Others

పిల్లలూ దేవుడూ... (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పిల్లలూ దేవుడు చల్లనివారే/ కల్ల కపట మెరుగని కరుణామయులె’ -ఈ పాట అలనాటి అపురూప చిత్రం ‘లేత మనసులు’లోది. నాకు ఇష్టమైన పాట. పసిపిల్లల జీవితాలపై చెరగని ముద్రవేసే ఈ చిత్రంలో కళాభినేత్రి జమున, హరనాథ్ ప్రధాన పాత్రధారులు. పప్పీ, లల్లీలుగా బేబి పద్మినీ ద్విపాత్రాభినయం చేసింది. మానవత్వం, కుటుంబ విలువల పట్ల గొప్ప సందేశం చాటిచెప్పిన చిత్రం ‘లేత మనసులు’. ముఖ్యంగా చిన్నారుల హృదయాలను ఇట్టే ఆకర్షిస్తుంది. చిన్నారి బాలలను గాలికి వదిలేసే హక్కు ఎవరికీ లేదు. మాయామర్మంలేని పిల్లలు దేవుడి ప్రతిరూపాలు.. వారు ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులు అంటూ చిన్న పాటలో చైతన్య సందేశం నింపారు ఆరుద్ర. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం/ ఇది గొప్పవారు చెప్పినట్టి చక్కని జ్ఞానం -అంటారు అనుపల్లవిలో ఆరుద్ర. పుట్టినపుడు మనిషి మనసు తెరచియుండును/ ఆ పురిటికందు మనసులోన దైవముండును/ వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే/ అంత మనిషిలో దేవుడే మాయమగునులే -అంటూ హృద్యమైన చరణంలో పిల్లలు దేవుడితో సమానమనే పెద్దల మాటను చక్కగా పొందుపర్చారు. చిత్రంలో పప్పీ, లల్లీల పాత్రలు చిన్న పిల్లలను విశేషంగా ఆకర్షిస్తాయి. అప్పట్లో ఈ చిత్రానికి ప్రధాని ఇందిరాగాంధీ ఉత్తమ తెలుగు చిత్రం అవార్డును నటీనటులకు అందజేసి చిన్నారుల నటనను మనసారా అభినందించారు. 1966లో విడుదలైన ‘లేత మనసులు’ చిత్రం బాలలు అందరూ చూడదగ్గ చక్కని చిత్రం. ఆ పాట నాకు చాలా ఇష్టం.

-ఎల్.ప్రపుల్లచంద్ర, ధర్మవరం