AADIVAVRAM - Others

అందరూ ఎక్కడున్నారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అత్యున్నత మేథస్సు గల మానవులు కొంతమంది ఈ విశ్వాన్ని పరిశీలిస్తున్నారు. అంతకంతకీ బలవత్తరమైన సూక్ష్మదర్శినులతో వారు ఖండాంతర వాసులైన ప్రాణులను కనిపెట్టడం కోసం నిత్యమూ పరిశీలిస్తూనే ఉన్నారు. విశ్వం మన ఊహకు అందనంత పెద్దది. ఇందులో మనం ఒక్కళ్లమే ఉన్నామని అనుకోవటం ఎంత అజ్ఞానం?
లార్డ్ మార్టిన్ రీస్ అనే యునైటెడ్ కింగ్‌డమ్ ప్రముఖ ఖగోళ శాస్తజ్ఞ్రుడు ఇలా అన్నాడు: ‘గడచిన ఇరవై ఏళ్లల్లో ముఖ్యంగా ఐదేళ్లల్లో - రాత్రివేళ ఆకాశం చాలా ఆసక్తికరంగా ఉంటోంది. శాస్తజ్ఞ్రులు కనుగొన్నదేమిటంటే చాలా నక్షత్రాలు తమ చుట్టూ తిరిగే ఉపగ్రహాలను ప్రదర్శిస్తున్నాయి -’ అని. కెప్లెర్ ఖగోళ వాహనం (స్పేస్‌క్రాఫ్ట్) కనుగొన్నదేమిటంటే, మన సూర్యగ్రహ కూటమి లాంటి కూటములు అనేకం ఉన్నాయనీ, నీటిని కలిగి ఉన్నాయనీను. రాబోయే 20 ఏళ్లల్లో ఈ కూటముల్లో అతి దగ్గర దాన్ని మనం పరిశీలించగలమని అనిపిస్తోంది. దానిలో జీవరాశి ఉన్నదో లేదో కూడా మనం చెప్పేయగలం కూడా’ అని.
డాక్టర్ స్టీఫెన్ వెబ్ అన్న యుఎస్‌ఏ భౌతిక శాస్తవ్రేత్త అంటాడు: ‘ఆ నక్షత్ర మండలం (గెలాక్సీ)లో సుమారు వంద బిలియన్ల, నివాసయోగ్యమైన, మన భూమి లాంటి గ్రహాలు ఉండటాన్ని మనం గ్రహిస్తాము. అసలు విశ్వం అంతలోనూ 500 బిలియన్ల నక్షత్ర మండలాలున్నాయనీ, అందులో 50 సెక్స్‌టిలియన్ (5 తర్వాత 22 సున్నాలు వచ్చే సంఖ్యను 50 సెక్స్‌టిలియన్స్ అంటారు) గ్రహాలు నివాసానికి యోగ్యమైనవి ఉండి ఉంటాయని మనం గ్రహించగలమేమో.. కచ్చితంగా, మనం ఒక్కళ్లమే కాదు, ఈ విశ్వంలో ఎన్నో జీవులు తెలివితో బతుకుతున్నాయి?’
అసలు మన ఈ సౌర మండలంలోనే విశ్వాంతరాళ జీవులు (ఏలియన్స్) ఉండి ఉండవచ్చు అంటాడాయన. 2015లో నిర్వహించబడిన అభిప్రాయ సేకరణలో 45% మంది అమెరికన్లు ఈ విషయాన్ని విశ్వసిస్తున్నట్లు వెల్లడైంది. ‘అయితే మన మండలంలో వాళ్లని మనం ఎందుకు చూడలేక పోతున్నాం?’ అన్న ప్రశ్న వస్తుంది కదా. కానీ మన సౌర మండలం చాలా పెద్ద చోటు. భూమి నుంచి బృహస్పతి గ్రహం దాకా (ఎర్త్ టు నెప్ట్యూన్) వంద కోట్ల కిలోమీటర్ల దూరం ఉంది. ఈ దూరంతో అంతరిక్షంలో బుద్ధి జీవులు నివసిస్తున్నారు - అని అనుకోవటానికి వీలుగా ఒక్క లోకమైనా మనకు తగిలే అవాశం పూర్తిగా సున్నా! అయినా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి - ఒక్కదాన్నయినా కనిపెట్టటానికి.
