AADIVAVRAM - Others

ముందు చూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిత్రూ ఎయిర్‌పోర్ట్‌కి చేరబోతోంది లండన్ ఫ్లైట్.. ఫ్లైట్‌లోని వారందరినీ సీటు బెల్టులు పెట్టుకున్నారా! లేదా? అని చెక్ చేస్తున్నారు ఎయిర్ హోస్టెస్‌లు - పెట్టుకో చేతకాని వారికి హెల్ప్ చేస్తున్నారు - పెట్టుకోకుండా పట్టీ పట్టనట్లు, వినీ విననట్లు చూస్తున్న వారిని హెచ్చరిస్తున్నారు.
రమారమి పనె్నండు గంటల జర్నీ తర్వాత పాసింజర్స్ క్షేమంగా లండన్ చేరినందుకు ఊపిరి పీల్చుకుంటున్నారు. వాళ్లవాళ్లని కలవబోతున్నందుకు ఉత్సాహం కళ్లల్లో తెలుస్తోంది ఎయిర్ హోస్టెస్‌లకి. వాళ్లవీ సేమ్ ఫీలింగ్స్. కాబట్టి వాళ్లకి ఇట్టే తెలిసిపోతోంది.
వాళ్లందరూ బాధ్యతకు కట్టుబడి, సేవా దృక్పథంతో.. ఫ్లైట్‌లోకి రిసీవింగ్ ఎలా చేశారో వీడ్కోలు అలా చెక్కుచెదరని చిరునవ్వుతో ప్రకటిస్తున్నారు. అంతా కొత్తగా అనిపించింది సునయన, సృజన్‌లకి - బహుశా ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లో జర్నీ వారిరువురికి ఇది తొలి అనుభవం.
హ్యాండ్ లగేజ్ తీసుకుని ఎయిర్ బస్సు వైపుగా నడిచారు సునయన, సృజన్‌ల కళ్లు ఆత్రంగా కొడుకు, కోడలు, మనవల్ని ఎంత త్వరగా చూద్దామా అన్న కోరికతో వెతుకుతున్నాయి.
ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని బయటపడేసరికి అంతే ఆత్రంతో ఎదురుచూస్తున్నారు కొడుకు సునీత్, కోడలు మాధవి.. కాని సునయన కళ్లు మనవరాలు స్వప్నిని, మనవడు సన్నీని వెతుకుతున్నాయి ఆశగా.. అసలు కంటె వడ్డీ ముద్దు అన్నట్లు.
అది పసికట్టిన మాధవి ‘ఈ రోజు పిల్లలు ఇంకా లేవలేదత్తయ్యా. రాత్రంతా మీ గురించే ఆలోచిస్తూ లేట్‌గా పడుకున్నారు. అందుకని వాళ్లని చూస్తుండమని సులక్షణకి చెప్పి వచ్చేశాం’ అంది.
‘ఓహ్ సులక్షణ.. మా పెదనాన్నగారి మనవడి భార్య (స్వగతం) సృజన్‌కి - సులక్షణ లక్షణమైన పిల్ల. కాకపోతే సుధీర్, పెదనాన్నగారి మనవడికి కళ్లు, చెవులు, మనసు అన్నీ సులక్షణే. వాడి పంచేంద్రియాల్ని దాచేసి భార్యవి ఉపయోగించడం మొదలెట్టాడు పెళ్లాడిందగ్గర్నుంచి’ అంటూంటారు పరిచయమున్న మా దగ్గరి బంధువులందరూ.
ఇదీ మా వాళ్లందరి అనుభవం తనతో- చూడాలి మరి. ఇక్కడ సులక్షణ భావజాలం.. మాయాజాలం.. ఆరు నెలలు పొరుగునే ఉంటాం గదా!!
అందరం కలిసి ఔటింగ్ ప్లాన్ చేశాం. లండన్‌లో ముఖ్యమైన ప్రదేశాలు ప్లాన్ చేశారు.
