Others

యంత్ర విజ్ఞానము( పురాణాల్లో శాస్తవ్రిజ్ఞానం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు
H.No. 7-8-51, Plot నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079
=====================================================================

గురుత్వాకర్షణ శక్తి మొదలుకుని ఒక వస్తువు యొక్క కదలికలు వాటికి కారణమైన శక్తులు మొదలగు విషయాల గురించి ఎందరో విదేశీ శాస్తవ్రేత్తలు ఎన్నో ఏళ్ళు శ్రమించి మనకు తెలియజేశారని ఈనాడు విద్యార్థులకు పాఠ్యగ్రంథాల్లో చెబుతున్నారు. దీని కారణంగా ప్రతి వైజ్ఞానిక ఆవిష్కరణ, పాశ్చాత్యుల (శాస్తజ్ఞ్రుల)వల్లనే జరిగిందనే భావన మనవారిలో బాగా పెరిగింది.
పాశ్చాత్య శాస్తజ్ఞ్రులు చెప్పియుండకపోతే ఆయా శాస్తవ్రిషయాలు భారతీయులకు తెలియవనే స్థితిలోకి వచ్చారు మన విద్యాలోకం. విదేశీ శాస్తవ్రేత్తలు పైన పేర్కొన్నవాటి గురించి కనుగొని సుమారు 300 సంవత్సరాలు అవుతోంది. కాని మన మహర్షులు కొన్ని లక్షల సంవత్సరాల క్రిందటే వీటి గురించే కాక ఇంకా అనేక శాస్త్ర విషయాల గురించి వారు వ్రాసిన అనేక శాస్త్ర గ్రంథాలలో విశదంగా పేర్కొన్నారు. వాటిలో చాలావరకు విదేశీ దండయాత్రలవల్ల శిథిలమైనాయి,
మిగిలినవి చాలామందికి అర్థం కాకపోవడంతో (సంస్కృతంలో ఉండటం చేత) మన పూర్వీకులు (ఋషులు) ఏనాడో చెప్పిన సూత్రాలను, విషయాలను నేడు ఆంగ్లేయులు సైన్స్ పేరుతో చెబుతుంటే మనం ఆశ్చర్యంతో ఏదో కొత్త విషయంలా నేర్చుకుంటున్నామని అనుకుంటున్నాము. ఉదాహరణకి, యంత్ర విజ్ఞానం (మెకానిజం, కైనటిక్స్) తీసుకోండి. కణాద మహర్షి తన వైశేషిక దర్శనంలో చేయబడిన (కర్మ) శబ్దం యొక్క అర్థం మోషన్ అని చెప్పినారు. ఇది ఐదు విధములని పేర్కొన్నారు. 1.ఉత్‌క్షేపణము(ఖఔత్యీజూ యౄఆజ్యశ) 2.అవక్షేపణము (జ్యూతీశత్ఘీజూ యౄఆజ్యశ) 3.ఆకుంచనము (మోషన్ డ్యు టు టెన్సిల్ స్ట్రెస్) 4.ప్రసారణము (షియరింగ్ మోషన్), 5.గమనము (జనరల్ టైప్ ఆఫ్ మోషన్). విభిన్న రకాల చలనాలు (కదలికలు) అనగా మోషన్‌లను వాని యొక్క ఉత్పన్న కారణాలను ఆధారంగా తెలిసికొనే విశే్లషణ వైశేషిక దర్శనంలో చెప్పబడింది. 1.నోదన కారణము - నిరంతరమైన ఒత్తిడి, 2.ప్రయత్న కారణము - చేతులు ఊపినట్లు, 3.గురుత్వ కారణము - వస్తువు పైనుండి క్రింద పడుట, 4.ద్రవత్వ కారణము - సూక్ష్మకణముల ప్రవాహము వలన కలిగేది.
