Others

ఆలోచన అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్య ఎక్కడ చూసినా స్ర్తిలకు ఇబ్బందులే తలెత్తున్నాయి. ఇంట్లో ఉన్నా కష్టమే. బయటకు వెళ్లినా కష్టమే అనిపిస్తోందోసారి.
కాలేజీలకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేదాకా ఉద్యోగినులు అయిన అమ్మలు కూడా తమ పిల్లలపైన ఎన్నో నియంత్రణలు విధిస్తున్నారు. ఈ సమయంలోనే ఇంటికి రావాలి అని, ఇతర పిల్లలతో అంటే అబ్బాయిలతో మాట్లాడకూడదని, వారితో స్నేహం చేయకూడదని, ఫోన్ లో ఎక్కువగా మాట్లాడకూడదని, వీడియోలు చూడకూడదని ఇలా ఎన్నో అంక్షలు.
నిజమే ఈ అంక్షలకు కారణమేమిటి అని ఆలోచిస్తే ప్రేమోన్మాదం ఈ మధ్య మరీ పెరిగిపోతోంది. పదవ తరగతి కన్నా చిన్న తరగతులు చదివేవారిలోను, లేదంటే కాలేజీలో అడుగు పెట్టిన వారిలోను ఈ ప్రేమ యాత్రలు ఎక్కువ అవుతున్నాయి.
నిజానికి వీరికి ప్రేమ అంటే అసలు తెలీదు. ఆకర్షణే ప్రేమ అనుకొనే అమాయకులు ఎంతో మంది ఉన్నారు. అందులో కిరాతకులు అమ్మాయిల అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకుని వారి పని కానిచ్చేస్తున్నారు. దానితో విపరీతంగా ఆడపిల్లలు నష్టపోతున్నారు. అటు మానసికంగా ఇటు శారీరకంగా ఎంతో నష్టపోతున్నారు. అందుకే తల్లిదండ్రులు ఇన్ని అంక్షలు పెడుతున్నారు.
మరికొద్దిమంది ఇంట్లోవారికి తెలియకుండా కొన్ని సంవత్సరాలు ప్రేమ పేరుతో తిరుగుతూ చివరకు విడిపోతున్నారు. అట్లా విడిపోయిన వారిలో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంకొంత మంది తాము అనుకున్నట్లుగా జీవితం సాగలేదని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఇంకొంతమంది చదువులో ముందుకుపోలేక పోతున్నామనో, లేక తమతోటి వారు తమకంటే ముందున్నారనో, లేక వారికున్నన్ని వసతులు వీరికి లేవనో ఏదో ఒక సాకుతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. అందుకే తల్లిదండ్రులు గాబరాపడి పిల్లల్ని గాబరా పెట్టేస్తున్నారు.
వీటికి భయపడి మరికొంతమంది విపరీతమైన కండీషన్లు పెడుతున్నారు. ఆ కండీషన్లకు తట్టుకోలేక పిల్లలు సతమతమై వారు ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదు.
కొందరు తల్లిదండ్రులు పిల్లలు వారికిష్టమొచ్చినట్లు నడుచుకోలేదన్న కారణంతో ఇంట్లోనుంచి పంపించివేస్తున్నారు. ఇటువంటి తల్లిదండ్రులను ఏమనాలి? పిల్లలు తప్పు చేయక పెద్దలు చేస్తారా? అయినా ఈ ప్రపంచంలో ఎక్కడైనా తప్పు చేయని మనుషులు ఉంటారా? ఉన్నారా? పిల్లలు ఏదో తప్పు చేస్తే తల్లిదండ్రులు చెప్పింది వినలేదన్న ఒకే ఒక కారణంతో వారిని వీధిపాలు చేస్తే వారు ప్రాణాలమీదకు తెచ్చుకుంటే ఎవరిది బాధ్యత? ఆ పిల్లలు మానసికంగా బలహీనులై పిచ్చివాళ్లు అయిపోతే ఎవరిది తప్పు? ఇట్లా రోడ్లమీదకు వదిలేవేసే తల్లిదండ్రులను ఏమనాలి?
తల్లిదండ్రులు సంయమనాన్ని పాటించాలి. ఒక్కోసారి పిల్లలు తప్పు చేయవచ్చు. అంతమాత్రాన వారుచెడ్డవారు అయిపోరు. వారికి వారు ఏంతప్పు చేస్తున్నారో తెలియచెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఈవిషయంలో తండ్రులు అమానుషంగా ప్రవర్తిస్తే తల్లి పిల్లలకు అండగా నిలబడాలి. తప్పు చేసిన పిల్లల్లో మార్పు తీసుకొని రావాలి కాని వారిని వీధి పాలు చేయడం ఏమాత్రం మంచిపని కాదు. ఒకటికి రెండు సార్లు చెప్పి చూసి వారిలో మార్పు వచ్చేవిధంగా ప్రవర్తించాలి కానీ పిల్లలను మాత్రం ఎప్పటికీ ఒంటరిగా వదిలివేయకూడదు. ఇది తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యమే అవుతుంది కానీ వారికి కట్టుబాట్లు నేర్పించడం కాదు.
పిల్లలు కూడా తల్లిదండ్రులు ఎందుకు చెబుతున్నారో ఆలోచించాలి. ఒకవేళ ఏదో కోపంలో బయటకువెళ్లు అని అరిచినంత మాత్రాన వెంటనే వెళ్లిపోకూడదు. విశాల ప్రపంచమే అయ్యి ఉండవచ్చు. కాని తోడు లేకుండా ఎలా బ్రతుకుతారు? కలలోనో, సినిమాలోనో బతికేసినట్టు వాస్తవ జీవితంలో బతకలేరు. కనుక కాస్తా నిదానించి తల్లిదండ్రుల కోపం పోయేవిధంగానడుచుకోవాలి. వారికి మీరు అనుకున్నది, మీకు కావాల్సిన దాని గురించి విపులంగా చెప్పాలి. ఎందుకు మీరు దానిని కావాలనుకొంటున్నారో తెలియచెప్పాలి.
ఒకవేళ తల్లిదండ్రులు వద్దు అంటే ఆగాలి.ముఖ్యంగా ప్రేమగొడవల్లో పెద్దలను ఎదిరించి పెళ్లిచేసుకొని జీవించటం కన్నా తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లిచేసుకొని జీవించడంలో ఎంతో ఆనందం ఉంటుంది. పెళ్లి అనేది కేవలం ఇద్దరి మధ్య బంధం కాదు ఇరు కుటుంబాల మధ్య అనుబంధం. కనుక పెద్దలు చెప్పింది వినాలి. వారిని ఒప్పించేదాకా ఆగాలి. అంతేకాని ఒంటరిగా బతికేస్తామని బయటకు వచ్చేయకూడదు. మన భారతీయత త్యాగాన్ని నేర్పిస్తుంది. త్యాగ గుణం పెద్దల్లో లేకపోతే పిల్లల్లో ఉండితీరాలి. వారు చేసిన త్యాగమే వారిని గెలిపిస్తుంది కూడా. అందుకే ఆలోచించి అడుగు వేయాలి కానీ తొందరలో, ఆవేశంలో వేసే అడుగు మంచిది కాదు.

- కీర్తి