ఇంటి నుండి ప్రిపరేషన్స్ పులిహోర, దద్ద్యోజనం, చపాతీలు మాధవి, సునయన తయారీ. సులక్షణ సూపర్ మార్కెట్ నించి ఫాస్ట్ఫుడ్స్.. కూల్‌డ్రింక్స్.. పలురకాల బిస్కెట్లు తెప్పించింది. ట్రిప్ బాగానే ఎంజాయ్ చేశాం. అందరం ఎంతో సంతృప్తిగా సుందర దృశ్యాల్ని ఆస్వాదించి గొప్ప అనుభూతిని పొందాం.
ఇంగ్లండ్ ఆల్‌మోస్ట్ చూసిన తృప్తితో ఇళ్లకి చేరాం.
అనుకున్న దానికన్నా రెండు మూడు రెట్లే ఖర్చు ఎక్కువైంది.
ఆనందం కూడా పొందింది ఎక్కువే కాబట్టి దానికి దానికి సరిపోయింది. వీకెండ్స్ ఏ పార్క్‌కో, గుడికో ప్లాన్ చేస్తాడు సునీత్. కాని స్వప్ని, సన్నీ శరవణ భవన్‌కి వెళ్లాలని ప్రపోజ్ చేశారు.. పెద్దవాళ్లం సరేనని తలూపేశాం.
అప్పుడు సృజన్‌కి కాస్త ప్రైవసీ దొరికింది. సునీత్‌ని చూస్తూ, ‘ఇల్లు నీ ఆఫీస్‌కి దగ్గరగా చూడు. నీకూ సౌకర్యంగా ఉంటుంది, ఖర్చూ తగ్గుతుంది..’ అంటూ లాన్‌లోకి చూశాడు.
‘ఎందుకు డాడీ సడెన్‌గా ఈ నిర్ణయానికి వచ్చారు.. సుధీర్, సులక్షణ మీకు కాలక్షేపం గదా!’ అంటూ డాడీ వైపు చూశాడు.
‘నిరాక్షేపణీయంగా కాలక్షేపమే. కాదనను. కానీ నీకు చాలా అసౌకర్యం అన్పించింది. ఐ మీన్.. నీ ఆఫీసుకి, ఇంటికి చాలా దూరం.. సగం దినం.. వెళ్లటానికి, రావటానికే సమయం తీసుకుంటోంది. అందుకనే ఆఫీసుకి దగ్గరగా కౌంటీస్‌లో ఇల్లు చూడు, ఖర్చులు కూడా తగ్గుతాయ్. పిల్లల్ని అక్కడే స్కూల్లో చేర్చవచ్చు’ అంటూ బిల్లు పే చేసి నాన్నగారు బయటకు వచ్చేశారు. సునయన సృజన్‌ని సమీపించింది సర్ది చెప్పటానికి.
సునయన నీకు తెలియదు ఇంకా ఆ పొరుగునే ఉంటే పిల్లలు మనకి దక్కరు.. దక్కరు గాక దక్కరు. పిల్లల మనసుల్ని కూడా విరిచేయగలదు ఆ జాణ.. అంటూ విసుగుదల వ్యక్తం చేశారు పొరుగనున్న సులక్షణ పట్ల.. సులక్షణ వైఖరి పట్ల విముఖత స్పష్టంగా కనపడ్తోంది సృజన్ ముఖంలో.
మీరు అన్నిటినీ భూతద్దంలో చూస్తున్నారిటీవల. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు అంటూన్నంతలోనే సునయనని అనునయిస్తూ, లేదు నేను పూర్వాపరాలు విచారించిన మీదట ఈ నిర్ణయానికి వచ్చాను. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. సునయన ప్లీజ్ చెప్పినట్లు చేయండి, దట్సాల్. చేతులు కాలిన పిదప అంగలార్చటం సరికాదు అంటూ విసవిస నడుచుకుంటూ ఇంటి వైపు దారి తీశాడు సృజన్. సృజన్‌ని అనుసరించక తప్పలేదు మా అందరికీ.. నో వే...
కౌంటీస్‌లోకి మారిపోయాం.
