Others

లాలిజో లాలిజో.... (నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని పాటలు తలలూపే పాటల్లాకాకుండా, తలచుకునేకొద్ది తలరాతను దిద్దుకోమని, బుద్ధిని సరిదిద్దుకోమని హెచ్చరిస్తాయి. కమలహాసన్ నటించిన ‘ఇంద్రుడు- చంద్రుడు’ చిత్రంలోని ‘లాలిజో లాలిజో/ ఊరుకో పాపాయి/ పారిపోనీకుండా పట్టుకో నాచేయి’ పాట నాకు చాలా ఇష్టం. సిరివెనె్నల సీతారామశాస్ర్తీ రచన, ఇళయరాజా సంగీతం, బాలసుబ్రహ్మణ్యం గళం.. వెరసి ఆ చిత్రంలో ఈ పాట ఓ అద్భుతం. తప్పులు అందరి జీవితాల్లోనూ ఉంటాయి. కాని జీవితాంతం చేసే తప్పులు ఎవరి జీవితాల్లోనూ ఉండకూడదు. తప్పని తెలిసినపుడు ఆ తప్పునుంచి తప్పుకోవడం ఉత్తమమని రచయిత పాటలోని చరణంతో గుర్తు చేస్తాడు -‘వెళ్లే పెడదారిలో/ ముల్లే పొడిచాకనే/ తప్పిదం తెలిసింది/ ముప్పునే చూసింది/ కన్నులే విప్పింది/ గండమే తప్పింది/ ఇంటిలో చోటుందా/ చెప్పవే పాపాయి’ అని.
మన దురవస్థలకు మన దురలవాట్లే కారణం. వాటిబారిన పడినపుడు తల్లిదండ్రులు చెప్పినా వినరు. భార్య ఏడ్చినా అర్థం చేసుకోరు. కాని జీవితమే ఏదోక రూపంలో అందరికీ అవకాశాలు ఇస్తూనే వుంటుంది. మనల్ని మంచిగా మారమని చెబుతుందన్న అర్థంతో -‘పిల్లలు ఇల్లాలు/ ఎంతగా ఏడ్చారో/ గుండెలో ఇన్నాళ్లూ/ కొండలే మోసారు/ నేరం నాదైనా/ భారం మీపైనా’ అంటూ మేల్కొలుపుతాడు. ‘తండ్రి నేనైనా/ దండమే పెడుతున్నా/ తల్లిలా మన్నించు/ మెల్లగా దండించు/ కాళిలా మారమ్మ/ కాలితో తన్నమ్మా/ బుద్ధిలో లోపాలే/ దిద్దుకో నీవమ్మా’ అన్న చరణంలో జాతీయ నటుడు కమల్ హాసన్ ఎక్స్‌ప్రెషన్స్ అత్యద్భుతం. చిత్రంలో పాట సందర్భం.. దానికి తగ్గట్టుగా సంగీతం.. భావార్థాలూ.. అన్నీ సమపాళ్లలో కుదరడంతో చిరకాలం గుర్తుండిపోయే పాట ఇది. ఇంద్రుడు -చంద్రుడు చిత్రానికి ఈ పాట ఓ హైలెట్.

-పి శాలిమియ్య, నందికొట్కూరు