Others

సందేహం మొదటి మెట్టు (ఓషో బోధ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్ఞానవృక్ష ఫలం తినడానికి ముందు ఆదాము దేవుడిలోని భాగం. వాడు ‘అలాగే’అని చెప్పగల విధేయుడే కానీ, స్వతంత్రుడు కాడు, స్వతంత్రత ‘వద్దు’అనే ద్వారంనుంచి మాత్రమే ప్రవేశిస్తుంది. అలాగే, పరాధీనత ‘అవును’అనే ద్వారంనుంచి మాత్రమే ప్రవేశిస్తుంది. కాబట్టి, ఒంటెది పరాధీనతతో ఉన్న నిస్సహాయ స్థితి. ఆ స్థితిలో మీకు మీకన్నా, మీ సొంత విషయాలకన్నా తల్లి, తండ్రి, దేవుడు, మతాచార్యుడు, సమాజం, రాజకీయ నాయకుడు లాంటి ఇతర విషయాలే చాలా ముఖ్యమవుతాయి. అది మరీ అచేతన స్థితి. మనుషులలో దాదాపు తొంభైతొమ్మిది శాతం మంది పసిగుడ్డు స్థాయిలోనే ఇరుక్కుపోయి ఒంటెలుగా మిగిలిపోయారు. అందుకే వారికి ఆనందం లేదు. అది మరీ దీనాతిదీన స్థితి. మీరు ఆనందంకోసం అనే్వషిస్తూనే ఉంటారు. కానీ, అది మీకు దొరకదు. ఎందుకంటే, ఆనందం బయట దొరికేది కాదు కదా!
మీరు మూడవ దశ అయిన శిశువుగా మారనంతవరకు, అలాగే మీరు సీతాకోక చిలుకలా మారనంతవరకు, ఆనందాన్ని మీరు తెలుసుకోలేరు. ఎందుకంటే, ఆనందం బయట దొరికేది కాదుకదా! అది మీ లోలోపల ఎదిగే దార్శనికత. మూడవ దశలో మాత్రమే అది సంభవిస్తుంది.
మొదటి దశ అయిన ఒంటెది దీన స్థితి, మూడవ దశ అయిన శిశువుది ఆనంద స్థితి. ఈ రెండింటిమధ్యలో ఉండే సింహంస్థితి కొన్ని సమయాలలో దుఃఖంతోనూ, మరికొన్ని సమయాలలో ఆనందంతోనూ ఉంటుంది.
ఒంటె స్థితిలో మీరు చిలుక పలుకులు పలుకుతూ కేవలం జ్ఞాపకాలుగా మాత్రమే ఉంటారు. మీ జీవితమంతా ఇతరులిచ్చిన నమ్మకాలతో నిండిపోతుంది. క్రైస్తవులలో, హిందువులలో, మహమ్మదీయులలో, జైనులలో, బౌద్ధులలో ఇది మీకు కనిపిస్తుంది. చర్చిలకు, దేవాలయాలకు, మసీదులకు వెళ్ళినప్పుడు చిలుకల్లా పునరుచ్ఛరణ చేసే ఒంటెల సమూహాలు మాత్రమే మీకు కనిపిస్తాయి తప్ప, ఒక్క మనిషి కూడా మీకు కనిపించడు. ఎందుకంటే, ఒంటెలు నమ్మకాల మాయలో జీవిస్తాయి. నమ్మకాల మాయ అద్భుతంగా పనిచేస్తుంది. కానీ, ఒంటెలో ఎలాంటి మార్పురాదు. అది ఏమాత్రం ఎదగకుండా అలాగే ఉండిపోతుంది.
దేవాలయాలలో, చర్చిలలో, మసీదులలో ప్రార్థనలుచేసే వారందరూ నమ్మకాల ప్రభావంలో ఉంటారు. వారికి దేవుడంటే ఏమిటో, దివ్యానుభూతి ఎలా ఉంటుందో తెలియదు. వారు కేవలం నమ్ముతారు. ఆ నమ్మకమనే మాయ వారికి కొన్ని పనులు చక్కగా చేస్తుంది. అదంతా వారిలో నమ్మకం కలిగించేందుకే. అన్నీ కలలో జరిగినట్లు జరిగిపోతాయి. అయినా వారెవరూ అచేతనంలో నిద్రిస్తున్నవారు కారు. గుర్తుంచుకోండి, ఈ స్థితి అవసరంలేదని నేను చెప్పట్లేదు.
