Others

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల బహిష్కరణ సాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛత్తీస్‌గఢ్‌లో త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు బ్యానర్లు కడుతున్నారు. తమదైన రీతిలో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు గెలుపుకోసం సర్వం ఒడ్డుతున్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన భద్రతా బలగాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. దండకారణ్యంలో భారీ సంఖ్యలో సి.ఆర్.పి.ఎఫ్. జవాన్లు మోహరించి ఉన్నారు. అదనంగా మరిన్ని పోలీసు బలగాలను ఎన్నికల రీత్యా నియమించనున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా మావోయిస్టులు పోలింగ్‌ను బహిష్కరించాలని పిలుపునివ్వడం, ప్రజలను భయపెట్టేందుకు కొన్ని హింసాత్మక సంఘటనలకు పాల్పడటం, బెదిరించడం జరుగుతోంది. మరోపక్క ప్రజలను ఆకర్షించేందుకు ఆయా పార్టీల నేతలు సభలు, సమావేశాలు నిర్వహించి ఊరేగింపులు జరుపుతూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. వీరికి భద్రతగా పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. ఇది ప్రతిసారీ కనిపించే దృశ్యం.
2013 నాటి శాసనసభ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకుల వాహన శ్రేణిపై దాడిచేసి 27 మందిని పొట్టనపెట్టుకున్నారు. వారిలో మాజీ కేంద్రమంత్రి వి.సి.శుక్లా కూడా ఉన్నారు. ఆదివాసీ నాయకుడు మహేంద్రకర్మను టార్గెట్ చేసి జరిపిన ఆ దాడిలో కీలక నాయకులు చాలామంది కన్నుమూశారు. ఇంత బీభత్సం సృష్టించినా ఎన్నికలు ఆగిపోయాయా? ప్రజలు ఓట్లు వేయకుండా నిలిచిపోయారా? రాజ్యాంగ సంక్షోభం చోటుచేసుకుందా? మావోయిస్టులు లాభపడ్డారా? ఆదివాసీలు అభివృద్ధి చెందారా? ఏదీ జరగలేదు. అంతా యథాతథంగా కొనసాగింది. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ నాయకత్వంలో భాజపా మరోసారి అధికారంలోకి వచ్చింది. ఆయన తనదైన శైలిలో ఈ ఐదు సంవత్సరాలు పాలన సాగించారు.
మళ్లీ వోట్ల పండగ వస్తోందంటే- ఎన్నికలు బహిష్కరించమనే పల్లవిని మావోలు అందుకుంటే ఒరిగేది ఏమిటి? బస్తర్ ప్రాంతంలో 2,831 పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేసేందుకు సన్నద్ధమైతే ఆదివాసీలను చంపేస్తామని, నరికేస్తామని మావోయిస్టులు బెదిరిస్తున్నారు. ప్రజాకోర్టుల పేరిట హెచ్చరిస్తున్నారు. ఆ ప్రజాకోర్టులు ఎలా జరుగుతాయో ఆదివాసీలకు తెలుసు. ప్రజల పేరిట ఆ ప్రజాకోర్టులను నిర్వహించి భయభ్రాంతులకు గురిచేయడం మావోయిస్టులకు వెన్నతోపెట్టిన విద్య. అలాంటి నరకాన్ని అనుభవించడాని కి ఎవరు ధైర్యం చే స్తారు? మరోవైపు భద్ర తా బలగాలు. పోలీసులు, రాజకీయ నా యకులు రంగంలోకి దిగి, ఆదివాసీలు ఓటు వేయాలని, రక్షణ కల్పిస్తామని ఉసిగొల్పుతా రు. ఇలా ఇరువర్గాల మధ్య ఆదివాసీలు నలిగిపోతున్నారు. ముఖ్యంగా మావోయిస్టుల ప్రాబల్యంగల ప్రాంతాల్లో ఈ రకమైన ఒత్తిడి ఆదివాసీలపై ఎక్కువగా కనిపిస్తోంది. అడకత్తెరలో పోక చెక్కలా వారు నలిగిపోతున్నారు. మరి ఇది న్యాయమా?
