AADIVAVRAM - Others

వింత దీవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన ఆసక్తి..
ఒకరికి సైకిల్‌పై ప్రపంచాన్ని చుట్టాలనిపిస్తే..
మరొకరికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలన్నింటినీ చూడాలనిపిస్తుంది..
ఇంకొకరికి ఎవరెస్ట్ ఎక్కాలని.. ఇలా భిన్నమైన ఆసక్తులు.. కొంచెం కష్టమైనా ఇలాంటి సాహసకార్యాలు అసాధ్యం కాదు. వీటిని సుసాధ్యం చేసినవారూ లేకపోలేదు. అయితే.. ఈ సువిశాల ప్రపంచంలో మరి కొన్ని ప్రత్యేక ప్రదేశాలున్నాయి. వాటిని చూడాలని మనం ఎంత తాపత్రయపడినా వ్యర్థమే.. మన కోరిక అందని ద్రాక్షలా మిగిలిపోతుందనడంలో అతిశయోక్తి లేదు.. అలాగని ఆ ప్రత్యేక ప్రదేశాలను చేరుకోలేమా అంటే.. చేరుకోవచ్చు కానీ అది అంత సులువుకాదు. మరి అలాంటి ఆ ప్రదేశాలేంటో చూద్దామా.?

ప్రతిబింబమే చూడాలి

హవాయి దీవుల్లో ఒకటి నయోహో దీవి. హవాయి దీవులు చాలా అందమైనవి. వీటి సమూహాన్నంతటినీ ఒకేసారి చూస్తే ఆ సంతృప్తే వేరు. అందుకే చాలామంది హవాయి దీవులన్నింటినీ ఒకేసారి చూసి వస్తారు. కానీ ఒక్క దీవి తప్ప. ఈ దీవిని ఎవరూ ఎట్టిపరిస్థితుల్లోనూ చూడలేరు. అదే నయోహో దీవి. దీనిని అందరూ నిషిద్ధ దీవి అంటారు. దీన్ని చూడాలంటే సూర్యాస్తమయ సమయంలోనే చూడాలి. అప్పుడు దాని ప్రతిబింబం సముద్రతీరంపై పడుతుంది. అప్పుడు తప్ప నేరుగా అక్కడికి వెళ్లి ఆ దీవిని చూసే అవకాశమే లేదు. ఎందుకంటే అక్కడ నివసించేవారు బాహ్యప్రపంచానికి దూరంగా ఉంటారు. దాదాపు 150 సంవత్సరాల పాటు ఆ దీవి మొత్తం ఒకే కుటుంబం అధీనంలో ఉండేది. తర్వాతి తరం వారసులు 1860లో ఆ దీవిని పూర్తిగా కొనేశారు. ఎవరైనా పొరపాటున ఆ దీవిలో అడుగుపెట్టారో ప్రాణాలతో తిరిగి వెళ్లలేరు. కాబట్టి ఎవ్వరూ ఈ దీవి వైపు వెళ్లే సాహసం చేయలేరు.

దెయ్యాల నివాసం

ఇటలీలోని ఉత్తర ప్రాంతంలో వేనిస్, లిడో నగరాల మధ్యన పొవెజ్లియా అనే ప్రాంతం ఉంది. అతి భయంకరమైన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. ఈ ద్వీపంలో ఒకప్పుడు మృతదేహాలను ఖననం చేసేవారు. పధ్నాలుగో శతాబ్దంలో ప్రపంచాన్ని ప్లేగు వ్యాధి కుదిపేసిన సంగతి తెలిసిందే.. ఈ మహమ్మారి బారిన పడిన చాలామంది ఇక్కడే సమాధి అయ్యారట.! పంతొమ్మిదో శతాబ్దం తర్వాత మానసిక వ్యాధిగ్రస్తులను ఇక్కడ బంధించేవారు. వీరితోనే ఒక డాక్టర్ ఉంటూ అనేక పరిశోధనలు చేసేవాడన్న పుకార్లు కూడా వచ్చాయి. ఇలా.. ఈ దీవిలో దెయ్యాలు సంచరిస్తున్నాయనే నెపంతో అక్కడి అధికారులు, స్థానికులు పర్యాటకులను నిషేధించారు. ఈ ప్రదేశాన్ని ఎవరైనా కచ్చితంగా చూడాలి అని సరదా పడితే.. స్థానిక అధికారులకు రాతపూర్వకంగా వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాల్సి ఉంటుంది.

