Others

ఈ పరిణామాలు ఎటువైపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు మన దేశం చాలా విచిత్ర పరిస్థితుల్లో ఉందేమో అనిపిస్తోంది. ప్రతి రాజకీయ పక్షంలో అసంతృప్తులు ఎక్కువమంది కనపడుతున్నారు. వారు చివరికి ఎవరితో కలుస్తారో, ఎన్నికల రోజున ఏం చేస్తారో, ఎవరూ కచ్చితంగా ఊహించలేకపోతున్నారు. ఎన్నికల సమయంలో ఎనె్నన్ని విచిత్రాలో..! మాజీ ఉప మఖ్యమంత్రి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టో కమిటీ అధ్యక్షుడు దామోదర రాజనరసింహ భార్య పద్మినీ రెడ్డి ఉదయం భాజపాలో చేరారు.. రాత్రికల్లా కాంగ్రెస్‌లోనే ఉంటానన్నారు! ఈ రాజకీయ వైచిత్రిని ఏమందాం?
ఇంకో విశేషం.. మన యువతరం సంగతి. ఏరోస్పేస్ సిస్టమ్స్ ఇంజనీర్ నిశాంత్ అగర్వాల్ చాలా తెలివైన ఇంజనీర్. గతంలో హైదరాబాద్‌లోని రక్షణ సంస్థలో పనిచేశాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిశాంత్ అగర్వాల్- నాలుగేళ్లుగా నాగపూర్‌లోని క్షిపణి పరీక్ష కేంద్రంలో సిస్టమ్స్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. తరచూ కెనడాకు చెందిన సీజల్ కపూర్‌తో ఫేస్‌బుక్ చాటింగ్ చేస్తుంటాడు. కెనడాలో కొలువు చూపిస్తాననీ, నెలకు 22 లక్షల జీతం వస్తుందని చెబితే ఊహల్లో తేలిపోయాడు. దీనికి ప్రతిఫలంగా భారత ప్రతిష్ఠాత్మక క్షిపణి బ్రహ్మాస్‌ను పణంగా పెట్టాలన్నది షరతు. దానికి లొంగిపోయి, కోడ్ భాషలో క్షిపణి వివరాలను పాక్‌కు నిశాంత్ చేరవేశాడని ఆరోపణ. దీనితో అరెస్టయ్యాడు. బాధ్యత గల ఇంజనీర్ ఇలా దేశద్రోహానికి పాల్పడితే ఏమందాం?
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాసనసభ ఎన్నికలలో మావోయిస్టుల మద్దతును పొందుతుందని వార్తలు.. ఇవి వార్తలు కావు; సాక్షాత్తూ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి సెప్టెంబరు 24న - అంటే అరకు ఎం.ఎల్.ఎ. కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎంఎల్‌ఎ శివేరి సోమలను మావోలు హత్యచేసిన మర్నాడే సమర్పించిన డీజీపీ సమర్పించిన మెమొరాండం ఇది. దీనికి ‘బాక్‌గ్రౌండ్’ ఏమిటి?
గత సంవత్సరమే పాత అదిలాబాద్ జిల్లాలో తగ్గుముఖం పట్టిన తమ ప్రాబల్యాన్ని పెంచుకోవాలని మావోయిస్టులు తంటాలు పడటం మొదలుపెట్టారు. దీనికి కారణం గత సంవత్సరం ఆదివాసీలు- లంబాడాల మధ్య తలెత్తిన ఘర్షణలు. గత నవంబరులో ఉట్నూరు, పరిసర ప్రాంతాలలో జరిగిన సంఘటనలు ఆజ్యం పోశాయి. తమ నాయకులను, క్యాడర్‌ను కోల్పోయిన మావోయిస్టులు- పోలీసులపై ప్రతీకారం కోసం కాచుకుని కూర్చున్నారు. గత రెండు మాసాల నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో తిష్ఠవేసిన మావోయిస్టులు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీని బలపరిచేందుకు తంటాలు పడుతున్నారు. ఈ సందర్భంగా అరకు ఏజెన్సీలో ఇద్దరు నాయకులను హతమార్చారు. ఈ ‘బాక్‌గ్రౌండ్’లో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో అభివృద్ధి పనులు సాగుతున్నాయి. రోడ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టుల కంట్రాక్టర్ల నుంచి డబ్బులు లాగేందుకు మావోలు ప్రయత్నాలు సాగిస్తారు. ఈ పరిస్థితులలో టిఆర్‌ఎస్, బిజెపిలనే టార్గెట్ వారు చేయక తప్పదు. ఇక మిగిలింది కాంగ్రెస్ కాబట్టి వారినే మావోలు పరోక్షంగా బలపరుస్తారని పోలీసుల భావన. ఇది కాంగ్రెస్ అడగకపోయినా, వారికందే సాయం అని అంచనా. ఈ వార్తలన్నీ మీడియాలో వస్తున్నాయి. ఈ పరిణామాల గురించి జనం ఆలోచించాలి.

-చాణక్య