Others

సాంకేతికతకు దూరంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి తరం పదేళ్లయినా నిండకుండానే ఫేస్‌బుక్ ఖాతాలు తెరిచేస్తోంది. వీరి నైపుణ్యం చూసి అబ్బురపోతూ.. మా పిల్లలు చాలా ‘స్మార్ట్’ అంటూ మురిసిపోతున్నారు తల్లిదండ్రులు. ఇలా అతిగా గాడ్జెట్స్‌కు అలవాటు పడితే ఇబ్బందులేంటో తెలుసా..
పిల్లలకి సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సంగతి అలా ఉంచితే ఎప్పటికప్పుడు చేస్తున్న సర్వేలు మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మెడలువంచి అరచేతుల్లో స్మార్ట్ఫోన్‌లు చూడడం వల్ల నడుము, మెడనొప్పులు, కంటి సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. అలాగే తగినంత శారీరక వ్యాయామం అందక ఊబకాయం వంటి ఇబ్బందులూ ఎక్కువే.. మరి దీన్నుంచి ఎలా బయటపడాలి.. అని ఆలోచిస్తున్నారా.. తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉన్నా సరే.. రోజూ కనీసం ఒక గంట పాటు వారు శరీరానికి శ్రమ అందే ఆటలు ఆడుకునేలా ప్రోత్సహించాలి. ఫలితంగా పిల్లలు శారీరకంగా దృఢంగా ఉండగలుగుతారు.