Others

అభినవ శకుని సియస్‌ఆర్ (వెండి వెలుగులు - 4)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘శ్రీనూ నువ్వు నోరు మూసుకో’ అంటూ రేలంగిని పదేపదే కోప్పడే ‘పాతాళభైరవి’ లోని మహారాజు పాత్ర. ‘మాయాబజార్’లో ‘అల్లుడూ..’ అంటూ దుర్యోధనుడి వెనకాలే ఉండి, అతనిలోని దురహంకారాన్ని ఎగదోస్తూ సలహాలిచ్చే గాంధారనరేశ్ శకుని మామ పాత్ర. ‘వస్తున్నాను రాజన్’ అని కుటిల నీతితో పలికే బాదరాయణ ప్రగ్గడ పాత్ర. ‘రోజులుమారాయి’, ‘ఇల్లరికం’, ‘అప్పుచేసి పప్పుకూడు’, ‘చక్రపాణి’, ‘దేవదాసు’, ‘సంత్ తుకారాం’, ‘కన్యాశుల్కం’ మొదలగు చిత్రాల్లో నటించిన సియస్‌ఆర్ (చిలకలపూడి సీతారామాంజనేయులు) వెండితెరపై ‘అభినవ శకునిగా’ ఆనాటి బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లో పేరొందారు.
నవ్వు మొహంతో తీయగా, మెత్తగా మాట్లాడుతూనే ఎదుటివాడికి గోతులు తీసే పాత్రలు.. ప్రక్కవాడి గొంతులు కోసే పాత్రలు మన తెలుగు చిత్రాల్లో చాలా ఉంటాయి. అలాంటి పాత్రలు సమర్థవంతంగా పోషించగల సమర్థుడు సియస్‌ఆర్.
చిలకలపూడి సీతారామాంజనేయులు అంటే ఎవరికీ తెలీదు. షార్ట్‌కట్‌లో సియస్‌ఆర్ అంటే అందరికీ తెలుసు. కుతంత్రం నిండిన పాత్రలు వేయటంలో ఆయన అందెవేసిన చేయి.
‘మాయాబజారు’లోని శకుని పాత్రకు ఆయన జీవం పోయడానికి ఆయనకున్న ఆకారం, మాట తీరు, కంఠధ్వని, ముఖ కవళికలు, నడక, చూపు.. ఇవన్నీ కూడా కారణాలే. ‘శకుని’ అంటే ఇలా ఉండాలి అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలిగించారాయన.
చిన్న వయసులో చిత్రరంగంలోకి రాకపోవటానికి సియస్‌ఆర్ హీరో వేషాలెయ్యలేదు. ముసలి పాత్రల్లో, రాజు పాత్రల్లో, మంత్రి పాత్రల్లో ఇలా విభిన్న తరహాగల పాత్రలు చాలా పోషించారాయన.
సియస్‌ఆర్‌కి గుంటూరు జిల్లా నాటకాలంటే అభిరుచి ఎక్కువ. ఎన్నో సాంఘిక చిత్రాల్లో అవినీతిపరుడైన పెద్దమనిషి పాత్రలు వేశారాయన. ఎక్కువగా వేసింది విలన్ పాత్రలైనా.. ‘అప్పుచేసి పప్పుకూడు’, ‘చక్రపాణి’ చిత్రాల్లో హాస్యం ఉట్టిపడే పాత్రలు కూడా వేసి అందరి పొగడ్తలు అందుకున్నారాయన.
ఆ రోజుల్లో సియస్‌ఆర్ తాను హీరోగా, స్థానం నరసింహారావు హీరోయిన్‌గా చాలా నాటకాలు వేశారు.
సుమారు 175 చిత్రాల్లో నటించారాయన. 1947కు ముందు వచ్చిన ‘రామదాసు’ ఆయన నటించిన మొదటి చిత్రం. ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’, ‘తుకారాం’, ‘తల్లిప్రేమ’, ‘మాయాలోకం’, ‘సుమతి’, ‘చూడామణి’, ‘సాయిబాబా’, ‘లైలామజ్ను’, ‘సక్కుబాయి’, ‘గృహప్రవేశం’, ‘పరమానందయ్య శిష్యులు’, ‘్భక్త కుచేల’, ‘కన్యాదానం’.. ఇవన్నీ ఆయనకు నటుడిగా పేరుతెచ్చిన చిత్రాలు.
సియస్‌ఆర్ వ్యక్తిగతంగా చాలా మంచివాడు. ఆదర్శాలు, ఆశయాలు నమ్ముకుని ఆచరణలో పెట్టాలని ప్రయత్నించిన మహనీయుడాయన. కళను కళామతల్లి సేవకు వినియోగించారాయన. పేదలపట్ల జాలి, ఉదారత్వం, దయ చూపేవారు, దానధర్మాలూ చేసేవారు.
నటనలో, సంభాషణలు చెప్పటంలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకొని, అటు నాటక రంగాన, ఇటు సినిమా రంగాన అందరి ఆదరాభిమానాలూ చూరగొన్న సియస్‌ఆర్ 1963లో కాలధర్మం చెందారు.

-డా.దేశిరాజు లక్ష్మీనరసింహారావు