Others

భగవదనుభూతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ విషయం గురించి ఎందరో మహానుభావులు ఎన్నోరకాలుగా వారు అనుభవించి చెప్తుంటారు. ఈ అనుభూతి ఎవరికి వారు అనుభవించి తెలుసుకోవల్సిందే. జ్ఞానదేవుడు, నామదేవుడు లాంటి వాళ్లే తమమ తమ అనుభవాలతో కృష్ణుడిని కళ్లార చూసినవారున్నారు. భగవంతునికి రూపం లేదు. నామం అంతకుముందేలేదు. ఈ జగత్తు అంతా ఆయనే. జగత్తుకు రూపం ఉంది. నిర్గుణుడైన భగవంతుడిని పూజించడానికి అందరూ అర్హులే. కానీ వారిలో ఎంతమంది నిర్గుణుని పూజించాలనుకొంటే వారిలో ఎంతమంది కృతకృత్యులవుతారు. ఇది ఏమిటి అంటే .. మనిషి మనసు చాలా చంచలమైంది. ఎంతోమంది మహర్షులు ఎన్నో యేండ్లు తపస్సు చేసినా మనస్సు చేసే వికృతితో వారంతా తపోభంగం కావించుకున్నారు. మనస్సును నిగ్రహించుకుని తపస్సు చేస్తే పరంధాముడే మన కళ్లముందే నిలబడుతాడు.
కాని మనస్సును నిగ్రహించుకోవడం సామాన్యులకు అసాధ్యమైన పనే. కానీ భారతీయం అసాధ్యాలను సుసాధ్యం చేసేస్తుంది. దానికి కోసం సులువైన మార్గాలెన్నింటినో చూపిస్తుంది. వాటిల్లోదే మెరుగైన ఫలితాలనిచ్చేది సగుణోపాసన. ఈ సగుణోపాసనలో ఆకారం లేని పరమాత్మకు రూపాన్ని సంతరించుకుంటాం. ఎంతో తపస్సు చేస్తేకాని ఆ పరమాత్మను అనుభూతించలేని భక్తులం ప్రతి నిముషం రూపాన్ని సంతరించుకున్న దైవంతో సంభాషణలు జరుపవచ్చు. చక్కని ఉపశమనాన్ని, సంతోషాన్ని దరి చేర్చుకోవచ్చు. దృఢమైన నమ్మకంతో సగుణో పాసన చేస్తూ ఉంటే చాలు కోరుకుని రూపొందించుకున్న రూపంతో భగవంతుడు తనకు తానే వచ్చి దర్శనం ఇస్తాడు.
ఇట్లా భగవంతుని తమ కన్నులతో చూసిన భక్తులు ఎంతోమంది ఉన్నారు. సతీసక్కుబాయి అని పేరు తెచ్చుకున్న ఇల్లాలు కృష్ణ్భక్తురాలు. ఆమె ద్వాపర యుగంలోని కృష్ణుని గురించి అనేకానేక కథలు విన్నది. ఆయన్ను ఎలాగైనా దర్శనం చేసుకొంటే బాగుండు అనుకున్నది. కానీ ఆమె జీవితం అందుకు సహకరించలేదు. ఇంట్లో అత్తగారి సేవలు, భర్తసేవలు ఇట్లాంటి వాటితో రోజంతా సరిపోయింది. పైగా కృష్ణుని పై భక్తి ఏమిటి? ఇంట్లో పతిదేవునికి సేవలు చేస్తే పడతికి ముక్తి మోక్షం అని అనేవారట. దానితో ఆమె కృష్ణునిలీలలను విని ఆ కృష్ణపరమాత్మను చూసిన వారు ఎంత పుణ్యాత్ములో కదా అనుకొంటూ ఉండేదట.
ఓసారి సక్కుబాయి చెరువుకు నీళ్లు తేవడానికి వెళ్లింది. అక్కడ కొందరు హరే కృష్ణ హరేకృష్ణ అంటూ భజన చేసుకొంటూ వెళ్లుతూ దాహార్తిని తీర్చుకోవడానికి అక్కడ ఆగారట. వారితో సక్కుబాయి మాటలు కలిపింది. కృష్ణుడు పండరి నాథుడుగా పండరి పురంలో వేంచేసి ఉన్నాడని వారు చెప్పితే చాలా ఆనందంతో వింది. పైగా వారందరూ పండరి పురం వెళ్తున్నారని తెలుసుకొని మరింత ఆనందం దుఃఖం పొందింది.
