Others

చిరు అడిగినా.. చేయదట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాప్ రేంజ్‌లో దూసుకుపోతున్న హీరోయిన్లు సైతం మొహమాటానికో, క్రేజ్ కోసమే -ఐటెమ్స్ చేస్తూ పాపులార్టీని ఒకపక్క, కమర్షియాలిటీని మరోపక్క ఒడిసి పట్టుకుంటున్న రోజులివి. బాలీవుడ్ హీరోయిన్లలో ఈ కోణం కాస్త ఎక్కువే. కొందరు సౌత్ హీరోయిన్లు కూడా బాలీవుడ్ బాటపట్టి ఐటెమ్స్ చేస్తున్నారు. కానీ, రెజీనా అందుకు విరుద్ధమట. కొద్దిరోజులు క్రితం రెజీనా ఐటెంసాంగ్ చేస్తోందన్న కథనాలు వెలువడ్డాయి. అందులోనూ మెగాస్టార్ మళ్లీ వస్తున్న 150వ సినిమాలో అని. అయితే, ఈ వార్తలపై రెజీనా తీవ్రంగానే స్పందించింది. చిరు సినిమాలో ఐటెమ్ చేస్తున్నట్టు వచ్చిన కథనాల్లో నిజం లేదంటూనే.. సాక్ష్యాత్తూ చిరంజీవే అడిగినా ఐటెమ్ సాంగ్ చేసేది లేదని నిర్థారించింది. రెజీనా చిరంజీవికి షాకిచ్చిందో, చిరంజీవి యూనిట్టే రెజీనాకు షాకిచ్చిందో మొత్తానికి -రెజీనా అయితే ఐటెమ్ చేయడం లేదట.