Others

చెట్టు చెప్పని కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పచ్చని చెట్లను
నరికి నగరపు కృత్రిమ
అడవుల్లో
సంచరిస్తున్నాం

ఒకప్పటి కాలం అంటూ
పుస్తకాల్లో అక్షరాలని చూసి
అల్ప సంతోషులై
కేరింతలు..
కొడుతున్నాం

కాకులు దూరని కారడవి
చీమలు చేరని
చిట్టడవి ఇప్పుడు అంతా
కథల్లోనే..

విధ్వంసం అభివృద్ధి
రూపంలో కాటేస్తుంటే
చెంపదెబ్బకు బదులు
చప్పట్లతో సన్మానిస్తున్నాం..

రాబోయే తరానికి ఎడారి నగరాలను
స్వయంగా నిర్మిస్తున్నాం
స్మశానాల రాజ్యాలకి అధిపతులము
అవుతున్నాం..

మరలా ప్రతి చెట్టు, మాను, అడవిగా మారి
వసంతమై వికసించే రోజు కోసం
ఎదురుచూస్తున్నాను!

-పుష్యమీ సాగర్ 90103 50317