AADIVAVRAM - Others

ఎనె్నన్ని హొయలో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరళ అందాల్ని వీక్షిస్తే పరవశించని పర్యాటకులు ఉండరు.. ఇప్పుడు అక్కడి రమణీయ ప్రకృతి దృశ్యాల కోసం కాదు.. ఓ అందాల నావలో పయనించేందుకు టూరిస్టులు ‘క్యూ’ కడుతున్నారు. మధురానుభూతులను కలిగించే ఓ విలాసవంతమైన నావ కేరళలో అడుగిడే పర్యాటకులకు ఆహ్వానం పలుకుతోంది. సాగర జలాలపై విహరించే పర్యాటకుల కోసం 16.14 కోట్ల రూపాయల ఖర్చుతో ఆ నావను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ‘కేరళ షిప్పింగ్ అండ్ ఇన్‌లాండ్ నేవిగేషన్ కార్పొరేషన్’ కోసం ఈ మూడంతస్థుల అధునాతన నావను ‘గోవా షిప్‌యార్డు’ నిర్మించింది. ఈజిఫ్ట్ అందాల రాణి ‘నెఫెరిటీ’ పేరుతో సాగరయానానికి సిద్ధమైన ఈ హొయలొలికే నావ స్వర్గాన్ని తలపిస్తుంది. ఆడిటోరియం, రెస్టారెంట్, కాన్ఫరెన్స్ హాలు, పిల్లలకు ఆటస్థలం, త్రీడీ థియేటర్ వంటి అధునాతన సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. గంటకు ఇరవై నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించే ఈ నౌకలో పర్యాటకులు వింత అనుభూతికి లోనవుతారని కేరళ పర్యాటక శాఖ భరోసా ఇస్తోంది. పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ సౌకర్యంతో పాటు అధునాతన సమాచార వ్యవస్థ ఇందులో ఏర్పాటైంది. సమావేశాలు, వేడుకలు నిర్వహించుకునేలా సకల హంగులతో ఈ నౌకను నిర్మించేందుకు రెండేళ్ల సమయం పట్టింది. ‘నెఫెరిటీ’ రంగప్రవేశంతో కేరళలో టూరిజం కొత్తపుంతలు తొక్కుతుందని పర్యాటకశాఖ అధికారులు చెబుతున్నారు. ఒకేసారి 200 మంది పర్యాటకులు సాగర జలాలపై విహరించేందుకు తీర్చిదిద్దిన ఈ నావ కోచి తీరం నుంచి ప్రతిరోజూ విహారానికి బయలుదేరుతుంది.