Others

చిరునవ్వంటే ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరునవ్వంటే.. ఏంటో అడుగు
చివురించే మోడు చెప్తుంది!

దుఃఖం పొంగుకొస్తోంది!
నువ్వు ..ఖాళీ చేసిన మనసు తానాక్రమించాలని!

నీ జ్ఞాపకం !
చీకట్లో కూడా వెంటాడే నీడ!!

కలల్ని ఆపడమంటే
అలల్ని ఒడ్డుకు రావద్దనడమే!!

కన్నీరు తియ్యన!!
నవ్వుతూ.. నవ్వించడం వల్ల వచ్చిందేమో...

జ్ఞాపకాలు
ఇక లేపనాలే.. మది గాయాలకి!!

నీపు తలంబ్రాలు పోస్తాననుకున్నా!
నీకై కన్నీరు కారుస్తాననుకోలేదు!!

కథలు పుట్టుకొస్తున్నాయి
జీవిత సారాన్ని కలంలో సిరాగా నింపానుగా!!

-తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి