Others

సమాజ హితైషులు గురువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకసారి బాబా తన భక్తులతో ‘‘నా భక్తులకోసం నేనెలా కష్టాలను భరిస్తానో చూడు. వారి కష్టములన్నీ నావే!’’అన్నారు. నిజానికి బాబా బతికున్న రోజుల్లో ఎవరికేమి కష్టమొచ్చినా బాబా దగ్గరికి వచ్చేవారు. ఆయనవారి చింతలను క్షణంలో తీర్చివేసేవాడు. ఒకసారి బాలారామ్ అనునతడు వచ్చాడు. అతనికి బాలారామ్‌కు చిలుము పీల్చే అలవాటు లేదు. బాబా అతనికి చిలుము ఇచ్చి పీల్చమన్నారు. బాబా మాట కాదనలేక ఇబ్బందిగానే దానిని పీల్చాడు. తిరిగి వినయ విధేయతలతో దానిని బాబాకు అందించాడు. నిజానికది శుభ సమయం. బాలారామ్ అప్పటికి ఆరు సంవత్సరాలుగా తీవ్రమైన ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్నాడు. అతను బాబా చేతులమీదుగా తీసుకుని పీల్చిన చిలుము పొగ అతని వ్యాధిని పూర్తిగా నయం చేసింది. మరెప్పుడూ అతను ఉబ్బసం వ్యాధితో బాధపడలేదు. బాలారామ్ శిరిడీ వచ్చినది గురువారంరోజు. ఆ రోజు బాలారామ్‌కు, అతని సోదరులకు ఆ రోజు రాత్రి చావడి ఉత్సవాన్ని తిలకించే అదృష్టం లభించింది. చావడిలోనే హారతి సమయంలోనే బాలారామ్‌కు బాబా ముఖంలో పాండురంగని తేజస్సు కనిపించింది. మరుసటి రోజు ఉదయం కూడా కాకడి హారతి వేళలోనూ బాబాలో బాలారామ్ పాండురంగని ప్రకాశాన్ని చూశాడు. బాలారామ్ ధురంధర్ మరాఠీలో తుకారామ్ జీవితాన్ని రాశాడు. 1928 సంవత్సరంలో ఆ పుస్తకాన్ని బాలారామ్ సోదరులు వెలుగులోకి తెచ్చారు. ఆ పుస్తకం మొదటి పేజీల్లో బాలారామ్ తన జీవిత విశేషాలను పేర్కొన్నారు. అందులోనే బాబాతో తనకు కలిగిన పరిచయ భాగ్యాన్ని, అనుభవాల విశేషాలను కూడా పేర్కొన్నారు. నేడు బాబా సమాధిస్థితిలో ఉన్నారు. బాబా చివరి దినాల్లో నా సమాధి మాట్లాడుతుంది అని చెప్పారు. అట్లానే నేడు భక్తులు సమాధికి నమస్కరిస్తే సమాధినుండే బాబా అభయం వారికి లభ్యమవుతుంది.
-----------------
సాయి విద్యా ఫౌండేషన్ ప్రచురించిన ‘సాయి జీవనం మోక్షమార్గం’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు స్థలం ‘సాయి విద్య ఫౌండేషన్, ఫ్లాట్ నెం.4, సాయిబాబానగర్ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23441123. ఎల్.ఐ.జి.49, ధర్మారెడ్డి నగర్, ఫేస్-1, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23445566