ప్రసిద్ధ భౌతిక శాస్తవ్రేత్త ఎన్.జి.డోంగ్రే ‘ది ఫిజిక్స్’ అనే పుస్తకం వ్రాశారు. వారు అందులో కణాద మహర్షి యొక్క వైశేషిక దర్శన సూత్రాలను ప్రశస్తపాదుడు అను పండితుడు వ్రాసిన భాష్యములోని వేగమునకు సంబంధించిన సూత్రములను, న్యూటన్ యొక్క గతి సూత్రములను (లాస్ ఆఫ్ మోషన్) పోల్చి చూపారు.
ప్రశస్తపాదుడు ఇలా వ్రాశాడు: ‘వేగో పంచసు ద్రవ్యేషు నిమిత్త- విశేషా పేక్షాత్ కర్మణో జాయతే నియాతాదిక్ క్రియా ప్రబంధ హేతుః స్పర్శ వద్ ద్రవ్య సంయోగ విశేష విరోధీ క్వచిత్ కారణ గుణ పూర్వ క్రమేణోత్పద్యతే!’- అనగా వేగము లేదా మోషన్ ఐదు ద్రవ్యముల (ఘన, ద్రవ, వాయు, ఘన-ద్రవ, ద్రవ-వాయు) వలన లేదా ప్రత్యేక చలన శక్తివలన ఉత్పన్నం అవుతుంది. అట్లే నియమిత దిశలో క్రియ జరుగుతున్నందున విశేష సంయోగంవలన ఉన్నది తగ్గుతుంది లేదా కొత్తగా వేగం పుంజుకుంటుంది. ఇపుడు పైన పేర్కొన్న ప్రశస్త పాదుల భాష్యమును మూడు భాగాలుగా విభజిస్తే న్యూటన్ చెప్పిన గతి సూత్రములకు సమానంగా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. ఈ క్రింది విశే్లషణ చూడండి.
1.వేగః నిమిత్త వివేషాత్ కర్మణో జాయతే
ది ఛేంజ్ ఆఫ్ మోషన్ ఈజ్ డ్యు టు ది ఫోర్స్ అప్లైడ్ (లాస్ ఆఫ్ ఇనెర్షియా)
2.వేగః నిమిత్తాపేక్షాత్ కర్మణో జాయతే
నియతాదిక్ క్రియా ప్రబంధ హేతుః
ది ఛేంజ్ ఆఫ్ మోషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది మోటివ్ ఫోర్స్ అప్లైడ్ అండ్ ఈజ్ మేడ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ది రైట్ లైన్ ఇన్ విచ్ ది ఫోర్స్ ఈజ్ అప్లైడ్. (లా ఆఫ్ ఫోర్స్)
3.వేగః సంయోగ విశేష విరోధీ
టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఆల్‌వేస్ యాన్ ఈక్వెల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ (లా ఆఫ్ యాక్షన్)
దీని ద్వారా మనకి అర్థమయ్యేది ఏమిటంటే కణాద మహర్షి తన వైశేషిక దర్శనం ద్వారా చెప్పిన విషయాన్ని లాస్ ఆఫ్ మోషన్ (గతి సూత్రాలు)గా చెప్పాడు. అంటే ఈ సిద్ధాంతానికి ఆద్యుడు కణాద మహర్షియే! కాని న్యూటన్ కాదనుకోవాలి. దీనికి కొనసాగింపుగా మనం స్థితి స్థాపక సిద్ధాంతాన్ని చూద్దాం. ఎలాస్టిటీ అనేది ఒక పదార్థము యొక్క స్వభావానికి ఇవ్వబడిన పేరు.
దీని కారణంగా లోహపు పలకలు మొదలగునవి కంపనము చేయుచు ధ్వనిని కూడా కలిగిస్తాయి. వైశేషిక దర్శనకారుడైన కణాద మహర్షి దీని గురించి తెలిసికొని యున్నాడు. అట్లే ఉదయనుడనే పండితుడు రచించిన ‘కిరణావళి’ అనే గ్రంథంలో దీని ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఇంకావుంది...

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9490947590