డైలీ సీరియల్

సుందోపసుందులు (మహాభారతంలో ఉపాఖ్యానాలు-24)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వం హిరణ్యకశిపుని వంశంలో నికుంభుడనే రాక్షసుడు ఉన్నాడు. అతడు మహాబలవంతుడు. పరాక్రమవంతుడు. అతనికి పరాక్రమంలో సమానమైన ఇద్దరు కుమారులు పుట్టారు. వారికి సుందుడు ఉపసుందుడని తండ్రి పేర్లు పెట్టాడు. వారిద్దరు చాలా క్రూర స్వభావం కలవారు. ఇద్దరూ ఏ పనైనా ఒకే నిశ్చయంతో కలిసి చేసేవారు. కలిసి ఉండేవారు. వారికి సుఖదుఃఖాలు వేరుగా లేవు. ఇద్దరూ కలిసే అనుభవించేవారు. ఒకరిని విడిచి రెండవవారు ఉండేవారు కాదు. ఒకరికి ఇష్టమైన పని ఇంకొకరు చేసేవారు.
వారు ముల్ల్లోకాలను జయంచాలన్న సంకల్పంతో వింధ్య పర్వతం దగ్గర తీవ్రమైన తపస్సు చేశారు. ఆకలి దప్పికలతో, నార బట్టలు ధరించి వారు వాయు భక్షణ చేస్తూ, తమ శరీర మాంసాన్ని అగ్నికి ఆహుతి చేస్తూ, కనురెప్పలు వేయక ఎంతో నియమ నిష్టలతో వారు ఎంతోకాలం తపస్సుచేశారు. వారి తీవ్ర తపస్సుకు వింధ్య పర్వతం వేడెక్కి పోయంది. వారు చేస్తున్న ఈ తపస్సుకు దేవతలు భయపడ్డారు. ఆ తపస్సును ఆపడానికి ఎన్నో విఘ్నాలను కలిగించారు. వారిని ఎన్నో విధాలుగా ప్రలోభపెట్టినా ఆ సోదరులు తమ తపస్సు ఆపలేదు.
వారి తపస్సుకు మెచ్చి బ్రహ్మ వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. వారిని కావలసిన వరాలు కోరుకోమన్నాడు. ఆ అన్నదమ్ములు ఇద్దరు బ్రహ్మదేవునికి నమస్కరించి ఇలా అన్నారు. ‘‘దేవా! మీరు మా తపస్సుకు ప్రనన్నులైతే మమ్మల్ని మాయావేత్తలుగా, అస్త్ర శస్త్ర విశారదులుగా, కామరూపులుగా, బలవంతులుగా, అమరులుగా చేయండి’’.
అప్పుడు బ్రహ్మ వారితో ఇలా అన్నాడు ‘‘అమరత్వం తప్ప మిగిలిన మీ కోర్కెలు తీరుతాయ. మీరు మీ మృత్యువిధానం ఇంకొక రకంగా కోరుకోండి.ముల్లోకాలకు ప్రభువులు కావాలని మీరు ఈ తపస్సు చేశారు. కనుక మీ కోరిక అమరత్వం కాదు. కనుక మీరు అమరులు అవరు.త్రైలోక్యవిజయం మీకు సిద్ధిస్తుంది. కాని అమరత్వం సిద్ధించదు.’’ అప్పుడు సుందోపసుందులు అతనితో ఇలా అన్నారు ‘‘పితామహా! మాలో మేము తప్ప మూడు లోకాల్లో ఇతరులెవ్వరు మమ్ముల్ను చంపలేనట్లు వరాన్ని ఇమ్ము’’.
బ్రహ్మ ఇలా అన్నాడు ‘‘మీ ప్రార్థనకు అనుగుణంగా మీలో పరస్పర కలహం ఏర్పడగా మరణం కలిగేటట్లు వరమిస్తున్నాను. ఏదో ఒక రూపంలో మృత్యువు కలుగుతుంది.’’
ఈ విధంగా వరాన్ని పొంది ఆ సోదరులిద్దరూ ముల్లోకాలకు భయంకరులైనారు. వారిద్దరూ తమ భవనాలకు వెళ్ళి తాపస వేషం తీసివేసి మంచి దుస్తులు, ఆభరణాలు ధరించి, తక్కిన రాక్షసులతో కలిసి భోగాలను అనుభవిస్తూ చాలా సంవత్సరాలు గడిపారు.
