Others

ప్రాణశక్తి బాహ్య ప్రకటనయే ‘‘శ్వాస’’ ( పురాణాల్లో శాస్తవ్రిజ్ఞానం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు
H.No. 7-8-51, Plot No.18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079
-----------------------------------------------------------------------------
గర్భస్థ శిశువుకు గ్రహణశక్తి వున్నట్లు అంటే మనం చెప్పే విషయాలను లేక మాట్లాడుకునే మాటలనాలకించి అర్థం చేసుకునే శక్తికలదని మన పురాణాలలో అనేక కథల ద్వారా చెప్పబడింది. నారద మహర్షి చెప్పిన విష్ణుగాథలను తల్లి లీలావతి గర్భంలోనున్న ప్రహ్లాదుడు ఆలకించి విష్ణు భక్తుడగుట, ఉత్తర గర్భంలోను అభిమన్యుడు, అర్జునుడు చెప్పిన పద్మవ్యూహ ప్రవేశ విధానాన్ని విని గ్రహించగలగటం. అష్టావక్రుడు తల్లి గర్భంలో వుండి, తండ్రి శిష్యులకు బోధిస్తున్న వేదపాఠాలను విని అందలి తప్పొప్పుల నెత్తి చెప్పి తండ్రి ఆగ్రహానికి గురై శాపగ్రస్తుడగుట వంటి అనక కథ లిందులకు ఉదాహరణములు. ఇప్పుడు నవీన శాస్తజ్ఞ్రులు తమ పరిశోధనల ద్వారా యిది యదార్థమేనని అంగీకరిస్తున్నారు. ఇటీవల లండన్ నగరంలోని వైద్యులు వొక గర్భిణీ స్ర్తికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేసి, గర్భస్థ శిశువు పదే పదే నగరంలోని వైద్యులు ఒక గర్భిణీ స్ర్తికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేసి గర్భస్థ శిశువు పదే పదే నవ్వుతూ చప్పట్లు కొట్టడం గమనించి, ప్రసార సాధనాల ద్వారా ప్రపంచానికి తెలియచేశారు. మనలోనున్న మానసిక గుణములన్ని కూడ చిత్తశక్తి యొక్క వ్యక్తీకరణలే. ఈ ప్రాణశక్తి, చిత్తశక్తి, రెండు కూడా ప్రతి నిత్యము మన శరీరములో ఇడ, పింగళ, నాడుల ద్వారా సంచరిస్తూ ఉన్నాయి. నాడి అనగా ప్రవాహమని అర్థం. ఒక కరెంటు బల్బులోని పాజిటివ్, నెగెటివ్ వైర్లలాగా ప్రతి శరీర భాగములో ప్రాణశక్తి, మనోశక్తి కలిసి ఉంటాయి. ప్రాణశక్తి ధన విద్యుదావేశంగాను, మనోశక్తి లేక చిత్తశక్తి రుణవిద్యుదావేశముగాను భావించవచ్చు. ఈ రెండింటిలో ఒకటి ప్రవహించి, రెండవది ప్రవహించకపోతే మన అవయవములు పనిచేయవు. శ్రీ లలితా సహస్ర నామములలోని ప్రాణదా (783) ప్రాణధాత్రీ (832) ప్రాణరూపిణి (784) ప్రాణేశ్వరి (831) అనునామములు మన శరీరమునందలి ప్రాణముల ద్వారా అమ్మవారు తన ఈశత్వమును తెలియచేస్తుంది. మనలో పనిచేసే ప్రాణశక్తిని యిచ్చేది ఆ పరాశక్తియే కనుక ప్రాణదా అయింది. ‘‘కోటి వైద్యులు కూడి వచ్చినగాని మరణమిచ్చెడు వ్యాధి మాన్పలేరు’’ అని చెప్పినట్లుగా మందులు ప్రాణాలను (జఆ్ఘ ఇ్యజూక) యివ్వలేవు. మన శరీరంలో నిరంతరం, అశనములు (్జఘశజష), అనశనములు (జశ్యూఘశజష) గాను, అనశనములు, అశనములుగాను మార్పు ఛెందుతాయి. ఈ ప్రక్రియవల్ల దేహం (శరీరం) పెరుగుతుంది గాని, దేహి (జీవుడు) పెరగడు. పురుషసూక్తం (సాశనానశనే అభి) కూడా యిదే చెబుతోంది. ప్రాణ (అశన) అపాన (అనశన)ముల మధ్య జరిగేది. గతి స్పందనను, ఆంగ్లంలో యెఖఇళ ఔఖఒ్ఘఆజ్యశ అంటారు. ప్రాణశక్తిని, ప్రాణాగ్ని, పాచకాగ్ని, రేచకాగ్ని అని కూడా అంటారు.
మూడవది ఆత్మశక్తి లేక ఆధ్యాత్మిక శక్తి, ప్రాణశక్తి, చిత్తశక్తి రెండూ భౌతికశక్తులైతే ఆత్మశక్తి అభౌతికమైంది. ఇది నిరాకారమేకాక, సర్వోత్కృష్టమైనది కూడా. ఈ శక్తిని సమర్ధవంతముగా వినియోగించుకోకపోవడంవల్లనే మన మెదడులోని చాలా భాగము (85%) నిద్రాణమై వుండిపోతోంది. శ్వాస నియంత్రణ, యోగ, ధ్యానాది అభ్యాసముల చేత మన మెదడు (మస్తిష్కము)లోని నిద్రాణముగానున్న భాగమునకు కదలిక కలిగి, చైతన్యవంతవౌతుంది. దానివల్ల మానసిక ఆరోగ్యమేకాక, ఆధ్యాత్మిక జ్ఞానసంపద, వివేకము పెంపొందుతాయి.పైన చెప్పిన పంచ ప్రాణములతోపాటు, పంచ ఉపప్రాణములు కలవు. అవి చేసే పనులు తెలుసుకుందాము.
ప్రాణశక్తి యొక్క బాహ్య ప్రకటనయే ‘‘శ్వాస’.’ శ్వాస స్థూలమైనదైతే ప్రాణము సూక్ష్మశక్తి అవుతుంది. స్థూలశ్వాసను నియంత్రించటంవల్ల లోపలి సూక్ష్మ ప్రాణశక్తిని నియంత్రించవచ్చు. ప్రాణము, ప్రాణశక్తి, ప్రాణవాయువుల గురించి తెలుసుకొనుట వలన ప్రాణశక్తి, వివిధ నాడీ మండలములు, అవయవములు, శరీరములోని వివిధ భాగములను ఏ విధముగా పనిచేయించునో తెలుసుకొనుటకు వీలగును. శరీరములో పైన పేర్కొనిన ప్రాణముల సమతుల్యత లోపించినపుడు ఆయా భాగములు రోగగ్రస్తమగునని తెలుసుకోవాలి. ప్రాణాయామాది యోగక్రియలవల్ల, ప్రాణముల సంతుల్యతను సాధించి శారీరక, మానసిక ఆరోగ్యము పొందవచ్చును. ఏ ధర్మాచరణమునకైన, ముందు కావలసినది శరీరము కావుననే ‘‘శరీరమాద్యమ్‌ఖలు ధర్మసాధనమ్ ధర్మార్థ కామమోక్షానాం ఆరోగ్యమూల ముత్తమమ్’’ అన్నారు పెద్దలు. - ఇంకావుంది...

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9490947590