Others

ఆల్ రౌండర్ ..శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకరికి ఒక రంగంలో ప్రావీణ్యం ఉండటం సహజం. బహుముఖ రంగాల్లో ప్రావీణ్యాన్ని చూపిన వాళ్లను మాత్రం -ఆల్‌రౌండర్ అనో, బహుముఖ ప్రజ్ఞాశాలి అనో అంటుంటాం. అలాంటి వారిలో పేకేటి శివరాంను ప్రత్యేకంగా చెప్పాలి. జర్నలిస్టుగా, రచయితగా, నటుడిగా, దర్శకుడిగా ఇలా చలనచిత్ర రంగానికి అవసరమైన మరికొన్ని రంగాల్లో సత్తాచూపిన వ్యక్తి పేకేటి. ఘంటసాల గాయకుడిగా ఎంపిక కావటానికి ముఖ్య కారకుడు పేకేటే. అలాగే అక్కినేని ప్రారంభ దశనుంచి వెన్నుదన్నుగావుంటూ ప్రోత్సాహించిన మిత్రుడు కూడా పేకేటే. ఈ విషయాన్ని అక్కినేని అనేక సందర్భాల్లో చెప్పుకునే వారు. 1954లో విడుదలైన ఎన్టీఆర్ నటించిన చిత్రం పేరు నిర్ణయంకాక నిర్మాత దర్శకుడు సతమతమవుతూ, మంచి పేరు సూచించిన వారికి నగదు బహుమానమని ప్రకటించారు. ఆ చిత్రానికి పేకేటి శివరాం ఒక పేరు ప్రతిపాదించారు. అది అందరికీ నచ్చింది. ఆ చిత్రంకూడా సక్సెస్ అయ్యింది. అదే ‘వద్దంటే డబ్బు’. పేకేటి శివరాం మంచి ఫొటోగ్రాఫరు కూడా. తెలుగు సినిమా రంగంలో జరిగిన కొన్ని అద్భుత ఘట్టాలను ఆయన తన కెమెరాలో బంధించి నెగిటివ్‌లతో సహా భద్రపరచారు. సందర్భం వచ్చిన ప్రతిసారీ ఆ నెగెటివ్‌లను చూపిస్తూ.. ఇవే నా పాజిటివ్ ఆస్తిపాస్తులు అని జోక్ చేసేవారట. సినిమా రంగానికి సంబంధించిన ఏ కార్యక్రమంలోనైనా పేకేటి తర్వాత ఎవరు మాట్లాడినా చప్పచప్పగా ఉంటుందని చాలామంది అంటుండేవారు. తెలుగులో చుట్టరికాలు, భలే అబ్బాయిలు, కుల గౌరవం చిత్రాలతోపాటు విజయవంతమైన కన్నడ చిత్రాలకూ ఆయన దర్శకత్వం వహించారు. అలాంటి పేకేటి ఒక సినిమా కార్యక్రమంలో పాల్గొన్నపుడు తీసుకొన్న అరుదైన చిత్రం.

-పర్చా శరత్‌కుమార్ 9849601717