Others

నిర్మలచిత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకసారి ధర్మరాజు యాత్రలు చేయాలనుకొన్నాడు. అన్నింటి కీ శ్రీకృష్ణుడి సలహా తీసుకోవడం ఆయనకు అలవాటు. ఆ అలవాటు చొప్పున ధర్మరాజు కృష్ణుడి దగ్గరకు వెళ్లాడు. ఆమాట ఈమాట మాట్లాడుతూ ఉన్నప్పుడే శ్రీకృష్ణుడి దగ్గరకు ఓక బ్రాహ్మణుడు వచ్చాడు.
ఆ బ్రాహ్మణుడు కృష్ణుని దగ్గరకు వచ్చి అయ్యా మీరిచ్చిన గుమ్మడి కాయను కూరచేయంచాను. కాని ఆ కూర అంతా చేదుగా ఉన్నదని భోజనానికి వచ్చనివారు అన్నారు అని చెప్పాడు. కృష్ణుడు అదేంటి ఆ కాయ చేదు పోనేలేదా ఇన్ని పుణ్యక్షేత్రాల్లో పుణ్యతీర్థాల్లో మీతోపాటు స్నానం చేయంచి తీసుకొని వచ్చారు కదా మీరే. మరి దాని చేదు ఎందువల్ల పోలేదంటారు అని తిరిగి ఆ బ్రాహ్మణుడే కృష్ణుడిని అడిగాడు.
ఆబ్రాహ్మణుడికి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. అపుడు కృష్ణుడు చూశారా.. ఆ గుమ్మడికాయకు చేదు పోనట్లే మనం ఎన్ని పుణ్యక్షేత్రాలు, తీర్థాల్లో తిరిగినా, మునిగినా మన మనస్సు మారకుంటే, చెడు నడతను దూరం చేసుకోకపోతే, స్వార్థం విడనాడకపోతే ఏ లాభం ఉండదు.
భగవంతుడిని నమ్మి ఆయన చెప్పిన ధర్మమార్గంలో నడిస్తే ఏ పుణ్యక్షేత్రానికి వెళ్లకపోయనా దేవుడు కాపాడుతాడు. కేవలం ధర్మోపన్యాసాలు చెప్పినంత మాత్రాన లాభమేమీ ఉండదు. వంద ఉపన్యాసాలు ఇవ్వడం కన్నా ఒక్క ధర్మాచరణ చేస్తే చాలు వారికి భగవంతుని తోడు లభ్యమవుతుంది. కేవలం తాను ఒక్కడే బాగుండాలని ఇతరులను దోచి తాను సుఖపడాలనుకొన్నవారు ఏపుణ్యతీర్థంలో స్నానమాడినా, ఎన్ని దానాలుచేసినా లాభం ఉండదు. జీవకారుణ్యం, భూతదయ లేనంత కాలం మనిషి జంతువుతో సమానమే. మానవత్వం తో నడక సాగించినపుడే మనిషి అనబడుతాడు కదా అని కృష్ణుడు చెప్పి ఆ బ్రాహ్మణుడికి చెప్పగా ఆ విషయం అక్కడే ఉన్న ధర్మరాజు కూడా విని,
నిజమే సద్బుద్ధి రాకపోతే, మంచినడత అలవర్చుకోకపోతే ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ఒకటే కదా. ఈవిషయం నాకు అర్థం అవఢానికే కృష్ణుడు ఈ బ్రాహ్మణుడికి చెప్పినట్టు ఉన్నాడు అనుకొని ధర్మరాజు కృష్ణుడికి నమస్కారం చేసి ఇక నేను వస్తాను బావా అంటే అదేంటి దేనికోసమో వచ్చి విషయం చెప్పకుండానే వెళ్తానంటావే అన్నాడుఏమీ తెలియనట్టు ఉండే కృష్ణుడు.
అపుడు కృష్ణా పరంధామా నేను హృదయ పరివర్తన చెందకుండా ఎన్ని దేవాలయాలు సందర్శించినా, ఎన్ని పుణ్య నదుల్లో స్నానం చేసినా ప్రయోజనం లేదని, ఆచారాల్లోని అంతరార్థాన్ని గ్రహించటమే మనిషి చెయ్యవలసిన పని అని మీరు చెప్పిన మాటల్లో తెలుసుకొన్నాను. తీర్థయాత్రలు చేయాలనే అభిలాషతో నీ దగ్గరకు వచ్చాను. కానీ నేను ఏం చేయాలో నీవు నాకు దారిచూపావు కనుక నేను వస్తానని అన్నాను అని ధర్మరాజు చెప్పాడు.
కృష్ణుడు ఆ మాటలకు సంతోషించి ఉన్నచోటనే మనసును నిర్మలం చేసుకొని మానవత్వంతో మసలగలిగితే అతడే భగవంతుని రూపుగా మారుతాడు కదా అని అన్నాడు.

--చివుకుల