Others

జోహార్.. పటేల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహో.. భారత స్వాతంత్య్ర సమరయోధాగ్రణీ
మహనీయ భారత కర్షకాగ్రమణీ,
పటేల్ సర్దార్! అందుకో మా జోహార్

గతకాలపు తెరల మాటున గడచిపోయావ్
భౌతికంగా
ఘన స్వతంత్ర భారత చరిత్రలో నిలిచిపోయావ్
శాశ్వతంగా!

నీకు మరణం లేదు-
మా మానస్సుల్లో నీ స్మరణం మాసిపోదు
నీ జయంతి భారత జాతికి నిత్య స్ఫూర్తి
నీరాజనాలతో స్మరిస్తున్నాం నీ ఘనకీర్తి

సంస్థానాలను ఏకం చేశావ్
సమగ్ర భారతానికి పునాది వేశావ్!
నీ పలుకు ఆంగ్లేయుల గుండెల్లో వాడి ములుకు
నీ అడుగు- వారి గుండెలపై చిచ్చరపిడుగు
పూజ్య బాపూజీకి కుడి భుజానివి
భారత సమగ్రతా స్ఫూర్తికి భద్రగజానివి
బార్డోలీ వీరుడా! నీకు జోహార్!
సార్థక నామధేయుడా.. పటేల్ సర్దార్!

అఖిల భారత జాతి అంతరంగములందు
వీర భారత భూమి విజయ గాథలయందు
వినువీధి తళుకొత్తు వెలుగు తారకవోలె
చిరము, సుస్థిరము నీ కీర్తి సర్దార్
అందుకో అఖిల భారత జాతి జోహార్!
జయహో వల్లభ భాయ్ పటేల్ సర్దార్

దేశ్‌కీ రక్షా పర్ సదారహేగీ
ఆప్‌కీ నజర్
ఆప్‌కీ బాత్ థీ ఏక్ తేజ్ తల్వార్
ఆప్ హై సదా సర్దారోంకే సర్దార్
జోహార్! జోహార్!!
ఆప్‌కా జన్మదిన్ హై భారత్‌కా త్యోహార్
*

-ఉమాపతి బి.శర్మ 92461 71342