Others

వామ్మో.. మణి’కర్ణిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంగనను ముద్దుగా చెప్పుకోవాలంటే బాలీవుడ్ కంచు. యాక్టింగ్‌లోనే కాదు, యాటిట్యూడ్‌లోనూ వెరీ స్ట్రాంగ్. ఒక్కముక్కలో చెప్పాలంటే -బ్యూటీ విత్ బ్రెయిన్. ఈ క్యాటగిరీలో ఎప్పుడూ వినిపించే పేరే కంగన. ఏ విషయంపైనైనా నిర్భయంగా మాట్లాడుతుంది. చెప్పాలనుకున్నది కుండబద్ధలు కొట్టి మరీ చెబుతుంది. నిర్ణయాల్లోనూ అంతే తెగింపు చూపిస్తుంది. ఆకృతిలో బక్కపల్చగా ఉంటేనేం -ఆలోచనల్లో కంగన వెరీ స్ట్రాంగ్ అండ్ స్ట్రెయిట్. ఇది ముఖస్తుతి కాదు, ప్రత్యర్థులు సైతం ఆమె గురించి చెప్పాల్సి వచ్చినపుడు చెప్పే మాటలు. ఆమె యాటిట్యూడ్ కారణంగా వివాదాలు చుట్టుముట్టినా, జంకూ గొంకు లేకుండా ముందుకు సాగిపోయే రకం.
‘నా మనసుకు ఏది అనిపిస్తే అదే ఫైనల్. ఇందులో రెండోమాట లేదు’ అన్నది అనేక సందర్భాల్లో కంగన చెప్పిన మాటలే. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే -ఇప్పుడు కంగన రెమ్యునరేషన్‌లోనూ వెరీ స్ట్రాంగ్ అన్నది చెప్పడానికే. తాజాగా ఈ బాలీవుడ్ క్వీన్ రెమ్యూనరేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మామూలుగా కంగనా ఒక సినిమాకు 5 నుంచి 6 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటుందని వినికిడి. కానీ, మణికర్ణికకు మాత్రం రేటు వేరే పెట్టిందట. ఆ ఫిగరు -14 కోట్లు అన్నది పరిశ్రమలో బలంగా వినిపిస్తున్న మాట. అంటే -టాప్ స్టార్ల రెమ్యునరేషన్ లెక్కలను తలకిందులు చేసే స్థాయికి చేరిందన్న మాట. ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న వారి జాబితాలో ప్రస్తుతం దీపిక పడుకొనె ఉంది.
దీపిక చివరి చిత్రం ‘పద్మావత్’ కోసం దాదాపు ఇదే రేంజ్‌లో రెమ్యూరేషన్ తీసుకుందన్న టాక్ లేకపోలేదు. ఆ చిత్రంలో లీడ్ రోల్స్ చేసిన కపూర్ ద్వయం షాహిద్, రణ్‌వీర్ కంటే దీపికే ఎక్కువ తీసుకుందన్న కథనాలు విన్నవే. ఇపుడు కంగన సైతం మణికర్ణిక లీడ్ రోల్ కోసం భారీ రెమ్యునరేషన్ వసూలు చేసి సంచలనం సృష్టించిందట. రాణి లక్ష్మీబాయి పాత్రలో నటించిన మణికర్ణిక జనవరి 25 రిపబ్లిక్ డే వీకెండ్‌లో విడుదల కానుంది. క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా మధ్యలో వదిలేయడంతో -పెండింగ్ పడిన భాగానికి కంగన దర్శకత్వం నిర్వర్తించి పూర్తి చేయించింది. ఇప్పటికే ప్రోమోస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న మణికర్ణిక కంగన స్టార్‌డమ్‌ను మరింతగా పెంచడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాత నష్టపోకూడదన్న ఉద్దేశంతో దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించాను తప్ప, రెమ్యునరేషన్ కోసమో, క్రెడిట్ కోసమో కాదని గతంలోనే కంగన స్పష్టం చేసింది. ఇంత రెమ్యునరేషన్ తీసుకున్న తరువాత, మళ్లీ దర్శకత్వానికి ఎందుకు తీసుకుంటుంది? అని గిట్టనివాళ్లు మాత్రం మూతులు తిప్పుకుంటున్నారు. కంగన పట్టించుకునే
రకం కాదుగా! ఏమంటారు?