Others

ఒక New Gen కవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిత్రమా,
ఈ క్షణం నీకొక New Gen కవితని వినిపించాలె
నువ్వు రెడీనా... ఇక ఇను

ప్రతిబింబాలు
నిశ్చల నదులు!
మంచు బిందువులు
మొలుచుకొచ్చిన పర్వతాలు!
గాలి పొరలు
రాలిన పుప్పొడి రేణువులు
ఇసుక మేటలు
నేలపై పరుచుకున్న మేఘాలు
చెట్లు
ఆకాశం కాన్వాస్‌పై కుంచెలు!
మనుషులు
మట్టి లతకు విరిసిన ఆకులు
ఇంకా...
అర్రెర్రే... నిర్ ర్... ద్వంద్వాలు మత్ కరో బాస్
నిర్ ర్ ర్... జీవనాలు... నో నో నో
జీవితం గురించి చెప్పు దోస్త్!
You mean life? జిందగీ...?!
హు.. హు...!! హొ...!
కూళఒ. చెప్పడానికి ఏమీ లేనిది
చెప్పుకోకుండా ఉండలేనిది
చెప్పక చెయ్యక చేజారిపోయేది
చెప్పులు వేసుకునేంత వ్యవధి కూడా ఇవ్వకుండా
చీకటి వైపు పరుగులు పెట్టేది
చెప్పుకుంటూ పోతున్నకొద్దీ ఇంకా మిగిలే ఉండేది
చెప్పకుండా ఆగిపోతే అదే పనిగా వాగేది
చెప్పిన దాంట్లో చెప్పుకోలేనిది
చెప్పుకోలేని దాంట్లో దాగి ఉండలేనిది
చెప్పినా చెప్పకపోయనా
నిన్ను నిరంతరం శిలువ వేసేది
చెప్పకుండా చెప్పినా
నిన్ను వధ్యశిలపై నిలిపేది
ఎప్పుడూ నిన్ను వదలకుండా
నీ చుట్టూ Wifiలా తిరుగుతూ
GPSలో నీ ఉనికిని నిత్యం స్కాన్ చేస్తూ
నిజాన్ని మార్ఫింగ్ చేసి CGIలని అద్ది
ప్రపంచానికి పరిచయం చేసే ఆదిమ App!

‘బాప్ రే బాప్...!
క్యా ఖూబ్ బోలారే ఆప్...!!
సమజయా కానట్టు మస్తుగ సమజయందిర బై
గట్లయతే, ఇగ కవిత్వం గురించి జర చెప్పు’
Wha... కవిత్వమా?
Do You Sound, Poetry.... శాయరీ...
హా... హు... హహహా... హూ...
కవిత్వం... విత్వం... త్వం... మ్... సున్నా... శూన్యం!
జీవితం... వితం... తం... మ్... సున్నా... శూన్యం!
అరె ఎడ్డినా ఫ్రెండా...
కవిత్వం అంటే జీవితమే కదరా...
కాపీ పేస్ట్ చేసుకొని feel అవరా...
Reveal అవరా... Relieve అవరా...
Relieve అవరా...

-- మామిడి హరికృష్ణ, 8008005231