Others

దగ్ధ గీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడవులు పల్కరించడం ఇపుడు మానేసాయ్
గాలి ముద్దుపెట్టుకోకుండా తప్పుకుని వెళ్లిపోతుంది
వర్షాలు రావు చినుకు నాకు అందదు
చిన్నారుల ముఖం మీద
చిర్నవ్వు మాయమయ్యింది
ఇది దుఃఖగీతమే
విషాద సముద్రంలో విరక్తి గీతమే
పువ్వులలో మకరందం కనిపించటం లేదు
వెనె్నలలో చల్లదనం
నాకందకుండా మాయమయ్యింది
కాలువల గలగలలు లేవు
కన్నీటి జలజలలు వినిపిస్తూనే ఉన్నాయి
ఇది చీకటి గీతమే
పున్నమి రాత్రి చీకటి ప్రపంచమే
నక్షత్రాల మెరుపు నాకంటిలో తలుక్కుమనటం లేదు
నావూరు నీడ పల్కరింపులో ఆప్యాయత అంతరించింది
తూర్పు విరిసింది కానీ వెలుగు వాటికకీ దూరలేదు
ఇది ఓడిపోయిన గీతమే
ఎడారి గొంతులో దప్పిక గీతమే
చెట్టు నీడ నాది కాకుండా పుట్టల పాలయ్యింది
నా కోకిల పాట నాకు వినిపించకుండ ఆ న్ను బంధీచేశారు
ఒక ముసలి తార ఒంటరి బ్రతుకుల విలవిల లాడింది
ఇది పోరాట గీతమే
తిరుగబడుతున్న అలలగీతమే

-సిహెచ్.మధు.. 9949486122