Others

రోజులు మారాయి (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమిష్టి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ భూస్వాముల అరాచకాల్ని ఖండిస్తూ చక్కని సందేశాన్ని యిచ్చిన చిత్రం సారధి వారి ‘రోజులు మారాయి’ (1955) విజయ దుందుభి మ్రోగించింది. హైదరాబాద్‌లో రజతోత్సవం జరుపుకున్న తొలి తెలుగు చిత్రం యిదే. పల్లెటూళ్లే మన దేశానికి పట్టుకొమ్మలనే నిజాన్ని చాటిచెప్పిన రుూ చిత్రంలో అన్యాయాన్ని యెదుర్కొని పోరాడే ఆదర్శ యువకునిగా అక్కినేని అద్భుతమైన నటనని ప్రదర్శించారు. షావుకారు జానకి తొలిసారిగా యన్.టి.ఆర్. సరసన ‘షావుకారు’ చిత్రంలో నటిస్తే ఈ చిత్రంలో తొలిసారిగా అక్కినేని సరసన నటించింది. వల్లం నరసింహారావు, అమ్మాజీ (నటి జయచిత్ర తల్లి), రమణారెడ్డి, సి.యస్.ఆర్, పెరుమాళ్లు ఆయా పాత్రలకు జీవరేఖలు దిద్దారు. రేలంగి దుష్టపాత్రను పోషించడం విశేషం. ‘అంతా మనవాళ్లే’ (1954), తర్వాత తాపీ చాణక్య దర్శకత్వం వహించిన ద్వితీయ చిత్రమిది. ఆయన దర్శక ప్రతిభ ప్రతిఫ్రేంలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ‘దేవుడు చేసిన మనుషులు’, ‘మరపురాని కథ’, ‘అల్లూరి సీతారామరాజు’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన వి.రామచంద్రరావు తాపీ చాణక్యకు అసిస్టెంటుగా పనిచేశారు. వహీదా రెహమాన్ తెరమీద మొట్టమొదటిసారిగా కన్పించిన చిత్రం కూడా యిదే. ఆమె ‘ఏరువాకా సాగాలోయ్’ పాట పాడుతూ చేసిన నృత్యం ప్రేక్షకులచే చప్పట్లు చరిపించింది. ఆ పాట సందర్భంలో ప్రేక్షకులు తెరపై డబ్బులు వెదజల్లేవారు. ఈ పాటకు తప్పెట యెంతో అవసరమని పాట వ్రాసిన కొసరాజుగారి సూచనపై సంగీత దర్శకుడు మాస్టర్ వేణు దానే్న ఉపయోగించడం విశేషం. ఈ చిత్రంలో మాస్టర్ వేణు పేరు ఆంధ్ర దేశమంతటా మారుమ్రోగింది. పాట పాడిన జిక్కీగారికి మంచి ఫాలోయింగ్ లభించింది. ‘‘ఏరువాకా సాగాలోయ్’ బాణీని అనుసరించి యస్.డి.బర్మన్ దేవానంద్ సుచిత్రాసేన్ నటించిన ‘బొంబాయికాబాబు’(1960)లో ‘దేఖో నేమే భోలాహై’ పాటను స్వరపరిచారు. ‘ఇదియే హాయి కలుపుము చేయి’ పాట కూడా ప్రజాదరణ పొందింది. కొండేపూడి లక్ష్మీనారాయణగారి కథకు తాపీ ధర్మారావు మాటలు రాశారు. తాపీధర్మారావుగారు ఈ చిత్రానికి కొన్ని పాటలు కూడా రాశారు. కమల్‌ఘోష్ ఫొటోగ్రఫీ నిర్వహించారు.
దేశప్రగతి రైతుల సంక్షేమంపైనే ఆధారపడిందన్న నగ్నసత్యాన్ని ఢంకా బజాయించి చెప్పిన ఈ సందేశాత్మక చిత్రం 14-4-1955 తేదీన విడుదలై ఆంధ్ర దేశమంతటా రజతోత్సవాలు జరుపుకుంది.

- పూజారి నారాయణ, అనంతపురం