AADIVAVRAM - Others

అయస్కాంత పాఠం ( స్ఫూర్తి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్కూల్ నుంచి తిరిగి వచ్చిన సంచలన తను తెచ్చిన అయస్కాంతాన్ని తల్లికి చూపించి ఉత్సాహంగా చెప్పింది.
‘మా సైన్స్ టీచర్ ఇవాళ అయస్కాంతం పాఠం చెప్పింది. అది చాలా ఆసక్తిగా ఉంది. హోంవర్క్ చేయడానికి సైన్స్ లేబొరేటరీ నించి అందరికీ తలో అయస్కాంతాన్ని ఇచ్చింది. మళ్లీ రేపు తిరిగి ఇచ్చేయాలి. నేను హోంవర్క్ అయ్యాక టిఫిన్ తింటాను’
సంచలన డ్రాయర్లు వెదికి ఓ ఇనుప మేకుని, కొన్ని గుండు సూదులని తీసింది.
‘ఇది మేకు కదా? చూడు ఇప్పుడు ఏం తమాషా చేస్తానో?’ చెప్పి మేకుని కొద్దిసేపు అయస్కాంతంతో రుద్దింది. తర్వాత ఆ మేకుని గుండు సూది దగ్గరకి తీసుకెళ్లగానే అదొచ్చి మేకుకి అతుక్కుంది.
‘చూసావా? మేకు అయస్కాంతంలా పని చేసింది కదా?’
‘అరె! అవును. ఇనప మేకుకి అది ఎలా అతుక్కుంది?’ తల్లి ఆశ్చర్యంగా అడిగింది.
‘అయస్కాంతంతో రుద్దడంతో మేకుకి దాని శక్తి కొంత అంటింది’ సంచలన వివరించింది.
తల్లి తన తల్లోని హెయిర్ పిన్‌ని తీసి పరీక్షిస్తే అది కూడా మేకుకి అంటుకుంది.
కొద్దిసేపు అయస్కాంతంతో ఆడుకుని సంచలన సైన్స్ హోంవర్క్ చేయసాగింది.
‘నీకోటి తెలుసా?’ తల్లి అడిగింది.
సంచలన తల పైకెత్తి తల్లి వంక చూసింది.
‘మనిషి లక్షణాలు కూడా అయస్కాంతం లాంటివే’
‘అంటే?’
‘మనం ఏ మనిషితో ఎక్కువసేపు గడుపుతామో ఆ మనిషి లక్షణాలు మనకి అంటుకుంటాయి. కాబట్టి మనం మంచి లక్షణాలుగల వారితో స్నేహం చేస్తే మంచి లక్షణాలు, చెడ్డ లక్షణాలు గల వ్యక్తితో స్నేహం చేస్తే చెడ్డ లక్షణాలు అంటుకుంటాయి. కాబట్టి మనం స్నేహం చేసే వ్యక్తిలో ఏ లక్షణాలు ఉన్నాయో గమనించి వారితో స్నేహం చేయాలా వద్దా అన్నది నిర్ణయించుకోవాలి’ తల్లి వివరించింది.
‘నేను కూడా ఓ అయస్కాంత పాఠం చెప్తాను’ వారి సంభాషణ విన్న తండ్రి చెప్పాడు.
తల్లీ కూతుళ్లు ఇద్దరూ అతని వంక చూశారు.
‘దేవుడు అయస్కాంతం లాంటివాడు. మనం మేకుల్లాంటివాళ్లం. మనం ఎంత తరచు దేవాలయానికి వెళ్తే, లేదా విష్ణు సహస్ర నామాలు లాంటి స్తోత్రాలు చదువుతూంటే మనకి సత్యం, ధర్మం లాంటి ఆయన లక్షణాలు తేలిగ్గా అంటుకుంటాయి.’

మల్లాది వెంకట కృష్ణమూర్తి