Others

ఆహారం.. మన జీవనాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ జీవనానికి అవసరమైన ఆహార పదార్థాలను పిండి పదార్థాలు, మాంసపుకృత్తులు, కొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్లు, నీరు అనే భాగాలుగా శాస్తవ్రేత్తలు వర్గీకరించారు. వీటిని సమపాళ్ళలో తీసుకుంటే ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించవచ్చు. వరి, జొన్న, సజ్జ, గోధుమ మొదలగు ధా న్యాల నుండి పిండి పదార్థాలు, పప్పు దినుసులు, మాంసం, గుడ్లు తదితరాల నుండి మాంసపుకృత్తులు, నూనెల నుండి కొవ్వులు ప్రధానంగా మనకు లభిస్తాయి. కూరగాయలు, ఆకుకూరల నుండి ఖనిజ లవణాలు, విటమిన్లు దొరుకుతాయి. పిండి పదార్థాలు శరీరానికి శక్తినిస్తాయి. మాంసపుకృత్తులు శరీర నిర్మాణానికి, రోగ నిరోధక శక్తికి పనికొస్తాయి. కొవ్వులు శరీరానికి శక్తినిస్తూ, విటమిన్లను కరిగించుకోవడంలో సహాయపడతాయి. ఖనిజ లవణాలు, విటమిన్లు శరీరంలో జీవరసాయన క్రియలు సక్రమంగా జరిగేలా సహాయపడతాయి.
1945 అక్టోబర్ 16న ‘్ఫడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్’ను స్థాపించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏటా అక్టోబర్ 16న ‘ప్రపంచ ఆహార దినం’గా పాటిస్తారు. 2018 సంవత్సరానికి గాను ‘మన చర్యలే మన భవిష్యత్తు’(Our actions are our future) అనే నినాదంతో ఈ సంస్థ ప్రచారం చేస్తోంది. సురక్షితమైన, ఆరోగ్యవంతమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయడం, వినియోగించడం, ఆకలి, పేదరికం వంటి అంశాల మీద అవగాహన కల్పించడం వంటివి ‘ప్రపంచ ఆహార దినం’ జరుపుకోవడంలో ముఖ్యమైన ఉద్దేశాలు.
1950-51లో మన దేశంలో 50 మిలియన్ టన్నుల ఆహార ఉత్పత్తి జరిగింది. అది ప్రస్తుతం ఐదురెట్లు పెరిగి 250 మిలియన్ టన్నులకు చేరింది. ఆహార ఉత్పత్తిలో ప్రగతి సాధించినా, విపరీతంగా పెరిగే జనాభా మనకు ప్రధాన సమస్యగా పరిణమించింది. మన దేశంలో ఇప్పటికీ ఏటా 3,000 మంది పిల్లలు ఆకలితో చనిపోతున్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గర్భిణుల్లో ఏర్పడే పోషకాహార లోపాల వల్ల వారికి జన్మించే పిల్లలలో 30% మంది తగినంత బరువులేకుండా ఉంటున్నారు. 56% మంది వివాహిత మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. 6-35 నెలల వయస్సుగల పిల్లల్లో 79% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. క్షయ, మలేరియా, ఎయిడ్స్, క్యాన్సర్ వంటి వ్యాధుల కంటే ప్రపంచవ్యాప్తంగా ఆకలితో చనిపోయేవారి సంఖ్య అధికంగా ఉందంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా పసివాళ్ళ మరణాలు 45% వరకు పోషకాహార లోపం వల్లనే జరుగుతున్నాయి. 119 సభ్య దేశాలలో ‘ప్రపంచ ఆకలి సూచీ’లో మన దేశం 100వ స్థానంలో ఉంది. ఇరాన్, బంగ్లాదేశ్, ఉత్తర కొరయాల కంటే భారత్ అధ్వాన స్థితిలో ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే మొత్తం ఆహారంలో 1/3వ వంతు ఆహారం వృథా అవుతున్నది. ఈ వృథాను అరికట్టడం, వ్యవసాయ రంగంలో నూతన పద్ధతులను ప్రవేశపెట్టడం ద్వారా ఆహారపు ఉత్పత్తిని పెంచడం, తద్వారా ఆకలి మరణాలు లేని దేశాన్ని (Zero Hunger Challenge) 2030 నాటికి సాధించాలనే లక్ష్యంతో వన ప్రభుత్వం పనిచేస్తోంది. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో బంజరుభూములను సాగులోకి తేవడం, నదులను అనుసంధానం చేయడం, ఎడారులను పంట భూములుగామార్చే సాంకేతిక పద్ధతులను ప్రోత్సహించడం, తీర ప్రాంతాలలో సముద్ర ఆధారిత ఆహారపు ఉత్పత్తులను ప్రోత్సహించడం వంటి పద్ధతులను అనుసరించి ఆహార ఉత్పత్తిని మరింతగా పెంచవచ్చు.
(నేడు ‘ప్రపంచ ఆహార దినం’)

-పి.మురళీకృష్ణ 94913 12002