Others

ఆత్మవిశ్వాసం తోడుంటే....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంతమంది పెద్ద ఉద్యోగస్థులైనా, ఇంట్లో అన్ని వ్యవహారాలను నడిపేశక్తి గలవారైనా సరే ఒక్కోసారి ఆత్మనూన్యతతో బాధపడుతుంటారు. దీనితో చేయాల్సిన పనులకు ఆటంకాలు ఏర్పడుతాయి. నలుగురిలో మాట్లాడాలన్నా, ఇప్పుడు ఇది చేస్తే ఎలా ఉంటుందోలే, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అన్న ఆలోచన్లతో సతమతమవుతుంటారు.
వీటిని అధిగమించాలంటే ముందుగా ప్రతిరోజు మీరు ఉద్యోగులైతే మీరుచేసే పనులల్లో నాణ్యతను పెంచుకోండి. త్వరగాను, మెరుగ్గుగాను పొందే ఫలితాల కోసం మీ నైపుణ్యాలను రోజురోజుకు మారే టెక్నాలజీ సాయంతో పెంచుకోండి.
మంచి పుస్తకాలు మంచి నేస్తాలు ఈ విషయం మరవకుండా మంచి పుస్తకం పఠనం సాగించండి. మహానుభావుల జీవిత చరిత్రలు చదవండి. అవి మీకు స్ఫూర్తినిస్తాయ. వాళ్లు ఎన్ని కష్టాలు పడి విజయకేతనం ఎగురవేశారో తెలిస్తే మీకొచ్చిన కష్టం చిన్నదిగా అనిపిస్తుంది. అపుడు మీలో ఉత్తేజం రేకెత్తుతుంది.
అపుడప్పుడు కొత్త కొత్త డ్రస్సులు ధరించండి. చక్కగా డీసెంట్‌గా తయారవ్వండి. ఇట్లా చేసినా కొత్త ఉత్సాహం మీకు చేరువఅవుతుంది. మంచి సంగీతం వినడమో లేక సినిమా చూడడమో కూడా చేయండి.
రోజు మార్కెట్‌లో ఏమి జరుగుతుందో ఇతర కంపెనీ వాళ్లు ఏ రకంగా ముందుకు వెళ్తున్నారో, అక్కడ పనిచేసేవారు ఎలాంటి టెక్నాలజీ ఉపయోగిస్తున్నారో చూడండి. అంతేకాక రోజు కొత్తదనం కోసంప్రయత్నించండి. రొటిన్‌గా ఒకే పని చేస్తే బోర్ అనిపిస్తుంది. కాని కొత్త కొత్త పనులను మీకు మీరే కల్పించుకుంటే కొత్త ఉత్సాహం మీకు వస్తుంది. అంతేకాక మీరుసాధించిన విజయాలను అప్పుడప్పుడు నెమరేసుకోండి. మీ పిల్లలతోనో, లేక మీ ఇంట్లో వాళ్లతోనో, మీరు సాధించిన విజయాల ప్పుడు మీరుపడిన శ్రమను మీతోటి ఉద్యోగులతో పంచుకోండి.
మీతో సానుకూలంగా మాట్లాడే వారితోచాలాసే పు గడపండి. అంతేకాని మీకు ప్రతికూలంగా మాట్లాడేవారిని దూరంగానే ఉంచండి. ఒకవేళ వారితోనే మాట్లాడాల్సి వస్తే వారు అన్నమాటలకు బాధపడడం కాకుండా వాటిలో ఉన్న నిజమెంతో చూసుకోండి. ఆ నిజాలను మీరు మీ పనిలో పెట్టుకుంటే మీకు అనుకోకుండానే మెళుకువలు వచ్చేస్తాయి.
ఏపనినైనా సానుకూల దృక్పథంతోనే ఆలోచించి చేయండి. నలుగురికీ సాయం చేసే గుణాన్ని పెంచుకోండి. ఉన్నంతలో లేనివారికి సాయం చేయండి. కేవలం డబ్బే దానం చేయాలి అనుకోకుండా మీకున్న విద్వత్తుతోనో లేక మీ శారీరిక శ్రమతోనో అవసరమైన వారికి సాయపడండి. అపుడు ఊహించనంత ఉత్సాహం మీ సొంతం అవుతుంది.
మిమ్ములను విమర్శించేవారిని మీరు విమర్శించకుండా ఆ విమర్శలో ఏదైనా మంచి విషయం ఉంటే దాన్ని మీరు ఆహ్వానించి ఆ విషయం వారితో చెప్పండి. మీరు చెప్పిన దాన్ని ఆలోచించాను. ఇట్లా చేస్తే మీరు చెప్పినట్లే విజయం వస్తుంది. ఇదిగో నాకీ విజయం కలిగిందని చెప్పండి. మీవల్ల నాకు మంచి జరిగింది కనుక మీకు కృతజ్ఞతలు అనీ చెప్పండి. అంతే అప్పటినుంచి వారు మీకు మంచి మిత్రులు అవుతారు. ఎట్టి పరిస్థితుల్లో అహంకారానికి లోను కాకండి. అహంకారం లేకపోతే అందరూ మీకు మిత్రులే అవుతారు. అన్నింటా మంచి విజయాలు మీకు సొంతం అవుతాయి.

- కూచిబొట్ల వెంకటలక్ష్మి