Others

మహిళను గౌరవిద్దాం ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మీటూ’ అంటూ మహిళాలోకం నినదిస్తున్నవేళ మనువు మాటలు మరోసారి మననం చేసుకోవడం అత్యంత ఆవశ్యకం.
మనువు పేరుతో స్ర్తిలకు అనేక నిబంధనలు బంధనాలు విధించాడనే భావన లోకంలో ప్రబలంగా ప్రచారంలో ఉంది. అనేకమార్లు చర్చించబడి రచ్చ గావించబడిన ఆయా అంశాల జోలికి నేను వెళ్ళబోవడం లేదు. మనువు మహిళలను ఏ విధంగా గౌరవించాలో తెలుపుతూ చెప్పిన కొన్ని శ్లోకాలు మనుస్మృతిలో మనకు కానవస్తాయి. ప్రధానంగా వాటిని అందించే ప్రయత్నమే ఇది. పరస్ర్తిలను ఎలా సంబోధించాలో కూడా మనువు నిర్దేశిస్తున్నాడు చూడండి..

శ్లో॥ పరపత్నీ తుయాస్ర్తి స్యాదసంబంధా చయోనితః
తాం బ్రూయా భ్భవతీత్యేవం సుభగే భగినీతిచ (2-129)

తోడబుట్టిన అక్కా చెల్లెళ్ళను ఎలాగూ ‘సోదరీ!’ అనే సంభోదిస్తాం. అలా సోదరీ వర్గంలోకి చేరని పరస్ర్తిలను కూడా ‘అక్కా! చెల్లీ! (్భగినీ)’ అనే సంబోధించమంటున్నాడు ఈ శ్లోకంలో మనువు. కేవలం పిలవడమేకాక అలా భావించి గౌరవించాలన్నమాట. అన్న భార్యయైన వదినెను ఎలా గౌరవించాలో చెబుతున్నాడు చూడండి..

శ్లో॥ భ్రాతుర్భార్యోపసంగ్రాహ్యా సవర్ణా ‚ హన్యహన్యపి,
విప్రోష్య తూపసంగ్రాహ్యా జ్ఞాతి సంబంధి యోషితః॥ (2-132)

అంటే అన్నకు భార్యయైన వదినెకు రోజూ పాదాభివందనం చేయాలని నిర్దేశించాడు మనువు. అలా ఆచరించినవాడు రామాయణంలో లక్ష్మణస్వామి. ఆయన రోజూ సీతమ్మతల్లికి పాదాభివందనం చేసేవాడట. తల్లి యొక్క గొప్పతనాన్ని చెబుతూ మనువు..

శ్లో॥ ఉపాధ్యాయాన్ దశాచార్య ఆచార్యాణాం శతంపితా,
సహస్రం తు పితృన్మాతా గౌరవేణాతిరిచ్యతే॥ (2-145)

అంటే ఉపాధ్యాయుని కంటే పది రెట్లు ఆచార్యుని గౌరవింపవలెను (ఉపాధ్యాయుడంటే ప్రాథమిక స్థాయిలో కేవలం విద్య చెప్పినవాడు కావచ్చు. ఆచార్యుడంటే గురువు). ఆచార్యుని కంటే నూరు రెట్లు తండ్రిని గౌరవింపవలెను. తండ్రికంటే తల్లిని వెయ్యి రెట్లు అధికంగా గౌరవింపవలయును.. అని నిర్దేశించాడు మనువు. వేదము, ఉపనిషత్తులు, శాస్త్రాలు కూడా తల్లికి అధిక ప్రాధాన్యతనిచ్చాయనే విషయం మనకు తెలిసినదే! స్ర్తిల పట్ల మనువు చెప్పిన మంచిని గ్రహించి ఆచరిస్తే స్ర్తిలపై అత్యాచారాలు, అమానుషాలు ఆగిపోతాయి.

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949