Others

సమబుద్ధికి అంకురార్పణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘భద్రం కర్ణ్భిః - మా చెవులు ఎప్పుడూ శుభప్రదమైన వార్తలనే వినవలెను. మా కన్నులు ఎప్పుడూ మంగళకరమైన సన్నివేశాలనే చూడవలెను. మానవాళికి ఎప్పుడూ సన్మంగళము కలుగుగాక’’ అని వేదం చెబుతుంది. ఈ వేదాన్ని ఆధారంగా చేసుకొని స్వామి అయ్యప్ప భక్తులంతా అందరినీ సమబుద్ధితో చూసే నేర్పుకోసం స్వామి అని సంబోధన చేస్తూ దీక్షాధారులు అవుతారు.
స్వామి అయ్యప్ప హరిహరసుతుడుగా పూజలందుకుంటాడు. కార్తికమాసారంభంలో అయ్యప్ప స్వామి దీక్ష ఆరంభవౌతుంది. స్వామి బ్రహ్మచర్యాదీక్షావ్రతుడు. స్వామి భక్తులంతా కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తారు. ఒక మండలం రోజులు దీక్ష వహించి నియమాలు పాటిస్తూ స్వామిని మూడు వేళలా అర్చిస్తూ సదా అయ్యప్పనామాన్ని జపిస్తుంటారు. అందరినీ స్వామి అని పిలుస్తుంటారు. అంటే అంతటా స్వామియే నెలకొని ఉన్నాడని వారి నమ్మకం. దీక్ష వహించే వారిని స్వాములని సంబోధిస్తారు. దీక్షలో ఉన్న స్వాములు అయ్యప్పలకు మారురూపులు. ఈ స్వామి దీక్షలో పాల్గొనే బాలికలను కుచ్చుమాలికాపురాలని, స్ర్తిలను మాలికాపురమ్మ లేక మాతగా సంభోదిస్తారు. పనె్నండేళ్ళలోపు బాలురను మణికంఠులని పిలుస్తారు
స్వామి దీక్షను పొందేటప్పుడు కూడా కొన్ని నియమాలు స్వాములు పాటిస్తారు. ముందుగా ఈ స్వామి దీక్ష తీసుకోవటానికి దేవాలయానికి వెళ్లి అంతకు ముందే దీక్షతీసుకొని శబరిమల వెళ్లి వచ్చిన స్వాములను గురుస్వాములు గా భావించి వారిని తమ గురువులుగా భావించి వారి నుంచి దీక్షను స్వీకరిస్తారు.
ఆ గురుస్వామి చెప్పిన దీక్షాపద్ధతులను కొత్తవారు ఆచరిస్తారు. స్వామి దీక్షను ఇంతకు ముందు ఆచరించినప్పటికీ కూడా గురుస్వామి అనేవారిదగ్గరే దీక్షారంభం చేస్తారు. ఇలా చేయడంలో దైవానికన్నా గురువే మిన్న అన్న సూక్తిని తెలియచేయడమని స్వామి భక్తులు చెబుతారు.
దీక్షాదారులంతా మెడలో తులసిమాల కాని రుద్రాక్షమాలను కానీ ధరిస్తారు. మాలకు అయ్యప్ప స్వామి ముద్ర వున్న లాకెట్టును కూడా ధరిస్తారు. దీనే్న ముద్రమాలగా చెప్తారు.
దీక్షా వస్త్రాలుగా నలుపు వస్త్రాలను ధరిస్తారు. దీనికి కారణం స్వామి అయ్యప్పను కొలిచి వారిని శని బాధించడని అంటారు. మరికొందరు కాషాయరంగును కూడా ధరిస్తుంటారు. చన్నీటి స్నానం చందనకుంకుమలను ధరించడం, అయ్యప్ప స్వామికి పూజ చేయడం ఏకభుక్తం ఉండడం మొదలగువన్నీ దీక్షతీసుకొన్నవారి నిత్యకృత్యాలు. ప్రతిరోజు సాయంత్రం పూట స్వామి భక్తులంతా కలసి సామూహిక భజన చేస్తారు. స్వామికి శరణు ఘోషను వినిపిస్తారు. ఆ తరువాత స్వాములందరికీ అన్నదానం చేస్తారు.
దీక్షలో ఉన్నవారు ఎక్కువగా వ్యర్థ ప్రసంగాలు చేయరు. కేవలం భగవంతుని కథలను చెప్పుకుంటుంటారు. దుష్ట ఆలోచనలను రానివ్వరు. నిత్య భగవంతుని నామాన్ని పలుకుతుండడం వల్ల వారిలో స్వార్థ బుద్ధి విడనాడుతుంది. సమబుద్ధి అలవడుతుంది. తన సాటి వారిలో పరమాత్మను చూడగలిగే నేర్పును నేర్చుకుంటారు.
తత్వమసి సిద్ధాంతమే అయ్యప్ప దీక్షకు పట్టుకొమ్మ. తనలో అయ్యప్పస్వామిని చూసుకొని ఎదుటివారిలో కూడా స్వామివారి రూపాన్ని దర్శించకలగడమే ఈ దీక్ష ప్రత్యేకత. సదా స్వామి శరణం అంటూ ఎదుటివారిని రెండు చేతులు జోడించి నమస్కరిస్తారు.

- చోడిశెట్టి శ్రీనివాసరావు