AADIVAVRAM - Others

పెద్దవాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సండేగీత.....
========

జీవితంలో కొంతమందికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి.
కొంత మందికి ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకోవాలని ఉంటుంది.
గొప్ప క్రీడాకారుడు కావాలని కొంతమందికి, కళాకారుడు కావాలని మరి కొంతమందికి ఉంటుంది.
చాలామంది దృష్టిలో కొందరి లక్ష్యాలు చిన్నవి కావొచ్చు. కానీ ఆ లక్ష్యం పెట్టుకున్న వ్యక్తి దృష్టిలో అతని లక్ష్యం పెద్దది.
ఆ లక్ష్యం సాధించినప్పుడు గొప్ప ఆనందం వుంటుంది. ఎవరైనా పెద్దవాళ్లకి చెప్పుకోవాలని ఉంటుంది. వాళ్లు లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది.
అవార్డులూ అంతే!
అవార్డులు వచ్చినప్పుడు పెద్దవాళ్లు చూడాలని అన్పిస్తుంది.
వాళ్లు బతికి లేనప్పుడు మరీ ఎక్కువగా అన్పిస్తుంది.
కష్టమూ అంతే.
కష్టం వచ్చినప్పుడు ఎవరైనా పెద్దవాళ్లు ఉంటే ఎంత బాగుంటుంది అన్పిస్తుంది.
ఎందుకంటే-
వాళ్లని పట్టుకొని ఏడ్వవచ్చు.
సంతోషాన్నీ దుఃఖాన్నీ పంచుకోవడానికి పెద్దవాళ్లు కావాలి.
వాళ్లు బతికి వున్నప్పుడు వాళ్ల అవసరాన్ని అంతగా గుర్తించం.
చనిపోయిన తరువాత గుర్తించీ ఫలితం ఉండదు.
అయినా పెద్దవాళ్ల ఆశీస్సులు వున్నాయని అనుకొని ప్రయాణం కొనసాగించాలి.
*

-- మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001