ఆ రోజు.. అంటే మేము కౌంటీస్‌కి మార్తున్నట్లు చెప్పగానే సులక్షణ, భర్త సుధీర్ తమ పొరుగు ఇకపై లేకుండా పోతున్నందుకు, చాలా దూరం వెళ్లిపోతున్నందుకు బాధ వ్యక్తం చేశారు. నేనెంతగా సర్ది చెప్పినా వాళ్లు ఏదో కారణాన్ని వెతుకుతున్నట్లే అన్పించింది, వాళ్ల మాటల్లో విన్పించింది అంది సునయన మాధవీ, సునీత్‌లతో.
ఏది ఏమైనా నాన్నగారు అలా సడెన్‌గా, మొండిగా ఈ నిర్ణయానికి రాకుండా ఉండవలసింది మమీ. మాధవి కూడా నొచ్చుకున్నట్లుగానే కన్పించింది సునయనకి.’
‘లేదురా ఎంతో కారణం లేకపోతే నాన్నగారు ఈ నిర్ణయానికి రారు. ఎందుకంటే నాన్నగారు లండన్‌కి వస్తూ, ‘సునయన మనకు లండన్‌లో మన పిల్లాడికి తోడు, అన్నయ్య మనవడు సుధీర్, సులక్షణ కూడా ఉంటారు - తోచదు అన్న బెంగ ఆట్టే ఉండదు అని నాకు ధైర్యం చెప్పారు. అలాటిది ఏదో బలమైన కారణం ఉంటే కాని ఈ నిర్ణయానికి రారు. ఏమోలే ఎప్పుడో ఆయనే బయటపడ్తారు - చూద్దాం అంటూ ఆ రోజు వంట ప్రయత్నానికి ఉద్యుక్తురాలైంది సునయన. ఈ విషయం తండ్రి దగ్గర గాని ప్రస్తావించే ధైర్యం లేకపోయింది సునీత్‌కి గాని, మాధవికి గాని.
సృజనే గొంతు విప్పాడు ‘చూడు సునీత్ మీరెవరూ ఇంట్లో లేరు. గుడికి వెళ్లారు. నాకెందుకో ఓపిక లేక నేను ఒక్కడినే ఇంట్లో ఉండిపోయాను. సులక్షణ అత్తగారి పేర్న ఉన్న ఒకే ఒక్క ఆస్తి 3 బి.కె ఫ్లాట్ అమ్మమని, లేదంటే తను ఇండియాకి రానని మొరాయిస్తున్నదట - అమ్మకి, చెల్లికి ఉన్న ఒకే ఒక నీడని ఎలా తీసేయడం అని తను వారిస్తున్నాడట. ఆమె, మీ చెల్లి, మనతో కలిసి ఉండాలంటే ఆ ఫ్లాట్ అమ్మి తీరవలసిందే, విల్లా కొనవలసిందే అని పేచీ పెట్టుకుందట. ఏం చెయ్యమంటారంకుల్ అని తల పట్టుక్కూర్చున్నాడు, కళ్లనీళ్ల పర్యంతమయ్యాడు నాతో చెప్పుకుని.
‘సునయన ఆ పరిస్థితి మనకు రాకమునుపే ఆ పొరుగు తప్పించటం సమంజసం అనిపించింది..’ అంటూ కళ్లు వొత్తుకుంటూ సృజన్ వౌనం వహించాడు. సృజన్‌ది చాలా సున్నితమైన మనసు. సృజన్ దుఃఖానికి కారణం ఒకటి అత్తపట్ల సులక్షణ వైఖరి.. రెండు తన వారసుడి కోసం సుధీర్ వారసత్వాన్ని కుదిపేయడం. ఏది ఏమైనా సృజన్ ఎప్పుడూ ముందు చూపుతోనే నిర్ణయం తీసుకుంటాడు.
సునయన తృప్తిగా ఊపిరి తీసుకుంది.
ఆద్యంతం విన్న సునీత్, మాధవీలకు వ్యాకులత పోయి, పెద్దవారి పట్ల ఆప్యాయత, ఆత్మీయత ఇనుమడించినట్లై, మునుపటి కంటె మిక్కిలిగా వారి పట్ల ప్రేమ వికసించింది.
తోటలోని గులాబీలు విరబూసి గుబాళించసాగాయి.

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505