దశాబ్దాల తరబడి ఎన్నికల్ని బహిష్కరించినా ప్రయోజనం కొరవడినప్పుడు దాన్ని ఇప్పుడు తిరిగి పాటించడం వల్ల ఒరిగేది ఏమిటి? ఓటు హక్కు వినియోగించడం ప్రాథమిక హక్కుగా పరిగణిస్తున్న సందర్భంలో ఇలా ఆదివాసీలను అడ్డుకోవడం ఏమేరకు న్యాయ సమ్మతం? ప్రపంచం ఎప్పుడూ ముందుకు పరుగెడుతుంది. అతి పురాతనమైన ఓటు హక్కును హరించడానికి తుపాకులతో, మందుపాతరలతో ముందుకొచ్చి మావోయిస్టులు ప్రజలను బెదిరిస్తే అదెలా మానవ హక్కులను కాపాడినట్టవుతుంది? మావోయిస్టులు మానవ హక్కులను కాపాడేందుకు ముందుండాలా? లేక ఆ హక్కులను కాలరాయడానికి కాల యముడిలా పనిచేయాలా?
ఓటుహక్కుతోపాటు మరెన్నో హక్కులు దానిచుట్టూ అల్లుకుని ఉండే వాటిని సైతం మావోయిస్టులు హరిస్తున్నారు. ఆదివాసీల స్వేచ్ఛను పూర్తిగా హరించి వేస్తున్నారు. ఓటు వేయాలా? వద్దా? అన్నది వారి విచక్షణాధికారం. వేయవద్దని ఇలా తుపాకులు చూపితే అదెలా వారి స్వేచ్ఛను కాపాడినట్టు అవుతుంది? ఈ ఇంగితాన్ని విస్మరించి నిర్దాక్షిణ్యంగా తమ నియంతృత్వాన్ని వారిపై రుద్దడానికి ఆయుధాలతో సిద్ధమైతే అదెలా ఆమోదయోగ్యమవుతుంది? అంగీకార యోగ్యమవుతుంది? ప్రజల స్వేచ్ఛను కాలరాసే శక్తులు ఏవైనా మనుగడ సాగించలేవు. బస్తర్‌లో, ఇతర ప్రాంతాల్లో ఆదివాసీలందరూ ఎన్నికలు బహిష్కరించడం లేదు. మావోయిస్టులు కొన్ని ప్రాంతాల్లో, తమకు పట్టున్న ప్రదేశాల్లో భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల్ని బహిష్కరిస్తే ఫలితమేముంటుంది? శూన్యం! పది ఓట్లు పోలైనా ఎవరికి ఎక్కువ ఓట్లు లభిస్తే వారే ఎన్నికయినట్టు ప్రకటిస్తారు. ఈమాత్రం దానికి రక్తం కళ్ళచూడాలా? విధ్వంసం చోటుచేసుకోవాలా? అలజడి కొనసాగాలా? ఆర్థిక వనరులు వృథా కావాలా? ఇంత జరిగినా మావోయిస్టులు తమ లక్ష్యం వైపు కదులుతున్నారా? అంటే అదీ లేదు. పైగా ఎన్‌కౌంటర్లు జరిగితే తమవారిని కోల్పోతున్నారు. పోలీసులకు పట్టుబడితే అరెస్టు అవుతున్నారు. పాలకవర్గాలు, పోలీసుల ఒత్తిడితో కొందరు మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఇదేకదా.. దశాబ్దాలుగా జరుగుతున్న తంతు! ఈ క్రమంలో మావోలు తమ పట్టును కోల్పోతున్న దాఖలాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒక పథకం ప్రకారం ప్రభుత్వం పోలీసులను, భద్రతా బలగాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రవేశపెట్టి పరిస్థితిని చక్కదిద్దేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ద్విముఖ, త్రిముఖ వ్యూహంతో ముందుకు కదులుతోంది. దాని ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాబోయే రెండు, మూడు ఏళ్ళలో మావోయిజాన్ని దేశం నుంచి తరిమేస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పదే పదే చెబుతున్నారు. అందుకు అవసరమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఈ వ్యూహాన్ని ఢీకొట్టేంత సత్తా మావోయిస్టులకు లేదు.
