Others

పరిణీతి.. మహా స్పీడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మోత్సవం ఝలక్ ఇవ్వడంతో -ఈసారి మరో భారీ సినిమాతో ప్రేక్షకుడిని అలరించేందుకు మహేష్‌బాబు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. మురుగదాస్ డైరెక్షన్‌లో రూపొందే సినిమా ఈనెల చివరిలో సెట్స్‌మీదకు రావొచ్చని అంచనా. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ పరిణితిచోప్రా నటిస్తుంది. ఈ సినిమా కోసం ఈ అమ్మడు ఏకంగా మూడున్నర కోట్ల పారితోషికం తీసుకోబోతోందట. సొమ్ముకు తగిన కష్టం కూడా చూపించబోతోందట. తెలుగు, తమిళ భాషల్లో రూపొందే సినిమా కోసం పరిణీతి తెలుగు నేర్చుకుంటోందట. షాక్ తిన్నారు కదూ. ఇంకా షూటింగ్ మొదలుకాకముందే తెలుగు నేర్చేసుకోవడం గొప్ప విషయమే కదా. ఎందుకూ అంటే -ఈ సినిమాలో తన వాయిస్ తనే ఇచ్చుకోబోతోంది మరి. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు అప్పుడే పరిణీతి పాత్రకు తగిన కసరత్తు చేస్తోందని అంటున్నారు. అక్క ప్రియాంక హాలీవుడ్‌లో చెలరేగిపోతుంటే, చెల్లి పరిణీతి సౌత్‌లో దుమ్ము దులపాలని చూస్తోంది.