తర్వాత వారు త్రిలోకాలను జయంచాలనే కోరికతో సైన్యాన్ని తీసుకొని, ఆయుధాలు ధరించి మంచిమూహూర్తాన యుద్ధ యాత్రను ప్రారంభించారు. వారు మొదట దేవతలపై దాడి చేశారు. అప్పుడు దేవతలు భయంతో స్వర్గాన్ని వదిలి పారిపోయారు. అన్నదమ్ములు స్వర్గాన్ని జయంచి, యక్షరాక్షసులను ఇతర ఆకాశగాములను చంపివేశారు. తర్వాత వారు పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ నివసించే నాగులను సముద్ర తీరాన నివసించే మ్లేచ్ఛులను జయంచారు. తర్వాత వారు భూమిని జయంచాలను కొని ఇలా సైనికులతో అన్నారు. ‘‘ఈ భూమిపై బ్రాహ్మణులు, రాజర్షులు తమ యజ్ఞ యాగాదులతో దేవతల తేజస్సు, బలం సంపద వృద్ధి చేశారు. యజ్ఞాలు చేసేవారు మనకు శత్రువులు. కనుక వారందరినీ చంపి వేయాలి’’ ఇలా అని వారు అన్ని వైపుల నుండి భూమిని ఆక్రమించేందుకు బయలుదేరారు. అత్యంత క్రూరులైన ఆ సైనికులు మొనుల ఆశ్రమాల్లో, అగ్నిహోత్రాలను, సామగ్రిని నీటిలో పారవేశారు. తాపసులు కోపించి వారిని శపించినా వారి వరబలం వల్ల ఆ శాపాలు వారిని బాధించలేదు. బ్రాహ్మణులు భయంతో పారిపోయారు. రాక్షసులు వారి ఆశ్రమాలను నాశనం చేసి వారి కలశాలను, స్రువాలను విసిరి పారేశారు. వారందరినీ చంపడానికి రాక్షసులు భయంకరమైన జంతు రూపాలను పొందారు. సింహాలు, పులుల రూపాల్లో వారు ఋషులను హతమార్చారు. వారెప్పుడు ఏ రూపుదాలుస్తారో ఋషులకు తెలియలేదు. భయంతో ఋషులు స్వాధ్యయనం, యజ్ఞాలు మానివేశారు. చాలా మంది రాజర్షులు, బ్రాహ్మణులు వధించబడ్డారు. ప్రజలు ప్రాణాలను గుప్ప్పొఊ్ల పెట్టుకుని భయంతో జీవిస్తున్నారు. సుందోపసుందులు చేస్తున్న ఈ భయానక కర్మలవల్ల భూమి వైపు ఎవ్వరూ చూడలేక పోతున్నారు. సూర్య, చంద్రులు, తారలు, గ్రహాలు, దేవతలు అందరూ ఎంతో దుఃఖాన్ని పొందారు. ఈ విధంగా ఆ రాక్షస సోదరులు తమ క్రూర కర్మలచేత మ్లుకాలను పీడించి జయంచి తమ గృహానికి వచ్చారు.అప్పుడు మహర్షులు, జితేంద్రియులు, సిద్ధులు అంతా ఈ ఘోర పరిస్థితిని చూచి చింతించి జనులపై దయతో బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళారు. ఈ సత్యలోకంలో వారు దేవతాగణాలతో బ్రహ్మర్షి గణాలతో పర్యవేష్ఠితుడైన బ్రహ్మను చూచారు. ఇంకా అక్కడ వాయువు, అగ్ని సూర్యచంద్రులు బ్రహ్మ మానస పుత్రులు, వాలఖిల్వులు వైఖానసలు, మరీచిపులు, తేజోరూపులు ఆయన సమక్షంలో ఉన్నారు. మహర్షులంతా బ్రహ్మతో సుందోపసుందులు చేస్తున్న ఘోరకృత్యాల గురించి విన్నవించారు. బ్రహ్మను తరుణోపాయం అడిగారు.
(ఇంకావుంది)

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి