Others

ఫ్రెండ్స్ అంటే వీళ్లే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాల్లో స్నేహానికి ప్రతీకలుగా నిలిచి స్నేహితులకోసం స్నేహంకోసం సహాయ సహకారాలు అందించినవారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా పవన్‌కళ్యాణ్ సినిమాలో తప్పనిసరిగా ‘అలీ’ఉంటాడు. అలాగే రవితేజ నటించే ప్రతి సినిమాల్లో చాలావరకు ‘బ్రహ్మాజీ’, దిల్‌రాజు సినిమాలో ప్రకాష్‌రాజు తప్పనిసరిగా ఉంటాడు. అలాగే తనికెళ్ళ భరణి, ప్రకాష్‌రాజు స్నేహం కూడా చెరిగిపోనిదిగా ఉంది. దుక్కిపాటి మధుసూధనరావు నిర్మించిన ప్రతి సినిమాలో హీరో చలం ఏదో ఒకపాత్రలో నటించటం జరిగింది. అలాగే ‘జగపతి పిక్చర్స్’లో తప్పనిసరిగా జగ్గయ్య ప్రధాన పాత్రలలో ఉండేవారు. గతంలో రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలోను సుధాకర్ తప్పనిసరిగా ఉండేవారు. ముప్పలనేని శివ దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలోను సుధాకర్ ప్రత్యేక పాత్రను పోషించేవారు. అలాగే కృష్ణవంశీ సినిమాల్లో ఎక్కువ శాతం ప్రకాష్‌రాజు కొనసాగేవారు. పాత సినిమాల్లో రేలంగితోపాటు అలనాటి బాలకృష్ణ తప్పనిసరిగా ఏదో పాత్రలో కనిపించేవారు. ప్రభాకర్‌రెడ్డి - సారధి, కృష్ణంరాజు- సారథి, మోహన్‌బాబు- రజనీకాంత్, శోభన్‌బాబు- చంద్రమోహన్, దాసరి నారాయణరావు, మురళీమోహన్, మోహన్‌బాబు అనుబంధాలతో ముడిబడి ఉండేవి. జగపతిబాబు, అర్జున్, నాగార్జున జగపతిబాబు స్నేహానికి ప్రతీకలు. స్నేహానికి ప్రతీకగా జయభేరి సంస్థలో గిరిబాబు, రంగనాథ్‌లు తప్పనిసరిగా ఉండేవారు.

- ఎ రఘురామారావు, ఖమ్మం