Others

నీ స్మృతి పథంలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీ యాదిలోనే పొలాల వెంబడి తిరుగుతుంటే
కొమ్మలపై కోకిలమ్మవై
ప్రియరాగాలతో పలకరిస్తావు
యుగళ గీతాలతో పులకరింప చేస్తావు
నే దిగులుతో సముద్రతీరానికి వెళ్లితే
ఇసుక తినె్నలపై వేయ లేక అడుగులేస్తుంటే
కలల సఖి అలల నెచ్చలివై
పాదాల ముద్దిడి పరవశింప చేస్తావు
నే నులిక్కి పడి ఆలింగానికై చేతులు చాస్తే
చెలియలి కట్టనుండి దూరంగా దూరమవుతావు
మళ్లీ రేపొస్తావని నే వెనుదిరిగి
భారంగా అడుగులేస్తుంటే
పిల్లతెమ్మరపై పైరగాలివై
ఒళ్లంతా నెమరి తమకంతో తడిమి
అంతలోనే మాయమవుతావు
ఎక్కడని వెదకను ప్రియతమా!
నినె్నలా చేరను సఖీ!

-గులాబీల మల్లారెడ్డి