ప్రధానంగా మావోయిస్టుల ప్రాపంచిక దృక్పథం ఒట్టిపోయింది. ఆ సిద్ధాంతం, సూత్రీకరణలు ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడా చెల్లుబాటులో లేవు. వాటికి ‘కరెన్సీ’ లేదు. ప్రపంచం ఓవైపు దూసుకుపోతుంటే దానికి వ్యతిరేక దిశలో ‘పయనిద్దాం రండి.. రారండోయ్..’ అని పిలుపునిస్తే ఏమిటి ప్రయోజనం? ఆ దారి విఫలమైనది, వైఫల్యాలు మూటగట్టుకుని పరాజయంతో సమాధి అయిన పంథా అది. అలాంటి రోడ్ మ్యాప్ చూపిస్తూ దశాబ్దాలపాటు పోరాడినా, ఎన్నికల్ని బహిష్కరించమని పిలుపునిచ్చినా ప్రయోజనమేమిటి?
ఒకప్పుడు మావోయిస్టుల ‘వౌత్ పీస్’గా పనిచేసి, వారి ప్రచారానికి కీలక వ్యక్తిగా నిలిచిన ‘ప్రజాగాయకుడు’ గద్దర్ తాజాగా తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో ఓట్లేయమని, ఓట్ల విప్లవాన్ని సృష్టించాలని పిలుపునిస్తున్నారు. ఇది ఎంతటి పరస్పర విరుద్ధాంశమో ఇట్టే అర్థమవుతోంది. ఛత్తీస్‌గఢ్‌కు సరిహద్దులోనే ఉన్న తెలంగాణలో పరిస్థితి ఎలా ఉందో ప్రజలందరికీ తెలుసు. అన్ని రాజకీయ పార్టీలు చివరికి కమ్యూనిస్టులు, నక్సలైట్లు ఈ ఓట్ల రాజకీయంలో మునిగి తేలుతున్నారు. ఏదోమేర తమ ప్రభావాన్ని చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. వివిధ కూటములుగా ఏర్పడుతున్నారు. తమ శక్తి సామర్థ్యాలను కూడదీసుకుంటున్నారు. చాలాకాలం నిశ్శబ్దంగా ఉన్న పార్టీలు సైతం తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆ దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రకమైన ‘దృశ్యం’ కొంచెం అటు-ఇటుగా ఎన్నికలు జరిగే ప్రతి రాష్ట్రంలో కనిపిస్తోంది. ఈ ప్రభంజనాన్ని నిలుపుచేసి, సాయుధ పోరాటం ద్వారా, నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారా రాజ్యాధికారం సాధిస్తామని చెప్పడం, అందుకు ఉద్యుక్తులవడం ప్రజలకు ద్రోహం చేయడమే తప్ప మరొకటి కాదు.
ఆచరణ సాధ్యం కాని నినాదంతో ఎన్ని దశాబ్దాల పాటు ప్రజల సమయాన్ని, ధనాన్ని, శక్తియుక్తులను బూడిదలో పోసిన పన్నీరులా మారుస్తారు మావోయిస్టులు? ఈ విషయమై ఎవరో ఒకరు, ఎప్పుడో అప్పుడు ప్రశ్నిస్తారన్న వెరపులేకుండా నిర్భీతిగా- ఎన్నికల బహిష్కరణ నినాదం అమలు కోసం మందుపాతరలు పేల్చడం, మర తుపాకులతో కాల్చడం ఏమేరకు ఆహ్వానించదగ్గది? కోట్లాది మంది ప్రజలు ఎన్నికలను, ప్రజాస్వామ్యాన్ని ఆహ్వానిస్తుండగా, ప్రపంచమంతటా ఆమోదిస్తుండగా, ఇందుకు భిన్నమైన పంథా అనుసరించడం ఏ మేరకు మేలైనది? జీవితం చిన్నది- ఆ చిన్న జీవితంలో ఇంత పెద్ద ‘ప్రయోగం’ అభిలషణీయం కానే కాదు.

-వుప్పల నరసింహం 99857 81799