అసలు బహుశా - ఈ భూమి మీద మన ఉనికిని కనిపెట్టటానికి అంతరిక్షంలో ఏ మూలనించో ఈ సౌర గ్రహ కూటమి మీదికి ఏదో ఒక చిన్న నౌక - జీవులు ఉండేదయినా లేనిదయినా - రాకపోతుందా అనే ఆశ కూడా శాస్తజ్ఞ్రులకు లేకపోలేదు. అల్లాంటిది నౌక ఏదయినా వస్తే అది నిలబడటానికి చాలా స్థలాలున్నాయని శాస్తజ్ఞ్రులు బొమ్మ గీసేసుకుని కూర్చున్నారు కూడా. అయితే అలాంటి నౌక ఏదీ ఇంతవరకూ తగలలేదు.
మెదడు తినేసే సిద్ధాంతాల్లో ఒకటి ఇది - విశ్వాంతరాళ గ్రహవాసులు ఈ భూగ్రహాన్ని ఒక ‘అంతరిక్ష జంతు ప్రదర్శనశాల’గా భావించి.. దూరం నించి మనల్ని గమనిస్తూ, మనతో వ్యవహరించటానికే మొహం తిప్పుకుంటున్నారేమో - అనేది.
శాస్తజ్ఞ్రుడు వెబ్ అనేదేమంటే, జీవోత్పత్తి అనే విషయం మీద పరిశోధనలు సాగుతున్నకొద్దీ ఈ భూగ్రహాంతర వాసులన్నీ చాలా లోతుగా సంబంధం కలిగి ఉన్నవే అనిపిస్తోంది. వీటిల్లో ప్రతి ఒక జీవీ విశ్వాంతరాళంలోని కేంద్రం నించి వచ్చినదే’ అని. దీన్ని ఇంకా ముందుకు తీసికెళ్లి కొందరేమంటారంటే, గతంలో ఎప్పుడో, అలాంటి కేంద్రం ఒకటి జీవకణాలను రకరకాలుగా తయారుచేసి ఈ సౌర కుటుంబం వైపు పంపిందనీ, - అంటే మన భూమి మీదకు కూడా - అవి బతకటానికి వీలుగా వాతావరణాన్ని అనుకూలం చేసుకునే పంపిందనీ, అదే నిజమైతే, మనందరం గ్రహాంతరవాసులమేననీ - అంటున్నారు. ‘అయితే ఈ సిద్ధాంతానికి రుజువుల్లేవు’ అంటున్నారు వెబ్.
వెబ్ ఇంకో మాట అంటున్నారు, ‘నక్షత్రాల మధ్య ఉన్న విపరీతమయిన దూరాల వల్ల ఆ అంతరిక్ష గ్రహవాసులు రాలేక మానుకున్నారేమో!’ ఉదాహరణకు, వాజేయర్-1 అనే అంతరిక్ష పరిశోధనా ఉపగ్రహం, 1977 సెప్టెంబర్‌లో ప్రయోగించబడింది. ఇది, సూర్యుడి అతి దూరంగా ఉన్న ప్లూటో ఉన్న దూరంకన్నా నాలుగు రెట్లు ఎక్కువ ఉన్న దూరం, 2014 కల్లా పైకి వెళ్లిపోయింది. అది చేరుకోబోయే మొట్టమొదటి నక్షత్రం పేరు, ‘ఎసి + 793888’ అంతా బాగుంది కదా. కానీ, ఆ నక్షత్రం దగ్గరకెళ్లటానికి మన ఉపగ్రహానికి 40వేల సంవత్సరాలు పట్టి తీరుతుంది.
50 ఏళ్లబట్టీ శాస్తవ్రేత్తల తలలు వాచిపోతున్నప్పటికీ ఇంతవరకూ అంతరిక్షం నుంచి ఏమీ వినపడలేదు. బహుశా అంతరిక్షంలో ఎవరైనా మేథోజీవులు ఉంటే వాళ్లు సంకేతాలు పంపుతున్నారేమో అన్న ఆలోచన కూడా లేకపోలేదు. అవి మనం అర్థం చేసుకోవటం లేదని వాళ్లు చికాకు పడుతున్నారేమో మనకన్నా లక్షల సంవత్సరాల ముందు నుంచీ ఉంటున్న జీవుల సంకేతాలు ఏ రూపంలో ఉన్నాయో మనకు ఎట్లా తెలుస్తుంది? అసలు అంత పురాతనమైన సంస్కృతులు అసలు ఏ విధంగా జీవిస్తున్నాయో, రియల్ ఎస్టేటుతో జీవిస్తున్న మనకు ఎట్లా తెలుస్తుంది?