అది అవసరమే. కానీ, ఒకసారి అది ముగిసిన తరువాత అందులోంచి బయట పడాలి. ఎవరూ శాశ్వతంగా ఒంటెలా ఉండవలసిన పని లేదు. మీరు మీ తల్లిదండ్రులను, గురువులను, మతాచార్యులను, సమాజాన్ని కోపగించుకోకండి.
ఎందుకంటే, మీలో ఒక రకమైన విధేయతను సృష్టించేది వారే. ఎందుకంటే, విధేయత ద్వారానే మీరు దేన్నైనా జీర్ణించుకోగలరు. తల్లిదండ్రులు బోధిస్తారు, పిల్లలు వాటిని నేర్చుకుంటారు. ఒకవేళ పరిపక్వతకు ముందే సందేహం వచ్చినట్లైతే జీర్ణవ్యవస్థ ఆగిపోయినట్లే.
తల్లి గర్భంలోని శిశువును ఒక సందేహ ప్రాణిగా ఊహించి చూడండి. ‘‘తల్లినుంచి లభించే ఆహారాన్ని తీసుకోవాలా, వద్దా? అది నిజంగా శక్తినిస్తుందా, ఇవ్వదా? అది విషపూరితమేమో! ఎవరికి తెలుసు? రోజంతా నిద్రపోవాలా, వద్దా? ఎందుకంటే, తొమ్మిది నెలలపాటు రోజంతా నిద్రపోవడం మరీ ఎక్కువేమో?’’- ఇలాంటి సందేహాలు శిశువుకు వస్తే, వెంటనే ఆ శిశువు మరణిస్తుంది. అయినా దేని సమయం దానికి వస్తుంది. అలాగే సందేహాలను స్వయంగా తెలుసుకునే రోజు అందరికీ తప్పక వస్తుంది.
‘‘కొడుకుకు ఏమి చెప్పాలి?’’ అనేది ప్రతి తండ్రికి, ‘‘కూతురుకు ఏమి చెప్పాలి?’’అనేది ప్రతి తల్లికి, ‘‘నూతన తరానికి ఏమి చెప్పాలి?’’ అనేది ప్రతి ఉపాధ్యాయునికి ఎదురయ్యే పెద్దసమస్య. అనేక కీర్తి పతాకాలతో, అనేక అత్యున్నత అవగాహనలతో, అనేక ముగింపులతో కూడిన గతాన్ని శిశువుకు బోధించడం జరిగింది.
తొలి దశలో అందరూ తమకు బోధించిన దానిని నమ్ముతూ, దానిని తమలో జీర్ణం చేసుకుంటూ, ‘అవును, అలాగే’ అంటూ తలలూపే ఒంటెలే. కానీ, అది కేవలం ప్రయాణానికి ప్రారంభం మాత్రమేకానీ, ముగింపు కాదు.
రెండవ దశ కాస్త కష్టమైనది. తొలి దశ సమాజం మీకిస్తుంది. అందుకే సమాజంలో ఒంటెలు అనేక లక్షలుంటాయి, సింహాలు కొన్ని మాత్రమే ఉంటాయి. మీరు పరిపూర్ణమైన ఒంటెగా మారగానే సమాజం మిమ్మల్ని వదిలేస్తుంది. ఎందుకంటే, సమాజం అంతకుమించి ఏమీచెయ్యలేదు. సమాజం పని పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాలతో ముగిసింది. అవి మిమ్మల్ని పరిపూర్ణమైన ఒంటెలుగా తయారుచేసినట్లు పట్టాలిచ్చి పంపిస్తుంది.
-----------------------------

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు - విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్: 040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.