అడుగు పడదు..

అదో పాముల ద్వీపం. ఈ ద్వీపం అసలు పేరు ఇహా దా క్విమెడా గ్రాండా.. ఇది సవ్‌పావ్‌లో తీరానికి 93 మైళ్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో ఒక చదరపు అడుగు విస్తీర్ణంలోనే వందకు పైగా పాములు ఉంటాయి. ఎవరూ అడుగు దీసి అడుగు వేయలేని పరిస్థితి. అందుకే దీన్ని అందరూ పాముల ద్వీపం అని పిలుస్తారు. ఇక్కడ ఉండేవన్నీ విష సర్పాలే.. ఇవి కాటేస్తే క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మరికొన్ని పాములు కరిస్తే.. గాయానికి చుట్టూ ఉన్న ప్రదేశమంతా విచ్ఛిన్నమై క్రమేపీ చనిపోతారు. అందుకే ఇక్కడకు పర్యటనకు ఎవ్వరూ వెళ్లకూడదని ప్రత్యేక హెచ్చరికలు జారీచేసింది అక్కడి ప్రభుత్వం. ఇంతకూ ఈ దీవి ఎక్కడ ఉందో చెప్పలేదు కదూ.. ఈ పాములదీవి బ్రెజిల్‌లో ఉంది. ఏది ఏమైనా ఇక్కడకు ఎవరూ వెళ్లకండి సుమా!

భూమి అంచుల్లో..

భూమికి అంచులు ఉండటమేమిటి? అనుకుంటున్నారు కదా.. ఒకవేళ భూమికి అంచులు ఉన్నాయని మనం అనుకున్నట్లయితే.. ఆ అంచుల్లోనే ఒక ద్వీపం ఉంది. ఇది చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. ఈ ద్వీపంలో మనుషులకు ప్రవేశం నిషిద్ధం. ఇక్కడ రెండు అగ్ని పర్వతాలు కూడా ఉన్నాయి. ఈ దీవి అంతా చాలావరకు మంచుతోనే కప్పి ఉంటుంది. సీల్ చేపలు, పక్షులు, నాలుగు జాతులకు చెందిన పెంగ్విన్‌లు కూడా ఇక్కడ జీవిస్తాయి. నిజానికి ఈ ద్వీపం ఆస్ట్రేలియాకు చెందినది. కానీ ఇందులో కొంత భాగం మడగాస్కర్, అంటార్కిటికా ప్రాంతంలోనూ ఉంటుంది. ఈ ద్వీపంలోకి మనుషుల ప్రవేశం సిషిద్ధం కాబట్టి పరిశోధనలు చేయాలనుకున్న కొంతమంది శాస్తవ్రేత్తలను దీవికి దగ్గర్లో ఉన్న మెక్‌డొనాల్డ్ ద్వీపం వరకు అనుమతిస్తుంది ప్రభుత్వం. అక్కడి నుండే వారు పరిశోధనలను కొనసాగిస్తారు.

బాణాలతో దాడి..

బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవుల సమూహంలోని ఓ చిన్న ద్వీపమది. ఇది భారతదేశంలోని ఉత్తర సెంటినల్ ద్వీపం. ఇందులో విచిత్రమైన ప్రజలు జీవిస్తుంటారు. వీరు ప్రపంచానికి దూరంగా ఉంటారు. సాంకేతికత వీరి దరిదాపుల్లో కూడా ఉండదు. పూర్తిగా అనాగరికులు. ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే చాలు- బాణాలు వేసి అతి కిరాతకంగా చంపేస్తారు. దాదాపు అరవై వేల సంవత్సరాల నుంచి వీరు ఇక్కడే జీవిస్తున్నారట. 2004లో సునామీ బీభత్సం సృష్టించిన సమయంలో వీరిని రక్షించడానికి ఇండియన్ కోస్టు గార్డు దళం ప్రత్యేక హెలికాప్టర్లతో ఆ దీవికి వెళ్లింది. వారిపై అక్కడివారంతా బాణాలతో దాడికి దిగారు. దీంతో సైనిక విమానాలు కిందకు దిగకుండానే తిరుగుముఖం పట్టాయి. ఇంతటి ప్రమా దం, ప్రాణభయం పొంచి ఉండటంతో శాస్తవ్రేత్తలను, పర్యాటకులను, అధికారులను అక్కడికి వెళ్లడాన్ని నిషేధించింది భారత ప్రభుత్వం.