AADIVAVRAM - Others

కళ్లద్దాలు (శాస్ర్తియ ఆవిష్కరణలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1284 ప్రాంతంలో ఇటలీలో సాల్వినో డి ఆర్మేట్ ప్రప్రథమంగా కళ్లకు ధరించగల అద్దాలను తయారుచేసి పేరుగాంచాడు. -PRESBYOPIYA (దగ్గరగా వున్న వస్తువులపై దృష్టి కేంద్రీకరించలేని స్థితి) కోసం చీలవేసి తయారుచేసిన కళ్లద్దాలు. ముందుగా తయారుచేయబడిన కళ్లద్దాలలో ఒక రకం. అవి ధరించే వారిలో ఎక్కువమంది విద్యావేత్తలు, సన్యాసులు వుండేవారు. అద్దాలైతే తయారుచేశారు గాని, వాటిని ఒక ఆధారంతో సురక్షితంగా ధరించే విధానం అప్పటికి వాడుకలో లేదు. ఆ లెన్స్‌ను వారు తమ కళ్ల ముందు పట్టుకొనేవారు. లేదా జాగ్రత్తగా వాటిని ముక్కుపై బాలెన్స్ చేసేవారు కదిలితే పడిపోతాయి అన్న టెన్షన్‌తో.
ఫ్రేమ్‌ను రూపొందించి, కదలకుండా స్థిరంగా ఉన్న ఒక బ్రిడ్జికి ఫిక్స్ చేసి సరైన స్థానంలో లెన్స్‌ను అమర్చిన కళ్లద్దాలకు రూపకల్పన 1600 శతాబ్దంలో ప్రారంభమైంది. 1725-1750 మధ్యకాలంలో లండన్‌కు చెందిన కళ్లద్దాలు తయారుచేసే వ్యక్తి ప్రథమంగా టెంపుల్ కళ్లద్దాలను రూపొందించగా, బ్రెన్ ఫ్రాంక్లిన్ బైఫోకల్ లెన్స్‌కు రూపకల్పన చేయటం జరిగింది. 1929లో ఎడ్విన్ లాండ్ ఒక సెలోఫేన్ వంటి పోలరైజింగ్ ఫిల్టర్ తయారీకి హక్కులను స్వంతం చేసుకున్నాడు. ఇదే కాంతిని పోలరైజ్ చేసే ప్రథమ ఆధునిక ఫిల్టర్.
లెన్స్ యొక్క కచ్చితమైన పవర్, ఫ్రేమ్ ఆకారాలలో కలుగుతున్న అభివృద్ధితో కూడిన మార్పులతో కళ్ళద్దాలు, అవి డాక్టర్‌చే సూచించబడినవి అయినా లేదా సాధారణమైనవి అయినా కూడా స్ర్తి, పురుషులకు ఒకే ఫ్యాషన్ వాడుకగా తయారయ్యాయి. నేడు మనకు కళ్లద్దాలు కేవలం కొనుక్కుంటే దొరికే అందుబాటైన వస్తువుగా అనిపించవచ్చు. అయినప్పటికీ కూడా ఇది మానవాళికి సౌకర్యాన్ని మరియు ఉపశమనాన్ని కలిగించిన అమోఘమైన ఆవిష్కరణ అనే విషయం మాత్రం ఎప్పటికీ వాస్తవమే!

-బి.మాన్‌సింగ్ నాయక్