AADIVAVRAM - Others

మనిషికో స్నేహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పచ్చపచ్చటి చెట్లూ.. వాటి మధ్య పాలపొంగులా ఎగిసిపడే జలపాతపు సోయగాలు స్ఫురిస్తున్నాయ్..
పాలరాతి బొమ్మలా.. జక్కన చెక్కిన చక్కని శిల్పంలా.. అందంగా.. అరవిందంలా సరస్వతి పచ్చని పట్టుచీరలో, తెలతెలని పలువరసల గలగల నవ్వుతూ తననే తదేకంగా చూస్తూ కుర్చీ చూపించి ఆహ్వానిస్తూంటే స్వర్గంలోకి అడుగెట్తున్నట్లన్పించింది తన్మయ్‌కి.
సరస్వతి లాన్‌లో తనకి కేటాయించిన గార్డెన్ చైర్‌లో సెటిలయి ‘హలో సరసూ.. ఐ లవ్ యూ.. ఐ లైక్ యూ..’ అనాలన్పించి, తన వాక్ప్రవాహాన్ని గుండెలోతుల్లోనే అదిమేసి, గొంతుని బలవంతంగా నొక్కేసి, ‘్థంక్స్’తో సరిపెట్టేశాడు స్వప్నాన్నించి వాస్తవంలోకి అడుగేసి తన్మయ్.
ముఖంలో వేల మతాబులు వెలిగించుచు వికసిస్తున్న, ప్రకాశిస్తున్న, హసిస్తున్న సరస్వతిని ఒక్కసారిగా చూసిన తన్మయత్వంలో తన్మయ్ రసాస్వాధనలో, సౌందర్యోపాసనలో కాలేజీ రోజులకు వెళ్లిపోయాడు. కుదుటపడ్డ మనసులో ఇంకా అలజడి కొనసాగుతూనే ఉన్నది. చుట్టూ ఉన్న పచ్చదనాన్ని.. వాటర్ ఫౌంటెన్ నుండి పడ్తున్న సన్నని తుంపరల్ని.. తనని తదేకంగా చూస్తూండిపోయిన తన్మయ్‌ని పలకరించింది చిక్కటి చక్కటి నురగల కాఫీ - పెదవి కానిన కాఫీ చురుక్కు మన్పించడంతో తన్మయ్ ‘ఇటీజ్ టూ హాట్ వావ్...’ అంటూ చిందులు తొక్కాడు.
‘ఏంటి తన్మయ్ ఆ పరధ్యానం.. ఏంటీ విషయం...’ గలగల గంగల్లే నవ్వింది. ‘అదే.. అదే.. పచ్చదనం అద్దినట్లున్న ఈ లాన్‌ని, ఇంతలా పెంచి రూపుదిద్దిన నీ ప్లాన్‌ని.. ఈ లాన్ పచ్చదనానికి మ్యాచింగ్ నీ ఒంటికి చుట్టిన ఆ పచ్చని పట్టుచీరని.. వావ్... ఈ కాలం ఇక్కడే, ఇలాగే ఆగిపోతే ఎంత బావుండును..’ చాలా ఉత్సాహం తన్మయ్ కళ్లల్లో చూసింది సరస్వతి.
‘ఇంకా నయం.. అంతటితో ఆగు తన్మయ్. మరీ కవి భావనలు.. అల్లికలు.. వినేవాళ్లు నవ్విపోగలరు వయసు మరచిన నీ మాటలు వింటే...’ అంటూ మృదువుగా హెచ్చరించింది సరస్వతి తన్మయ్‌ని. ఎమోషన్స్‌ని సర్దుబాటు చేసుకోవడంలో ఇద్దరి మధ్యా కొంత కాలం వౌనం వహించింది.
తనని తను సంభాళించుకున్న సరస్వతి ‘ఏంటి ఈ రోజు చాలా హుషారుగా ఉన్నావ్. సరోజ గానీ యు.ఎస్. నుండి చాటింగ్ చేసిందా వీడియో కాల్‌లో..’ అంటూ గంభీరంగా రాజ్యం చేస్తున్న వౌనాన్ని పారద్రోలే ప్రయత్నం చేసింది.
