Others

గీతా బోధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి బుద్ధి వ్యామోహములకు దూరం చేసి అసలు నిజం తెలుసుకొనేట్టుగా చేసి కర్తవ్యోన్ముఖునిగా తీర్చిదిద్దేదే భగవద్గీత. కర్తవ్యానుగుణమైన కర్మ ప్రాధాన్యతను వివరించి జీవితాన్ని ఋజుమార్గంలో నడిపించి మనిషిని మహనీయుడిని చేసే అద్భుత శక్తి భగవద్గీతే.
అటువంటి భగవద్గీతలో ఏ అధ్యాయాలు చదివితే ఏ జ్ఞానం లభ్యమవుతుందో తెలుసుకొందాం.
1.మొదటి అధ్యాయం ‘అర్జున విషాదయోగం’ - పూర్వజన్మ స్మృతి కలిగిస్తుంది. 2.సాంఖ్యయోగం -ఆత్మస్వరూపాన్ని తెలియజేస్తుంది. 3.కర్మయోగం- అకాలమృతి నొంది ప్రేతత్వం పోని జీవులు పరిసరాలో ఉంటే వాటి ప్రేతతత్వం నశిస్తుంది. 4,5.జ్ఞానయోగం, కర్మ సన్యాసయోగం - పశుపక్షుల పాపం నశించి ఉత్తమ గతిని పొందుతాయి. 6.ఆత్మసంయమనయోగం - సమస్త దానాల ఫలితం కలిగిస్తుంది. 7.విజ్ఞానయోగం- జన్మరాహిత్యం, 8.అక్షర పరబ్రహ్మయోగం- స్థావరత్వం, బ్రహ్మరాక్షసత్వం దూరవౌతాయి. 9.రాజవిద్యా రాజగుహ్యయోగం- పరులనుండి ఏదైనా గ్రహిస్తే వారినుండి సంక్రమించే పాపం నశిస్తుంది. 10.విభూతి యోగం- ఆశ్రమ ధర్మాల సక్రమ నిర్వహణ వల్ల లభించే పుణ్యం కల్గుతుంది. 11.విశ్వరూప సందర్శన యోగం- మృతులు కూడా పునర్జువులౌతారు. 12.్భక్తియోగం పారాయణము- ఇష్టదేవతా సాక్షాత్కారం లభిస్తుంది. 13.క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - చండాలత్వం దూరవౌతుంది. 14.గుణత్రయ విభాగయోగ - స్ర్తిహత్యా పాతకము, వ్యభిచార దోషం నశించును. 15.పురుషోత్తమ ప్రాప్తియోగం- ఆహారశుద్ధి కలుగుతుంది. 16.దైవాసుర సంపద్విభాగ యోగము- అధైర్యము నశించి ధైర్యము కలిగి సుఖశాంతులు లభిస్తాయి. 17.శ్రద్ధాత్రయ విభాగయోగం - సమస్త భయంకర రోగాలు దూరమై స్వస్థత చేకూరుతుంది. 18.మోక్షసన్న్యాస విభాగయోగం - సకలారిష్టాలు తొలగి మోక్షప్రాప్తి కలుగుతుంది.కనుక అందరూ భగవద్గీత అంతా చదవాలి.

- కూచిబొట్ల వెంకటలక్ష్మి