Others

నిర్మాత శివప్రసాద్ రెడ్డి కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నిర్మాత, కామాక్షి మూవీస్ అధినేత డి.శివప్రసాద్‌రెడ్డి (62) శనివారం ఉదయం ఆరున్నర గంటలకు కన్నుమూశారు. హృదయ సంబంధిత సమస్యతో చెన్నైలోని అపోలో హాస్పిటల్లో ఆయనకు ఇటీవల ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. సర్జరీ నుంచి కోలుకోకముందే ఆయన కన్నుమూశారు. ఈయనకు ఇద్దరు కుమారులు. 1985లో కామాక్షి మూవీస్ బ్యానర్‌ను స్థాపించి ఎన్నో చిత్రాలు నిర్మించారు. శోభన్‌బాబుతో కార్తీకపౌర్ణమి, శ్రావణసంధ్య, చిరంజీవితో ముఠామేస్ర్తీ, నాగార్జునతో విక్కీదాదా, అల్లరి అల్లుడు, ఆటోడ్రైవర్, సీతారామరాజు, ఎదురులేని మనిషి, నేనున్నాను, బాస్, కింగ్, కేడీ, రగడ, గ్రీకువీరుడు లాంటి 11 చిత్రాలు నిర్మించారు. అక్కినేని నాగచైతన్యతో దడ చిత్రాన్నీ నిర్మించారు. నాణ్యమైన తెలుగు చిత్రాలను నిర్మించాలన్న కామాక్షి మూవీస్ ఆకాంక్షను నెరవేర్చడానికి శివప్రసాద్ రెడ్డి చివరి వరకూ కృషి చేశారు. శివప్రసాద్ రెడ్డి మృతిపట్ల తెలుగు సినీ పరిశ్రమ సంతాపాన్ని వ్యక్తం చేసింది.