‘మరె.. తనకి అంత తీరుబాటా (స్వగతంలో) ఉన్నదంతా తీరుబాటే - కాకపోతే మనకి అంత టైమ్ కేటాయించదు. అంతే. తనకంత మన మీద విలువ ఉంటే అక్కడ ఎందుకుంటుంది. మాకెందుకు ఈ ఎడబాటు మొగమాటం లేకుండా అంటూ, ‘మనసున మనసై బ్రతుకున బ్రతుకై’ పాటందుకున్నాడు తన్మయ్.
మ్యాటర్ సీరియస్ అయ్యే మీటర్‌లో కన్పించి సరస్వతి తన్మయ్ దృష్టిని సాహిత్యం మీదకి మళ్లించింది. సాహిత్యం గురించి మొదలెడ్తే తన్మయ్ అన్నీ మరచిపోతాడు. సాహిత్యం అన్నా.. ప్రకృతిని వర్ణన చేయడం అన్నా తన్మయ్‌కి క్రేజు, మోజు. కాలేజీ రోజుల్లో నుంచి తన్మయ్‌కి చాలా భావనాశక్తి, రచనా పటిమ ఉండేవి. ఆ అభిరుచులే తన్మయ్‌ని సరస్వతికి దగ్గరగా చేశాయి. ఇద్దరి మనస్సుల్లో గత స్మృతులు మెదిలి వౌనం మళ్లీ తిష్టవేసింది.
ఇంతలో వౌనమేలనోయి.. మరపురాని రేయి.. అంటూ జాకీ జాతి కుక్కపిల్లని చైన్ పట్టుకు తిప్పుతూ నిశ్శబ్దాన్ని తరిమివేశాడు. జాకీ కూడా ఇద్దరికీ కాలేజీ ఫ్రెండ్. సరస్వతి పక్క విల్లాలోనే ఉంటుంటాడు - సందడి చేస్తూంటాడు.
పచ్చపచ్చగా నోళ్లిచ్చుకున్న పచ్చిక బయళ్లపై వీచే చల్లని గాలి శరీరాల్ని తాకుతుంటే ఎంతటి తాపమైనా తపనలార్చుకుంటుంది. పూచే పున్నమి వెనె్నల మనసుల్ని చల్లారుస్తుంటుంది. తన్మయ్, సరస్వతిలు ఒకప్పటి ప్రేమికులు వారివురు - ఇరువురొకటయ్యారు మనోభావాల్ని ఏకం చేసుకుని; శారీరకంగా వేరైనా మానసికంగా పెనవేసుకుపోయారు.
అయితే తలచినదే జరిగినదా దైవం ఎందులకు.. జరిగినదే తలచితిమా శాంతిలేదు మనకు అన్నట్లు, కలసిరాని కాలంతో రాజీపడి ఇద్దరు వేరువేరు వివాహాలు చేసుకున్నారు, ప్రేమని పవిత్రంగా గుండెలోనే పదిలపరచుకుని.. విడివిడిగా మనసాగారు.
అయినా కాలం కలిసిరాలేదు - చేసుకున్న వివాహాలు శారీరకంగా ఏకం చేశామేమో గాని.. మానసికంగా దగ్గర కాలేదు జత కూడినవారు-
మానసికంగా స్పర్థలు చోటుచేసుకున్నాయ్-
ఫలితం ఒంటరి జీవితం.. మంటలు రేపుతోంది - ఇది వాస్తవం.
సరస్వతి భర్తతో విడిపోలేదు - భర్త సరస్వతి నుండి విడాకులు కోరుతున్నాడు - కారణం సరస్వతి గతం తెలియడం. చేయని తప్పునకు సరస్వతి వౌనపోరాటం చేస్తోంది భర్తతో. తన్మయ్ చేయి అందించటానికి సిద్ధమే - సరోజ చేయి అందుకోనని చేస్తోంది యుద్ధమే.
సరోజ ఎం.ఎస్. చేసింది అమెరికాలో - తన కూడా రమ్మంటుంది తన్మయ్‌ని అమెరికా.. తను ఇండియా రానుగాక రానని - తన్మయ్‌ని అమెరికాకి రప్పించుకుంటానంటోంది.