వారు ఎందుకు దుఃఖిస్తున్నావమ్మా అని వారు అడిగితే నాకు ఆపండరి నాథుని చూడాలని ఉంది కాని నాకున్న పనులతో నేను చూడలేకున్నాను. అంటూ తన బాధను చెప్పిందట.
సక్కుబాయి చెప్పింది విని వాళ్లు మరేం ఫర్వాలేదు. నువ్వు ఇట్లానే మాతో కూడ రమ్ము. ఆ పండరిపుర వాసుడే అన్నీ చూసుకొంటాడు. నీకేమి ఇబ్బందులుండవు అని చెప్పి వారితో రమ్మని పిలిచారట.
సక్కుబాయి కూడా వారు చెప్పినట్లుగా విని కృష్ణునిపై తన భారం వేసి వాళ్లతో కృష్ణ భజన చేస్తూ పండరి పురం వెళ్లింది.
ఆ పండరిపురం చేరిన తరువాత కృష్ణ దర్శనం చేసుకోవడానికి వెళ్లి అక్కడున్న కిక్కిరిసిన జనం తోపులాటలో కిందపడి సక్కుబాయి మరణించింది.
కానీ నీళ్లు తేవడానికి వెళ్లిన సక్కుబాయి ఇంకా రావడం లేదేమని వాళ్లఅత్తగారు ఆవేశం తెచ్చుకుంటుంటే ఆ పండరి నాథుడే సక్కుబాయి రూపంలో వారింటికి వచ్చి సక్కుబాయి పనులన్నీ చేస్తున్నాడట.
కానీ ఒక నాడు పండరిపురం నుంచి ఒకరు వీరింటికి వచ్చారట. వాళ్ల అత్తగారితో మాట్లాడుతూ మీకో అశుభవిషయం చెప్పాలని ఇలా వచ్చాను. మీరు బాధపడకండి. పుట్టిన వాళ్లు పోక తప్పదుకదా అని చెబుతూ మీ కోడలు పండరిపురంలో కాలం చేశారు. అక్కడే మేము అంత్యక్రియలు నిర్వర్తించి వచ్చాము అని అన్నారట.
ఆ అత్తగారు హతాశురాలై ఇదేంటి మా సక్కు పండరి పురం ఎందుకు వస్తుంది? మా ఇంట్లోనే ఉంది కదా. కావాలంటే పిలుస్తానుండండి అంటూ సక్కు సక్కూ అని పిలవగానే కృష్ణుడు సక్కురూపంలో వచ్చి అత్తగారు.. అన్నారట. ఆ దృశ్యం ఆ వచ్చిన వారు చూసి ‘ఆహా! ఏమి ఈ అద్భుతం కృష్ణయ్యా! నీకు భక్తులపై అపారమైన దయ ఉంది కదా. సక్కుబాయి కోసం నీవే ఆమె రూపాన్నిధరించి వచ్చావా కృష్ణా! అంటూ కాళ్లమీద పడి దణ్ణం పెట్టాడట. ఆశ్చర్యపోతున్న అత్తగారికి అసలు విషయం కృష్ణుడు వివరించి చెబుతూ ఉంటే అపుడే సక్కుబాయి పతిదేవుడు వచ్చి హా నాకు భార్యావియోగం కలిగిందా అని మూర్చపోయాడట. అపుడు వారి బాధలు చూడలేక కృష్ణుడు తిరిగి సక్కును బతికించి వారికిచ్చి తాను పండరి పురం వెళ్లాడట.
చూశారా! ఇది అంతా సగుణోపాసన మహత్వం. కనుక భగవంతుని తో తాద్యాత్మం చెందాలంటే భగవంతునికి మారురూపులు కావాలంటే సులభమైన మార్గం సగుణోపాసన. మొదట సగుణోపాసనచేయడం ఆరంభిస్తే అదే నిర్గుణోపాసనకు దారిచూపుతుంది.

- కూచిబొట్ల వెంకటలక్ష్మి