Others

నవతరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేల ఏళ్లుగా నేల బావిలో
ఈ నేల బావిలో
కులం జలం నిలవ నీరయ్యింది
నాచు పట్టిన మెదళ్ళన్నీ
పురుగు పట్టిన మొదళ్లతో
మురుగు కంపును విరజిమ్ముతున్నాయి

ఓటు వరద పోటెత్తినప్పుడల్లా
కొత్త చెత్త వచ్చి పాచిలా పరచుకుంటోంది
పరువు బురదను పూసుకొన్న వింతజీవులు
ఇంట పూసిన కమలాలనే
కరకరా నమిలేస్తున్నాయి

నవతరమా! ఆశలన్నీ నీమీదే మిగిలాయి
నీ స్వచ్ఛమైన మనసును తాకినంతనే
వ్యర్థజలం పన్నీరౌతుంది
మతిలేని అతిశయాలతో
తొడగొట్టిన వ్ఢ్యౌ భావాల్ని నువ్వే పడగొట్టాలి
రివర్స్ ఆస్మోసిస్ ప్రక్రియలో వడగట్టాలి
కుతతత్త్వం కొడిగట్టాలి
మానవత్వం ఇంకిపోకుండా ఒడిసిపట్టాలి

-డా.డి.వి.జి.శంకరరావు 9440836931