Others

ఈ సేవ ఎంతో ఉన్నతం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శానిటరీ ప్యాడ్‌లు అనగానే అందరూ తలలు దించేసుకుంటారు. ముఖం చాటేస్తారు. ఇదేం అంత సిగ్గుపడాల్సిన విషయం కాదు. లఘుశంకలాగే ఇది కూడా ప్రకృతి అవసరం అని ఎంతమంది ఆలోచిస్తున్నారు చెప్పండి? దీని గురించి ఆలోచించి పేద బాలికలకు, తండాల్లో ఉన్న మహిళలకు వాటి గురించి అవగాహనను అందించడంతో పాటు ఉచితంగా శానిటరీ ప్యాడ్‌లను అందిస్తోంది మీనామెహతా.. వివరాల్లోకి వెళితే..
దానగుణం చాలా గొప్పది. భారతదేశంలో చాలామంది చాలారకాల వస్తువులు దానం చేస్తుంటారు. కానీ శానిటరీ ప్యాడ్‌లు, లోదుస్తులను కూడా ఇతరులకు ఇవ్వొచ్చు అని కొద్దిమందే ఆలోచిస్తారు. మహిళలకు ఇవి చాలా అవసరం. కానీ వాటిని కొనలేని వారి పరిస్థితి ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన మీనా మెహతా. ఈమెను సూరత్‌లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు ‘ప్యాడ్ బామ్మ’ అని పిలుస్తుంటారు. మురికివాడల్లోని అమ్మాయిలు ‘ప్యాడ్లు ఇచ్చే అక్క’ అని అంటుంటారు. మీనా మురికివాడల్లోని అమ్మాయిలకు హెల్త్ కిట్లు ఇస్తుంటారు. ప్రతినెలా వివిధ పాఠశాలలకు వెళ్లి ఐదు వేల వరకు ప్యాడ్లను బాలికలకు ఉచితంగా అందిస్తుంటారు. మురికివాడల్లో ఉండే అమ్మాయిలకు ప్యాడ్లు, లోదుస్తులతో ఉండే కిట్లను పంచి పెడుతుంటారు. మురికివాడల్లో బాలికల దుస్థితిని గమనించిన మీనా, కేవలం ప్యాడ్లు ఇవ్వడం వల్లే పరిస్థితి మారదని, అన్నింటికీ అదే పరిష్కార మార్గం కాదని గ్రహించారు. అందుకే ప్యాడ్లతో పాటు హెల్త్ కిట్‌ను కూడా వాళ్లకు అందిస్తున్నారు. ఇందులో రెండు లోదుస్తులు, షాంపూ ప్యాకెట్లు, సబ్బు, ఎనిమిది శానిటరీ ప్యాడ్లు ఉంటాయి.
2004లో తమిళనాడును సునామీ ముంచెత్తినప్పుడు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి అక్కడి బాధిత మహిళకు ప్యాడ్లు అందించారు. ‘నిరాశ్రయులకు బట్టలు, నిత్యావసర వస్తువులు అందరూ ఇస్తారు. కానీ కూడు, గూడు కోల్పోయిన మహిళలు, అందునా నెలసరిలో ఉన్నవాళ్ల పరిస్థితి ఏంటీ? అని సుధామూర్తి ఒకసారి అన్నారు. ఆమె మాటలే పేదలకు ప్యాడ్లు పంచిపెట్టడానికి స్ఫూర్తినిచ్చాయి’ అంటారు మీనా. ‘చెత్తకుప్పలో పడేసిన ప్యాడ్లను ఇద్దరు అమ్మాయిలు తీసుకోవడం చూశా. వాటిని ఏం చేసుకుంటారని అడిగా.. ఉతికి మళ్లీ వాడుకుంటామని చెప్పారు. ఆ మాటలకు దిగ్భ్రాంతి చెందా’ అని తనకు ఎదురైనా ఒక అనుభవాన్ని మీనా చెప్పారు.
తొలుత పనిమనిషికి, ఓ ఐదుగురు అమ్మాయిలకు ప్యాడ్లు ఇవ్వడం మొదలుపెట్టి, తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు ప్యాడ్లు ఇవ్వడం ప్రారంభించింది మీనా. ఒకసారి మీనా అలా పాఠశాలలో ప్యాడ్లు పంచుతున్నప్పుడు ఒక అమ్మాయి మీనా దగ్గరకు వచ్చి ‘బామ్మా.. మీరు ప్యాడ్లు ఇస్తున్నారు కానీ వీటిని వాడటానికి మాకు లో దుస్తులు కూడా లేవు’ అని చెప్పిందట. అప్పటినుంచి మీనా వాళ్లకు లో దుస్తులు కూడా ఇవ్వడం మొదలుపెట్టింది. ‘మురికివాడల్లో ఉండే అమ్మాయిలు శుభ్రత పాటించలేక అనారోగ్యం పాలవుతుంటారు. అందుకే వారిని ప్రాథమికంగా ఉపయోగపడే హెల్త్ కిట్ అందిస్తున్నాను’ అని మీనా తెలిపారు. ‘ఈ విషయం తెలిసిన సుధామూర్తి ఆశ్చర్యపోయింది. మహిళలకోసం నేను ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నాను. కానీ నాకు ఎప్పుడూ ఈ ఆలోచన రాలేదు అని ఆమె నాతో చెప్పారు. తర్వాత లక్షరూపాయల విలువచేసే ప్యాడ్లను రెండుసార్లు నాకు పంపారు’ అని మీనా గుర్తుచేసుకుంది. మీనా పనికి మొదట్లో ఆర్థికంగా చేయూతనందించి ఆమె భర్త అతుల్ మెహతా ఒక్కరే. ఆయనే రూ. 25 వేలు అందించి అండగా నిలిచారు. ప్రస్తుతం చాలామంది తనకు అండగా నిలుస్తున్నారని, లండన్, ఆఫ్రికా, హాంకాంగ్ నుంచి కూడా ఆర్థిక సాయం అందిస్తున్నారని మీనా తెలిపింది.
మీనా మెహతా మనుని పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను కూడా నడుపుతున్నారు. మీనా ఇచ్చే ప్యాడ్లు ఉపయోగిస్తున్నవాళ్లు దురద, అపరిశుభ్ర సమస్యలు రావడం లేదని చెబుతున్నారు అంటే అవి సౌకర్యవంతంగానే ఉన్నాయని మీనా భావిస్తోంది. సమాజం ఇప్పటికీ నెలసరి వచ్చిన మహిళలను బయటకు రానివ్వకుండా వివక్షతో చూస్తోందని ఆమె పేర్కొన్నారు. కూరగాయలు అమ్మే మహిళల దగ్గర కూరగాయలు కొనాలంటే చాలామంది రుతుస్రావం గురించి అడిగాకే వాళ్ల దగ్గర కొంటుంటారు. నెలసరిపై ఉన్న ఇలాంటి అంటరానితనం, అపోహలు ఆమోదనీయం కాదు అంటున్నారు మీనా.