Others

వినూత్న ఆవిష్కరణకు విశిష్ఠ పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రసాయన శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం ఈ ఏడాది అమెరికాకు చెందిన ఫ్రానె్సస్ హెచ్. ఆర్నాల్డ్‌ను వరించింది. రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న ఐదో మహిళగా ఘనత సాధించింది ఫ్రానె్సస్. ప్రొటీన్లను ఉపయోగించి జీవ వైవిధ్య ఇంధనం నుంచి ఔషధాల తయారీ వరకు.. వివిధ రంగాల్లో చేసిన వినూత్నమైన ఆవిష్కరణకుగానూ ఈ అవార్డును ప్రకటించారు. ఫ్రానె్సస్‌తో పాటు అమెరికాకు చెందిన జార్జ్ పి. స్మిత్, బ్రిటన్‌కు చెందిన సర్ గ్రెగొరీ పి.వింటర్ కూడా ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. రసాయన శాస్త్రంలో మరియా స్కోలోడోవోస్కా క్యూరీ (1911), ఇరెనె జోలియట్ క్యూరీ (1935), డొరొతీ క్రోఫూట్ హాడ్‌కిన్ (1964), అడా ఇ. యోనత్ (2009) అనే మహిళలు నోబెల్ బహుమతులు అందుకున్నారు.