ఈ పరిస్థితుల్లో... ఈ మనస్పర్థల్లో.. ఈ నాటకానికి తెర దించేదెవరు - శుభం పలికేదెవరు -
ఎవరో రావాలి.. ఏదో చేయాలి...
రానే వచ్చింది ఆ శుభ తరుణం-
సరోజ హుటాహుటిన తన్మయ్ దగ్గర వాలిపోయింది కాగితం, కబురైనా లేకుండా...
సరస్వతిని కలుసుకుందామని కబురంపాడు భర్త విశాల్ వినమ్రంగా...
అనూహ్యమైన ఈ పరిణామానికి తెర తీసింది ఎవరు...
ఈ నలుగురిలో ఏ ఒక్కరు ముందడుగు వేయకుండా ఈ కదలిక ఎలా వచ్చింది -
సరస్వతికి విశాల్ వీడియో చూపించాడు... ఆడియో వినిపించాడు - ఖిన్నురాలయిపోయింది సరస్వతి, క్షణకాలం. సారాంశం ఏమంటే, సరస్వతి తన్మయ్ ఏకాంతంలో వివాహానికి సిద్ధమవుతున్నట్లు.. దృఢపరుస్తోంది ఆ వీడియో; వీడియోని బలపరుస్తూ వాళ్లిద్దరి ఆడియో.
సేమ్ టు సేమ్.. అదే వీడియో సరోజ తన్మయ్‌కి చూపించి, ‘ఏమిటి ఈ నిర్ణయం.. ఎందుకు సడన్‌గా ఈ నిర్ణయానికి వచ్చారు...’ అంటూ ప్రశ్నించింది. తన్మయ్ ఖంగు తిన్నాడు ఆ వీడియోని, ఆ ఆడియోని చూసి విని. స్మార్ట్ ఫోన్ అటు ఇటు తిప్పి చూశాడు - వింతగా ఉంది - అచ్చు గొంతులు మావిగానే ఉన్నాయి. కాని.. ఎలా.. ఎవరు సృష్టించారు?
కొంచెం ముందుకు జరిపాడు ఆ వీడియోని. కంటిన్యూషన్ విన్పిస్తోంది జాకీ వాయిస్‌లో. నలుగురు జాకీని చుట్టుముట్టారు - నిలదీశారు - ఎందుకు ఈ ధ్వన్యనుకరణ - ఎవరి మీద నీ ఈ కరుణ-
జాకీ పెదవి విప్పాడు. ‘స్పర్ధలతో.. ఇగోలతో.. అనవసరంగా జీవితాల్ని దుఃఖమయం చేసుకుని ఒంటరి పోరాటం ఇంకెంత కాలం.
ప్రేమించుకున్నారు - కాదనుకున్నారు - విడిపోయి వేరే వేరే మనువులు చేసుకున్నారు - ఎవరి కాపురాలు వాళ్లు చేసుకోక ఏదేదో ఊహించుకుని మీలో మీరే రగిలిపోయి.. మీ మధ్య ఇగో పెంచుకుని మీరు కూర్చున్న కొమ్మ నరుక్కుంటున్నారు.’ విశాల్.. పేరులోనే మిగిలిపోతే.. సంకుచితమే హృదయమైతే జీవితాలకి నిష్కృతి లేదు - ఏ మలినం అంటని పవిత్ర ప్రేమ వాళ్లిద్దరిది - ఎలాంటి సంకోచాలు పెట్టుకోకు - మనసు తెరిచి చూడు సత్యం నీకే తెలుస్తుంది.
‘సరోజా.. భర్త ఎక్కడ ఉంటే అదే అమెరికా అనుకోవాలమామ.. అమెరికాలో భర్తని వెతుక్కోకూడదు. నీవు ఊఁ అంటే నీ చేయి అందుకోటానికి తన్మయ్ సిద్ధం.. ఇంక చాలించు నీ యుద్ధం..’ అంటూ తెర తీశాడు జాకీ.
రెండు జంటలు మబ్బులు తొలగిపో, వినీల నీలాకాశం అంత ఎత్తుకి ఎదిగిన జాకీని ప్రేమగా చూస్తూ ఒకరిని ఒకరు అల్లుకుపోయారు పందిరికై పెనసిన మల్లెతీగలా.

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505