస్తారని తెలిసి వారు కుర్రవాడిని తీసుకుని బాబావద్దకు వెళ్లారు. బాబాను పరిపరి విధాలుగా వేడుకోగా, బాబా వారితో ‘‘ఎవరైతే ఈ మసీదుకు వస్తారో వారెన్నడు ఈ జన్మలో ఏ వ్యాధిచేతా బాధపడరు. కనుక హాయిగా ఉండు. కురుపుపై ఊదీ పూయండి. వారంలో నయమవుతుంది. దేవునిపై నమ్మకం ఉంచండి. ఇది మసీదుకాదు ద్వారవతి. ఎవరైతే ఇక్కడ కాలు మోపుతారో వారు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందుతారు. వారి కష్టాలు గట్టెక్కుతాయి’’అన్నారు.
----------------------------------------------------------------------

సాయి విద్యా ఫౌండేషన్ ప్రచురించిన ‘సాయి జీవనం మోక్షమార్గం’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు స్థలం ‘సాయి విద్య ఫౌండేషన్, ఫ్లాట్ నెం.4, సాయిబాబానగర్ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23441123. ఎల్.ఐ.జి.49, ధర్మారెడ్డి నగర్, ఫేస్-1, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23445566