ఫ్రెంచి శాస్తవ్రేత్త క్లెమెంట్ విడాల్ ఇలా అంటాడు: ‘హై టెక్నాలజీ ఉన్న ఆ జీవులు బహుశా సూర్యుని యొక్క బ్లాక్‌హోల్స్‌లో నివసిస్తున్నారేమో?! ఎందుకంటే సూర్యుని కంటె ఎన్నో రెట్లు అధికమైన శక్తి అక్కడ నిక్షిప్తమై ఉంటుంది గనక. బాగానే ఉంది గాని ఒక బ్లాక్‌హోల్ మనకి మూడు వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. (ఒక కాంతి సంవత్సరం అంటే 9.461 ను ఒకటి తర్వాత పనె్నండు సున్నాల సంఖ్యతో గుణిస్తే వచ్చే సంఖ్య. దాన్ని ఇప్పుడు మూడువేలతో గుణించాలి)
వెబ్ మహాశయుడు ఇంకో మాట అంటాడు: ‘టైమ్ అంటూ ఇస్తే, ఆ మేథోజీవులు అంటూ ఉంటే, మనలాగే వాళ్లు కూడా ఆ అనంతకాలంలో రోబోలను తయారుచేసి చూసి రమ్మని మన మీదికి వదుల్తారేమో! అప్పుడు మన రోబోలు వాళ్ల రోబోల ముందు వెలవెలబోతాయి కాబట్టి వాళ్ల దృష్టికి మనం ఆనం. కాబట్టే వాళ్లు ఇప్పుడు మనతో సంబంధాల్లో లేరేమో?!
‘అప్పుడు మానవులం ఒంటరివాళ్లమైపోతాం. అయ్యో ఎట్లాగ?’
అసలు అలా ఒంటరి గ్రహంగా ఉండిపోవటం కూడా ఒక ఘనకార్యమేమో. ఎందుకంటే- ఈ సౌర గ్రహ కూటమిలో అన్ని గ్రహాలకూ వాటి చుట్టూ పరిభ్రమించే ఉపగ్రహాలున్నాయి. మన భూమి చుట్టూ తిరిగే చంద్రుడు మాత్రం భూమికన్నా చాలా పెద్ద గ్రహం. ఈ పెద్ద చంద్రగ్రహం యొక్క నిశ్చలమైన ఆకర్షణ వల్లే భూమి యొక్క భ్రమణం, ఒరుగుదల, స్థిరంగా జరుగుతున్నాయి. భూమి వాతావరణం సాధ్యమైనంత స్థిరంగా ఉంచబడుతోంది. సముద్రాల్లో కెరటాలు లేస్తున్నాయి. (బహుశా ఈ సముద్ర కెరటాల వల్లనేనేమో భూమి మీద జీవనం మొదలైంది) భూమికి గురుత్వ శక్తి (గ్రావిటీ) అబ్బింది. దానివల్ల అగ్నిపర్వతాల విస్ఫోటనం జరిగి భూమికి అంటూ ఒక వాతావరణం ఏర్పడింది. బహుశా ఇలాగ రెండు గ్రహాల పరస్పర ఆకర్షణయే జీవనానికి అవసరమేమో!
