Others

గోపికామహత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవింద చరణ లగ్న మానసలయిన గోపికలు జీవిత పరమార్థమును సాధించారు. వారు నిరంతరం కృష్ణ స్మరణలో ఉంటారు . ఒక్క క్షణకాలం కృష్ణస్మరణను లేకపోయినా వారు పరమ వ్యాకులతను పొందుతారు. వారి హృదయములు సదా విశ్వాత్ముడైన ఆ ముకుంద పాదారవింద మకరంద రస పానముతో మత్తిల్లినట్టివి.కోట్ల సంవత్సరాలు శరీరాన్ని శుష్కింపచేసుకొని మునిపుంగవులు దుఃఖ విముక్తికై ఏ పరమాత్మ సాక్షాత్కారమునకై తపస్సు ఆచరిస్తూ ఉంటారో ఆ పరమాత్మను తమ మనస్సుల్లో కట్టిపడేసు కున్నట్టి పరమయోగులు వారు.
ఆ భగవంతుని అనంత లీలా వైభవ గాథా లహరియందు ఓలలాడే గోపికలకు లే నిది ఏముంది. కావాల్సింది ఏముంది? గోపికల చరణ స్పర్శచే పునీతనులయిన బృందావన లతా కుంజములలోని ఏ లతగానో, ఏ పొదగానో పుట్టి నా జన్మను చరితార్థము చేసుకుంటాను. మహాకృష్ణ్భక్తుడయిన ఉద్ధవుడు అన్నాడంటే ఆ గోపికల మహత్వం వర్ణించ డానికి మాటలు చాలుతాయా? గోపికల మహత్త్వం, వారి ప్రేమ తత్త్వమును వర్ణించటం బ్రహ్మ కైనను అసంభవమే అంటారు. అట్లాంటి గోపికల జీవనం పరమోత్తమైంది. అందుకే కలియుగంలో ఉన్ననూ గోపికల జీవితమాధుర్యవిశేషాలను అనుసంధానించు కుంటూ ఉంటే ఆ పరమాత్మ దయామృతాన్ని సులభంగా గ్రోలవచ్చు.

- వాణిప్రభాకరి