బ్రిటిషు భౌతిక శాస్తజ్ఞ్రుడు డేవిడ్ వాల్ట్‌హోమ్ ఏమంటాడంటే - భూమి యొక్క అసాధారణమైన 4 బిలియన్ - అంటే వంద కోట్ల సంవత్సరాల వాతావరణ స్థిరత్వం అనేది. అనేక కణాలతో విషమంగా కలిసి ఉన్న జీవరాసుల జీవనాన్ని వృద్ధి పొందించింది. అయినప్పటికీ, ఈ భూమి మనకు పూర్తిగా సుఖశాంతుల్ని ఇవ్వలేకపోతోంది. కారణం, ఉల్కాపాతాలు, అగ్నిపర్వతాల భారీ విస్ఫోటనాలు, నీరు మంచుగా మారి ఖండాలకు ఖండాలే గడ్డ కట్టెయ్యటం. అగ్ని వల్లో ఆకలి వల్లో జనం సముదాయాలకు సముదాయాలుగా అంతరించిపోవటం వగైరాలు. (అసలు, ధృవాల నించి భూమధ్య రేఖ వరకూ, రెండు పక్కలా, భూమి లక్షల కొద్దీ సంవత్సరాలపాటు గడ్డకట్టుకొని పోయే ఉండిందని ఒక సిద్ధాంతం ఉంది) బహుశా ఈ వినాశనాలు కూడా, మిగిలిన జీవాల్లో మేథస్సు పెరగటానికి కారణమయ్యాయేమో) పరిశోధకుల మరొక సిద్ధాంతం ఏమిటంటే, పైన చెప్పుకున్న మంచు కరిగి సముద్రాల్లో కలవటం వల్ల, బలవర్థక ధాతువులు భూమిలోంచి లేచి ఆ మంచు నీటితో వచ్చి సముద్రాల్లో కలిసాయనీ, ఆ సముద్రాల్లో నించే జీవాలు ఉద్భవించాయి అనీను.
మనం ఒక్కళ్లమే అయిపోతున్నామే అనే విచారం అక్కర్లేదు. ఆ మాటకొస్తే భాష, పరికరాలు, నైపుణ్యాలు, అంతరిక్ష పరిశోధనలు - ఇవన్నీ మన సొంతం. అంతరిక్షం లోంచి ఏదైనా జీవజాతి వచ్చి మనల్ని చూస్తే ఇట్లాగే అది కూడా మేథోజీవజాతి అవుతుందన్న గ్యారంటీ ఏమిటి?
సరే, ఇంత తర్జనభర్జన పాశ్చాత్య శాస్త్ర లోకంలో ఇప్పుడు జరుగుతోంది. కానీ ఇదంతా మన హిందూ దేశంలో కొన్ని వేలవేల... ఏళ్లనాడే జరిగింది. ఒక ఉపనిషత్తు కథ చెప్పుకుందాం.
ఒక ఋషి దంపతులు చనిపోయాక అతని కుమారులు పదిమంది కలిసి ఒక కొండ మీద కూర్చొని ‘లోకాలన్నింటినీ శాసించేటంత గొప్పవాళ్లం కావాలి’ అనుకుంటూ తపస్సు చేస్తున్నారు. హఠాత్తుగా ఒక బ్రహ్మాండమైన కాంతిపుంజం వారికి కనిపించింది. అందులోంచి మాటలు వినిపించాయి. ‘అబ్బాయిలూ మీరేం చేస్తున్నారు?’ ‘మేం ఈ సృష్టి అంతటికీ చక్రవర్తులం అవుదామనుకుంటున్నాం. ఇంతకీ మీరెవరు?’
‘నేను ఈ భూమండలానికి సూర్యుణ్ణి. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. కానీ ఈ సృష్టిలో ఉన్న అందరు సూర్యుళ్లూ ఇలాగ మిమ్మల్ని ఆశీర్వదిస్తేనే గాని మీ కోరిక తీరదు’ అని ఆ సూర్యుడు మాయమై పోయాడు. అప్పుడు ఈ పదిమందీ ఇతర గ్రహాలకి వెళ్లారు. ఆ గ్రహాల్లో ఉన్న సూర్యుళ్లు వీళ్లని ఆశీర్వదించారు.. ఇట్లా ఏ దిక్కులో ఎంత దూరం వెళ్లినా కొత్తకొత్త గ్రహాలు ఇంకా ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఈ తిరుగుళ్ల వల్ల తమ తపస్సు అంతా ఖర్చయిపోతున్నదని వాళ్లు గ్రహించారు. విసుగొచ్చేసింది. కనక అంతా వెనక్కొచ్చి ఆ కొండ మీద తమతమ స్థానాల్లో కూర్చుని తిరిగి తమ తపస్సులో మునిగిపోయి, ‘సర్వేశ్వరా నీ సృష్టి ఎంత విశాలమైనదో మాకర్థం కావట్లేదు. కనుక మాకింక ఏ కోరికా లేదు. మమ్మల్ని అనుగ్రహించు చాలు’ అన్నారు.
ఈ కథను శాస్తవ్రేత్త వెబ్‌కి ఎవరన్నా వినిపిస్తే బాగుంటుంది!
*

-గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు 9885798556